ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు? | Shahid Kapoor, Malaika Arora to Meet Donald Trump? | Sakshi
Sakshi News home page

ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు?

Published Fri, Sep 2 2016 12:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు? - Sakshi

ట్రంప్ ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు?

రిపబ్లికన్ పార్టీ అమెరికన్ అధ్యక్ష పదవి అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ తరఫున బాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హిందూ అమెరికన్లను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి అభ్యర్థుల మొదటి డిబేట్ కు రెండు రోజుల ముందు న్యూజెర్సీలో ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు సమాచారం.

రిపబ్లికన్ హిందూ సమాఖ్య(ఆర్ హెచ్ సీ) తాము నిర్వహించనున్న ఈవెంట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. షాహిద్ కపూర్, మలైకా అరోరా, అమీషాపటేల్, ప్రభుదేవా, సింగర్ కనికా కపూర్ ఆ ఫోటోలో ఉన్నారు. వీరందరూ టెర్రరిజానికి వ్యతిరేకంగా న్యూజెర్సీలో ఏర్పాటు చేసే షోలో పాల్గొని, ఆ తర్వాత ట్రంప్ ను కలుస్తారని సమాచారం. అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బును టెర్రరిజం బాధితులకు అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement