డల్లాస్‌లో 'ఆటా - టాటా' మహిళా దినోత్సవ వేడుకలు | ATA TATA Womens day celebrations in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో 'ఆటా - టాటా' మహిళా దినోత్సవ వేడుకలు

Published Fri, Mar 23 2018 1:51 PM | Last Updated on Fri, Mar 23 2018 1:56 PM

ATA TATA Womens day celebrations in Dallas - Sakshi

డల్లాస్‌ : ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టాటా)లు సంయుక్తంగా టెక్సాస్‌లోని ప్లానోలో మినర్వా బాంక్వెట్‌ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు, యువతులు భారీ ఎత్తున పాల్గొని ఆటా, పాటలతో  కార్యక్రమాన్ని ఆద్యంతం ఉర్రూతలూగించారు. రామ్‌ అన్నాడీ, అశోక్‌ కొందాల(ఆటా రీజినల్‌ కోఆర్డినేటర్స్ ఆఫ్‌ డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్), చంద్రారెడ్డి పోలీస్‌ (టాటా రీజినల్‌ వైస్‌ ప్రెటిడెంట్‌ ఆఫ్‌ డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్) ఆధ్వర్యంలో ఆటా - టాటా సంయుక్తంగా మార్చి17న ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. ఇటీవలే మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవికి సభ్యులు నివాళులు అర్పించారు.

ఆటా మహిళా ప్రతినిధులు డా. సంధ్య గువ్వ, మాధవి సుంకిరెడ్డి, మాధవి లోకి రెడ్డి, నిలోహితా కొట్టా, ప్రసన్న దొంగురు, అనురాధ మేకల, మధుమతి వైశ్య రాజు, దీప్తి సూర్యదేవర యార్లగడ్డ, సంధ్య మద్దూరి, టాటా మహిళా ప్రతినిధులు సమీరాఇల్లెందుల, రూపా కకన్నయ్యగరి, సునితా త్రిపురం, శాంతి నూతి, పద్మశ్రీ తోట, గోమతి సుంధరబాబు, స్వేత గుండపనేని, జ్యోశ్న ఉండవల్లిలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ఎంతగానో కృషి చేశారు.  డ్యాన్సులు, పాటలు, ఫ్యాషన్‌ షో, ఆటలతో పాటూ మహిళా సాధికారతపై జరిపిన చర్చాగోష్టి కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీదేవి నటించిన చిత్రాల్లోని పలు పాటలను స్థానిక సింగర్స్‌ వీనా యలమంచిలి, శ్రియ వస్కర్లలు పాడి తమ గాత్రంతో అందరిని ఆకట్టుకున్నారు. మంచి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం, అలవాట్లతోపాటూ మహిళలు కుటుంబం, పనిని ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలనే అంశాలపై వక్తలు డా. సుధా కల్వగుంట్ల, డా. హిమబిందు రెడ్డి, డా. యమునా గుర్రపు, డా. సంధ్యా గువ్వా, సమీరా ఇల్లెందుల ప్రసంగించారు.

సమాజానికి మహిళలు పిల్లర్లలాంటి వారని టాటా అధ్యక్షులు హరనాథ్‌ పొలిచెర్ల అన్నారు.  మే 31, జూన్ 1, 2వ తేదీల్లో డల్లాస్ లో ఆటా-టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డల్లాస్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్తలు శారదా సింగిరెడ్డి, కళ్యాణి తడిమేటి, ఇందు పంచార్పుల, కవిత బ్రహ్మదేవరలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేశారు.
 
డల్లాస్ ఫోర్ట్‌ వర్త్‌ ఆటా సభ్యులు మహేందర్‌ గణపురం, కలాసాని, అశోక్‌ పొద్దుటూరి, అశ్విన్‌ కేంచా, ఫణీందర్‌ రెడ్డి, వెంకట్‌ ముసుకు, దామోదర్‌ ఆకుల, రమణ లష్కర్‌, రవికాంత్‌ మామిడి, డల్లాస్ ఫోర్ట్‌ వర్త్‌ టాటా సభ్యులు పవన్‌ గంగాధర, శరత్‌ రెడ్డి యెర్రం, సురేష్‌ పాతనేని, శ్రీనివాస్‌ తుల, విజయ్ బాల, నిరంజన్‌ రెడ్డి, ఉదయ్‌ నిదిగంటి, నిశాంత్‌ సిరికొండ, రత్న ఉప్పాలలు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తమవంతు తోడ్పాటును అందించారు.

ఆటా సభ్యులు అజయ్‌ రెడ్డి( బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ ), సతీష్‌ రెడ్డి( మాజీ బోర్డ్ ఆఫ్‌ ట్రస్టీ), ఆత్మాచరణ్‌ రెడ్డి(మాజీ ఆటా అధ్యక్షులు), రఘువీర్‌ బండారు(బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ), రాజ్‌ ఆకుల, టాటా జనరల్‌ సెక్రటరీ విక్రమ్‌, ట్రెజరర్‌ మహేష్ ఆదిభట్లలు ఇచ్చిన సూచనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆటా- టాటా సభ్యులు, ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన అతిథులకు మాధవి సుంకిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement