న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్‌షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు.
అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు.
అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment