న్యూజెర్సీలో 'ఆటా' మహిళా దినోత్సవం | ATA Womens day in New Jersey | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం

Published Sat, Mar 17 2018 2:15 PM | Last Updated on Sat, Mar 17 2018 2:15 PM

ATA Womens day in New Jersey - Sakshi

న్యూ జెర్సీ : అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వాహక సంఘం సభ్యురాలు ఇందిరారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అతిపిన్న వయస్సున్న ఆసియన్‌ అమెరికన్‌ న్యూ  జెర్సీ  స్టేట్  సెనెటర్ విన్  గోపాల్ విశిష్ట అతిధిగా రావడంతో పూర్వ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కారి సభకు పరిచయం చేశారు. విన్‌ గోపాల్ మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళలు అన్నిరంగాల్లో ఆర్థిక స్వావలంబన, వ్యాపార రంగం సేవా రంగాల్లో రాణించడం గురించి చర్చించారు. న్యూ జెర్సీ ఫ్రీ హోల్డర్ కుమారి శాంతి నర్రా మాట్లాడుతూ మహిళలు కూడా అమెరికా రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు.

ఆటా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ అమెరికా తెలుగు అసోసియేషన్‌ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్‌, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ సంయుక్తంగా డల్లాస్‌, టెక్సాస్‌లలో మే 31, జూన్‌ 1, జూన్‌ 2 తేదీలో మూడు రోజులపాటూ నిర్వహించబోయే తెలుగు కన్వెన్షన్‌కు హాజరు కావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు. అదే విధంగా అందరు ఆటా సభ్యత్వం తీసుకోవాలని కోరారు.

ఆటా న్యూ జెర్సీ ప్రాంతీయ సమన్వయకర్తలు రవీందర్ గూడురు, విలాస్ రెడ్డి జంబుల, లోకల్ ఆటా బోర్డు ట్రస్టీ సభ్యులు, స్టాండింగ్‌ కమిటీ ఛైర్స్‌ మిగితా ఆటా లోకల్‌ సభ్యులు కలిసి ఈ  కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో కృషి చేశారు. అలాగే, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్  పరమేష్ భీంరెడ్డి, మాజీ ప్రెసిడెంట్ సుధాకర్ పెర్కారి, రాజేందర్‌ జిన్నా, సలహా కమిటీ సహ కన్వీనర్‌ సురేష్‌ జిల్లా ట్రస్టీలు పరశు రామ్‌, పిన్నపురెడ్డి, రఘు రెడ్డి, శ్రీను దార్గుల, రవి పటోళ్ల, స్టాండింగ్‌ కమిటీ రమేష్‌ మాగంటి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్ గుడిపాటి, రీజినల్‌ అడ్వైజరీ రాజ్‌ చిములలు తమవంతు సహాయసహకారాలు అందించారు. అదేవిధంగా కమ్యునిటీ లీడర్స్‌ నాటా ప్రెసిడెంట్‌ రాజేశ్వర్‌ గంగసాని, తానా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విద్య గారపాటి, టీపాస్‌ ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్ ఉప్పల, సిలికానాంధ్ర మనబడి వైస్‌ ప్రెసిడెంట్‌ శరత్ వేట, టాటా సభ్యులు శివ బి రెడ్డిలు, పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమానికి తమ వంతుగా మందు ఉండి సహాయ సహకారాలు అందించిన నందిని దార్గుల, మాధవి అరువ, అనురాధ దాసరి, వినీల రెడ్డి, అరుంధతి షాకెళ్లి, ఇందిరా సముద్రాల, శ్రీదేవి ఒబ్బినేని, నందిత తడసిన, దీపిక బెలూం, మాధవి గూడూరు, జమున పుస్కూర్‌, భాను మాగంటి, సంగీత ధన్నపనేని, మాధవ గూడూర్‌, స్వర్ణ భీం రెడ్డి, జ్యోతి, నిహారిక గుడిపాటి, శ్రీలత రెడ్డి, చిత్ర లేఖ జంబులను ఆటా కార్యవర్గం అభినందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తరచుగా వార్తల్లో తారసిల్లే భారతీయ మహిళలను గురించి సంయుక్తంగా నిర్వహించిన క్విజ్ పోటీ అందరిని ఆకట్టుకుంది. సభ్యులు ఉత్సాహంగా క్విజ్ లో పాల్గొని సమాధానాలు చెప్పడంలో పోటీ పడ్డారు. విజేతలందరికీ తగిన రీతిలో బహుమతులు అందజేశారు.

ఇలాంటి సందర్భాల్లో ఏర్పాటు చేసే చీరెలు, బంగారు ఆభరణాల స్టాళ్లలో సందడి కనిపించింది. చక్కటి వ్యాపారం జరిగినందుకు స్టాళ్ల నిర్వాహకుల్లో ఆనందం కనిపించింది. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/10

2
2/10

3
3/10

4
4/10

5
5/10

6
6/10

7
7/10

8
8/10

9
9/10

10
10/10

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement