womens day celebrations
-
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ ప్రయాణంపై నీతా వీడియో
-
మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు తన తల్లి & భార్య గురించి...
-
Womens Day: కన్న పేగు బంధం అమ్మది..
-
London: మహిళలు ఇల్లే కాదు.. సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకం!
'ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు, తోడుగా నిలబడితే 11 అని చాటుతూ, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవాస మహిళలు 'తెలుగు లేడీస్ ఇన్ యూకే' అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు'. ఈ ‘తెలుగు లేడీస్ యూకే (UK)’ గ్రూపును శ్రీమతి శ్రీదేవి మీనావల్లి డిసెంబర్ 2011న ప్రారంభించారు. ఈ టీఎల్‌యూకే (TLUK) గ్రూపులో సుమారు 5,000 మంది పైగా తెలుగు మహిళలు ఉన్నారు. బ్రిటన్‌కు వలస వచ్చే తెలుగు ఆడపడుచుల అందరికీ నూతన పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా, వైద్య, ఆర్థిక సందేహాలు, సలహాల ద్వారా చేయూతను అందించడమే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం అని శ్రీదేవి గారు తెలిపారు. ప్రతి సంవత్సరంలా కాకుండా వినూత్నంగా ఈ ఏటా సెంట్రల్ లండన్ లోని థేమ్స్ నదిపై ఒక ప్రైవేట్ క్రూయిజ్ లో ఈ వేడుకలు జరుపుకున్నారు. థేమ్స్ నదిపై నాలుగు గంటల పాటు ప్రయాణం చేస్తూ విందు వినోదాలతో ,ఆటపాటలతో, లైవ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఉల్లాసంగా గడిపారు. ఆట పాటలతో పాటు రాఫెల్ ద్వారా ఈ గ్రూపు నిర్వహించే విద్యా వైద్య సేవా కార్యక్రమాల్లో తోడ్పడి మహిళలందరూ తమ చేయూతను అందించారు. మహిళలు ఇల్లే కాదు సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకమో చాటిచెప్పారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, జ్యోతి సిరపు, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా తానా సౌత్ సెంట్రల్ మహిళా దినోత్సవ వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' సౌత్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సాధికారతకు ప్రతిబింబం అనేలా ఘనంగా నిర్వహించారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలో తానా సౌత్ సెంట్రల్ ప్రాంతీయ సమన్వయకర్త కిషోర్ యార్లగడ్డ, మహిళా సమన్వయకర్త కిరణ్మయి బిత్ర మార్చి 11న ఈ వేడుకలను నిర్వహించారు. స్థానిక హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకలను టెంపుల్ అధ్యక్షులు డాక్టర్ రాజ్యలక్ష్మి నాయుడు, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, 2017 తానా కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ కూర్మనాధ్ చదలవాడ.. స్థానిక తానా నాయకులు రాజా సూరపనేని, విజయ్ సాక్షి, మురళి పుట్టగుంట, ఏమాష్ గుత్త, కిశోర్ ఎరపోతిన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి 'బ్రేక్ ది బయాస్' అనే థీమ్‌తో ఈ వేడుకలు నిర్వహించడాన్ని అభినందించారు. అలాగే అన్ని విషయాలలోనూ మహిళలను ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేయడంలో తానా ఎప్పుడూ ముందుందన్నారు. వెంకట్ బిత్ర, కిషన్ బాగం, రామ్ కొల్లూరు, వెంకట్ గౌని, రామకృష్ణ కృష్ణస్వామి, నరేష్ అనతు మరియు నరేష్ జాస్తి రిజిస్ట్రేషన్ ఏరియాలో సహాయం చేసారు. సుమారు 600 మంది పాల్గొన్న ఈ వేడుకలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అతిధుల ఉపన్యాసాలు, సరదా సరదాగా అట పాటలు, రాఫుల్ బహుమతులు, వైవిధ్యమైన శ్రీవారికి ప్రేమలేఖ, హెల్దీ కుకింగ్, పెయింటింగ్, నారీ శక్తి, ట్రెజర్ చెస్ట్, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సత్కరించారు. వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి మరియు గాయకులు శ్రీకాంత్ సండుగు తమ ఆట పాటలతో ప్రేక్షకులతో మమేకమై ఆద్యంతం కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కొన్ని పాటలకు మహిళలందరూ డాన్స్ చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. చివరిగా స్పాన్సర్స్ మరియు శ్రీనివాస్ పర్వతనేని, శేషు ఇంటూరి, మురళి పుట్టగుంట, రామ్మోహన్ పదురు, అలాగే హాజరైన మహిళామణులు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతంగా ముగించారు. -
AP: మన మహిళ మేటి.... సాధికారత సాధించాం
ఆధునిక ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు సాధారణంగా ఏ సభలోనైనా నాయకులు స్టేజ్ మీద, ప్రజలు కింద ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. ఇటు స్టేజ్ మీద, అటు స్టేడియం నిండా ఉన్న వేల మందిలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. సాధికారతకు ప్రతినిధులు. మన సమాజం, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి నిద ర్శనం. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు మీరంతా ప్రతినిధులు. – మహిళా దినోత్సవ సదస్సులో సీఎం జగన్ జీవనోపాధికి దారి చూపారు ఆర్థిక పరిస్థితితో టెన్త్‌లోనే చదువు మానేశాను. తర్వాత ప్రమాదంలో కుడి చేయి తెగిపోయింది. ఎడమ చేత్తోనే కంప్యూటర్ నేర్చుకున్నా. ఎంబీఏ కూడా పూర్తిచేశా. ఆ తర్వాత మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. నేను గర్భవతిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ సీఎం అయ్యారు. పొదుపు సంఘాల పేరిట బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాను. ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా ప్రభుత్వమిచ్చిన డబ్బులతో చీరల వ్యాపారం చేస్తున్నాను. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకొని రోజుకు రూ.700 నుంచి రూ.1,000 ఆదాయం పొందుతున్నాను. – మహ్మద్ సుల్తానాబేగం, యనమలకుదురు, కృష్ణాజిల్లా సాక్షి, అమరావతి: మహిళా సాధికారతలో దేశంతోనే పోటీ పడుతూ నంబర్ వన్ స్థానంలో నిలిచామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో మనమే మేటి అని గర్వంగా చెబుతున్నామన్నారు. మహిళా సాధికారత గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేసి మాట్లాడారు. ఆ వివరాలివీ.. విజయవాడలో సభా వేదికపై సీఎం జగన్. చిత్రంలో మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మలకు అండగా.. నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మల్లో దాదాపు 99 శాతం మంది వార్డు మెంబర్లుగానో, సర్పంచ్‌లుగానో, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగానో, మునిసిపల్ కౌన్సిలర్లుగానో, మునిసిపల్ చైర్మన్లుగానో, కార్పొరేటర్లుగానో, మేయర్లుగానో లేదా ఏదో ఒక కార్పొరేషన్ ఛైర్మన్‌గానో, డైరెక్టర్‌గానో ఉన్నారు. ఇంకా నా మంత్రివర్గ సహచరులైన అక్కచెల్లెమ్మలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులున్నారు. బహుశా దేశ చరిత్రలో ఇలాంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదని గర్వంగా చెబతున్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో లభించిన ఈ అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగించామో క్లుప్తంగా చెబుతున్నా. ఈ నిజాలను గ్రామ గ్రామాన, ప్రతి ఇంట్లో చెప్పాలని సవినయంగా కోరుతున్నా. రాజకీయ సాధికారత.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్లో బిల్లులు పెడుతూనే ఉన్నా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. 1,154 డైరెక్టర్ పదవుల్లో అక్కచెల్లెమ్మలకు 586 ఇచ్చాం. 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చాం. మొత్తం 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688 అంటే అక్షరాలా 51 శాతం అక్కచెల్లె్మ్మలకు కేటాయించాం. మహిళా దినోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం జగన్. సభకు హాజరైన మహిళలు అక్క చెల్లెమ్మలకు అధికారం.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్‌ఛైర్మన్‌గా సోదరి జకియాఖాన్ను నియమించాం. ఉప ముఖ్యమంత్రిగా మరో సోదరి, ఎస్టీ మహిళ పుష్పశ్రీవాణిని, హోం మంత్రిగా దళిత సోదరి సుచరితను నియమించాం. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సోదరి నీలం సాహ్నిని నియమించాం. 13 జడ్పీ ఛైర్మన్ల పదవుల్లో ఏడుగురు నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. అంటే 54 శాతం మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వై‹స్ చైర్మన్ పదవుల్లో 15 మంది అంటే 58 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తం 36 పదవుల్లో 18 మంది అంటే 50 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 మంది కాగా అక్కచెల్లెమ్మలకు 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ఇటీవల 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది అంటే 64 శాతం మంది నా అక్కచెల్లెమ్మలే ఛైర్పర్సన్లు. ఇంకా 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది అంటే 55 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కేటట్లు చేశామని గర్వంగా చెబుతున్నా. సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కేలా చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం మంది నా చెల్లెళ్లే ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల మంది పని చేస్తుండగా వారిలో 51 శాతం నా చెల్లెమ్మలే ఉన్నారు. మనలా ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? దేశంలో మనతో సరిసమానంగా ఆడపడుచులను బలపర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు. మనలా ఏ రాష్ట్రంలోనైనా ఉందా? నా ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలని కోరుతున్నా. అమ్మ ఒడి.. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు రూ.15 వేలు చొప్పున ఇచ్చే జగనన్న అమ్మ ఒడి ఉందా? 44.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రెండేళ్లలో రూ.13,022 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా.. ఏ రాష్ట్రంలోనైనా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణభారంతో ఇబ్బందులు పడకూడదని డబ్బులు తిరిగి ఇస్తున్న వైఎస్సార్ ఆసరా లాంటి పథకం ఉందా? ఈ పథకంతో 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.12,758 కోట్లు చెల్లించాం. నాలుగు విడతల్లో మొత్తం రూ.25,512 కోట్లు అందచేస్తాం. వైఎస్సార్ సున్నా వడ్డీ.. పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం మరెక్కడైనా ఉందా? వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశాం. వైఎస్సార్ చేయూత.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చే వైఎస్సార్ చేయూత లాంటి పథకం ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకం ద్వారా 24.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటివరకు రూ.9,180 కోట్లు అందచేశాం. వైఎస్సార్ పెన్షన్ కానుక.. దేశంలోనే అత్యధికంగా రూ.2,500 చొప్పున పెన్షన్ అది కూడా ప్రతి నెలా ఒకటో తేదీన సెలవైనా, పండగైనా సరే ఇంటివద్దే ఏ ప్రభుత్వమైనా ఇస్తోందా? వైఎస్సార్ పెన్షన్ కానుకలో 61.74 లక్షల పెన్షన్లు ఇస్తుండగా వారిలో 36.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వారికి రూ.28,885 కోట్ల పెన్షన్లు ఇచ్చాం. ఇళ్లు–ఇళ్ల స్థలాలు–ఆస్తి.. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అది కూడా అక్కచెల్లెమ్మల పేరుతో 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తూ ఇళ్లు కట్టించడం దేశంలో మరెక్కడైనా ఉందా? ఇల్లు పూర్తైన తర్వాత ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు. విద్యాదీవెన, వసతి దీవెన.. పెద్ద చదువుల కోసం అప్పులపాలు కాకుండా ఏ ప్రభుత్వమైనా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తోందా? జగనన్న విద్యాదీవెన ద్వారా 21.50 లక్షల మంది తల్లులకు రూ.6,260 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.1,800 కోట్లు కూడా చెల్లించాం. వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2,305 కోట్లు జమ చేశాం. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా గర్భిణిలు, బాలింతలకు మంచి ఆహారం అందజేస్తున్నాం. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చడంతోపాటు ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌తో 30.16 లక్షల మందికి మేలు జరుగుతోంది. ఈ పథకానికి గత సర్కారు ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా ఇప్పుడు రూ.2 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఈబీసీ నేస్తం దేశంలో తొలిసారి... వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా దాదాపు 3.93 లక్షల మంది నిరుపేద ఓసీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రూ.589 కోట్లు అందచేశాం. నేరుగా రూ.83,509 కోట్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 34 నెలల వ్యవధిలో అక్కచెల్లెమ్మలకు నేరుగా నగదు బదిలీ ద్వారా అందించిన మొత్తం రూ.83,509 కోట్లు. పరోక్షంగా మరో రూ.34,841 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన మొత్తం సొమ్ము రూ.1.18 లక్షల కోట్లు. ఇవే కాకుండా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ స్వేచ్ఛ, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు.. ఇవన్నీ బాలికలను పెద్ద చదువులు చదివించడంలో ఒక నిశబ్ద విప్లవంలా తోడ్పడుతున్నాయి. దిశ యాప్ బ్రహ్మాస్త్రం.. దిశ యాప్ ఒక బ్రహ్మాస్త్రం అయితే ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్ నియామకం మరో అస్త్రం. మహిళల రక్షణ కోసం ఎక్కడా లేనివిధంగా దిశ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా రూపొందించాం. ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి కోసం ప్రయత్నిస్తూనే కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాం. 1.13 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే అన్న తోడుగా ఉన్నట్లే. యాప్ ద్వారా ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 900 మంది అక్కచెల్లెమ్మలను కాపాడాం. దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు దేశంలోనే అతి పెద్ద అడుగు. రూ.87 కోట్లు కేటాయించి ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఏమాత్రం ఉపేక్షించం.. గత సర్కారు హయాంలో 2017లో నేరాల దర్యాప్తునకు ఒక్కో కేసుకు సగటున 169 రోజుల సమయం పడితే 2021లో 61 రోజులకు తగ్గింది. కేవలం 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన కేసులు 1,132. మహిళలపై నేరాలకు సంబంధించి దేశంలో ఎక్కడా ఇంత వేగంగా దర్యాప్తు చేయడం లేదు. మహిళలపై సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 2,134 హిస్టరీ షీట్స్, 1,531 సైబర్ బుల్లీయింగ్ షీట్లు తెరిచారు. లైంగిక వేధింపులకు సంబంధించి క్రైౖమ్ డేటా ఆధారంగా దాదాపు 2 లక్షల మందిని గుర్తించి జియో ట్యాగింగ్ ద్వారా నిఘా వేశాం. అక్కచెల్లెమ్మలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా ఈ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ఇద్దరూ సమానమే.. పాప అయినా.. బాబు అయినా ఇద్దరినీ ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. మహిళలపై ఆధిపత్యం చలాయించడం, వేధించడం, చులకన చేయడాన్ని కలిసికట్టుగా వ్యతిరేకించాలి. అలాంటి రాక్షస గుణాలు ఉండకూడదు. అవి ఏ మనిషి చేయకూడని పనులు. మారుతున్న సమాజంతో కలసి ఎదగాలి. నాకిద్దరు ఆడబిడ్డలని గర్వంగా చెబుతా.. ‘గత పాలకులు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.. ‘‘కోడలు మగ పిల్లవాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా..?’’ అని వ్యాఖ్యానించారు. అదే ఇవాళ నేను మీ అన్నగా, తమ్ముడిగా ఒక మాట చెబుతున్నా.. నాకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలేనని గర్వంగా చెబుతా’ నన్ను ఆపేదెవరు...? ‘మీ ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే ప్రముఖ రచయిత్రి అయాన్ ర్యాండ్ మాటలు గుర్తుకొస్తున్నాయి. నేను ఒక స్త్రీని కాబట్టి నన్నెవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు? అన్నదే ప్రశ్న. నిజంగా ఆ స్ఫూర్తి ఇక్కడ కనిపిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలో, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలో అలాంటి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంలా మన రాష్ట్రం కనిపిస్తోంది’ -
ఆమె మాటలు గుర్తుకొస్తున్నాయి
-
ఇళ్లు-ఇళ్ల స్థలాలు-ఆస్తి
-
ఇంత మంది ప్రజా ప్రతినిధులు
-
మన మహిళలకు దక్కిన గౌరవం
-
అర్హతే ప్రామాణికంగా పింఛన్లు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: పాదయాత్రలో మహిళలు చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ గుర్తుంచుకున్నారని.. అందుకే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని నెరవేరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. చదవండి: సీఎం వైఎస్ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు ‘‘ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతీ పథకంలో మహిళలను భాగస్వామ్యులను చేశారు. ఏపీలో 35లక్షలకు పైగా కేవలం మహిళలకే పింఛన్లు ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ ఏపీలో మాదిరిగా పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవు. అర్హతే ప్రామాణికంగా పింఛన్లు అందిస్తున్నారు. 50 శాతం రాజకీయ, ఉద్యోగ రిజర్వేషన్లు ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేవు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మహిళల కోసం దిశ యాప్ , దిశ చట్టం రూపొందించారు. సీఎం వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి మహిళల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని’’ పెద్దిరెడ్డి అన్నారు. -
మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి: సజ్జల
సాక్షి, విజయవాడ: మహిళా సాధికారతకు పూర్తిస్థాయి అర్థం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ సచివాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, అమ్మ ఒడి పథకం సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టిందేనన్నారు. కుటుంబం బాగుండాలంటే నిర్ణయాధికారం మహిళకు ఉండాలని ఈ ప్రభుత్వంలో మహిళలకు ఆ అధికారం జగన్ కల్పించారని సజ్జల అన్నారు. చదవండి: ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్ ‘‘మహిళల పేరిటే ఇళ్ల పట్టాలిచ్చి వారికి సొంత ఆస్తి కల్పించారు. మహిళల పట్ల ఆయనకు అమితమైన విశ్వాసం ఉందని అనేక చర్యల ద్వారా నిరూపించుకున్నారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించారు. ఏపీలో వచ్చే ఐదారేళ్లలో మహిళలు మరింత శక్తివంతంగా మారుతారు. ఏపీ నుంచి వచ్చారంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారని అంతా చెప్పుకుంటారు. మహిళల కోసం ఎలాంటి సూచనలు చేసినా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుందని’’ సజ్జల తెలిపారు. ‘‘శతాబ్దాలుగా అనేక అసమానతలకి గురైంది మహిళే. ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాల అమలులో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాలు ఏమైనా ఆ నిర్ణయాలు అమలులో మీదే కీలకపాత్ర. సీఎం వైఎస్ జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్
-
సీఎం జగన్ కి మహిళల అరుదైన గౌరవం
-
రాజన్న కలను జగనన్న నిజం చేస్తున్నారు: మంత్రి తానేటి వనిత
-
సీఎం జగన్ గురించి అనురాధ అద్భుత ప్రసంగం
-
ఆ ఘనత సీఎం జగనన్నదే: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
పచ్చ రంగు, పిచ్చి గెడ్డం.. బాబుని ఉతికారేసిన వాసిరెడ్డి పద్మ
-
నాట్స్ ఆధ్వర్యంలో నారీ స్ఫూర్తి
మహిళా అభ్యున్నతి లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పరంపరలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2022 మార్చి 13న నారీ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు నాట్స్ ప్రెసిడెంట్ విజయ్‌శేఖర్ అన్నె, చైర్ ఉమన్ అరుణ గంటిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విజయం సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిన దీప్తిరెడ్డి, నిహారికరెడ్డి, దేవి దొంతినేనిలు ప్రసంగించనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ https://www.natsworld.org/women_empowerment ద్వారా పాల్గొనవచ్చు. -
'ఆటా' ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం(మార్చి 7) రోజున నిర్వహించింది. ‘చూస్ టు ఛాలెంజ్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆటా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత డీకే అరుణ, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి, సినీ దర్శకురాలు నందిని, సినీయర్ నటి లయలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తితిదే ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ శోభారాజు అమ్మ మీద ఓ పాటతో ప్రారంభమైంది. అనంతరం ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి మాట్లాడుతూ.. మహిళలకు ఎన్నో సూచనలు ఇచ్చారు. మహిళలు తమ ఆలోచనా విధానం మార్చుకుంటే చక్కటి అవకాశాలు పొందవచ్చన్నారు. పూర్తి సామర్ధ్యలు వినియోగించుకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, స్త్రీ శక్తి ముందు ఏదైనా దిగ దిడుపే అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని, కుటుంబలో ప్రేమ బాంధవ్యాలు పెంపొందిచటంలో, మెరుగైన సమాజం సృష్టించటంలో మహిళల సేవ ఎనలేనిదని కొనియాడారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. స్త్రీలు మగ వారి కంటే అన్ని విషయాలలో ఒక అడుగు ముందే వుంటారన్నారు. అన్ని రంగాలలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, అయినా ఇంకా ఎంతో చేయవలసింది ఉందన్నారు. బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఆటా సబ్యులని, మహిళామణులని అభినందించారు. మహిళలు పాలనా పరమైన సెగ్మెంట్లో ఆటా మొదటి మహిళ ప్రెసిడెంట్ సంధ్య గవ్వ గారు మహిళ సాధికారత మీద ప్రసంగించారు. సినీ నటి లయ మాట్లాడుతూ.. మహిళలు స్వీయ విశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. నంది అవార్డు గ్రహీత డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ... మహిళలు ఏదైనా సాధించగల దృఢ చిత్తం కలవారు అని కొనియాడారు. ఆటా ఉమెన్స్ కోఆర్డినేటర్ అనిత యజ్ఞిక్ ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆటా మహిళామణులు అభినందించారు. ఆటా కార్యవర్గం, ట్రస్టిస్ మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
ధైర్యమిచ్చిన గౌరవం.. వన్డే కలెక్టర్
ధైర్యం అంటే ఎలా ఉండాలి? ధైర్యానికి ఉదాహరణ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అమ్మాయిలకు చెప్పాలంటే అర్చన కెవాట్ను చూపించాలి. 21 ఏళ్ల అర్చన ధైర్యానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కాట్ని జిల్లా కలెక్టర్ అర్చనను ‘ఒకరోజు కలెక్టర్’గా నియమించి గౌరవించింది. ఆ ప్రభుత్వం 51,000 రూపాయలను కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించింది. వేధింపులకు గురిచేస్తున్న అబ్బాయిల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినందుకు గాను అర్చన కెవాట్కు దక్కిన అరుదైన గౌరవం ఇది. మార్చి 8, సోమవారం ఉదయం 21 ఏళ్ల అర్చన కెవాట్ కాట్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కారులో చేరుకుంది. కాటన్ సల్వార్ సూట్ ధరించిన అర్చన కెవాటన్ పేరును మీడియా ముందు ‘వన్డే కలెక్టర్’గా ప్రకటించారు. ఆమె అంతే ఆత్మవిశ్వాసంతో తనకు అందించిన గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురుగా తనను తాను పరిచయం చేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేముందు అర్చనకు జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా, సిబ్బంది పూలతో స్వాగతం పలికారు. సమీక్షలు.. సమావేశాలు సోమవారం కావడంతో జిల్లా పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన సమీక్షలు జరిపే సమావేశం. ఈ సమావేశానికి అర్చన అధ్యక్షత వహించింది. జిల్లాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మొదటి ప్రాధాన్యంగా అధికారులను ఆదేశించింది. తక్కువ బరువు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను పునరావాస కేంద్రాలకు చేర్చాలని తెలిపింది. సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో చకా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంది. ఆ తర్వాత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఒంటి గంటప్పుడు బస్టాండ్ వద్ద ఉన్న ఆడిటోరియం చేరుకుని, సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 3 గంటలకు వన్‌స్టాప్ సెంటర్‌ను, సాయంత్రం 4 గంటలకు ఆడపిల్లల భద్రత గురించిన వివరాలను తెలుసుకుంది. పర్యటన, సమావేశాలు ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాన్ని రోజంతా చేపడుతూనే ఉంది అర్చన. కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి.. ఎనిమిది మంది తోబుట్టువులున్న అర్చన తండ్రి చేసే కూరగాయల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం మార్కెట్ వద్ద టీనేజ్ అమ్మాయిలను రౌడీలు వేధిస్తుండటం చూసిన అర్చన సమీపంలోని వ్యక్తుల సాయంతో వారిని కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, పోలీసులకు అప్పజెప్పింది. అర్చన ఎలాంటి భయం లేకుండా దుండగులను చట్టానికి పట్టించిన తీరు స్థానిక ప్రజానీకానికే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంది. ఆమె సాహసానికి నగదు పురస్కారాన్ని ఇవ్వడమే గాకుండా ఒకరోజు కలెక్టర్‌గా నియమించి ఆమె పట్ల తమ గౌరవాన్ని చాటారు. -
మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్
-
మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీపీ అంజనీకుమార్, మిస్ ఇండియా ఎర్త్ తేజస్విని
-
వేడుకగా “నాటా - మిన్నిసోటా” మహిళా దినోత్సవం
మిన్నిసోటా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) వారి మిన్నిసోటా విభాగం అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం అమెరికాలోని మిన్నిసోటా రాష్త్రంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుకున్న సంఖ్యలో కంటే రెట్టింపు స్థాయిలో జనం వచ్చారని, సమస్త మహిళా లోకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సభాప్రాంగణ అలంకారములు, పసందైన విందు భోజనం, చాయాగ్రహకుల కష్టం మరెన్నో విశేషాలను మహిళా లోకం ప్రస్తావించటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. "నాటా - మిన్నిసోటా" కార్యనిర్వాహక బృందం ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి పడ్డ కృషిని మహిళలు గుర్తించినందుకు వినమ్ర నమస్కారం తెలియజేసింది. అదే విధంగా, ఆడవారి కోసం గత కొద్ది రోజులుగా ఎంతో సహాయసహకారాలు అందించిన మగవారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. "నాటా - మిన్నిసోటా" గుర్తించి, ఈ కార్యక్రామనికి ధనసహాయం అందించిన దాతృత్వముగల దాతలందరికీ, పేరు పేరునా శిరస్సువంచి నమస్కరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రస్తుత అధ్యక్షులుగా గోశాల రాఘవ రెడ్డి, కాబోయే అధ్యక్షులుగా కొర్సపాటి శ్రీధర్, మిన్నిసోటా విభాగం ఉపాధ్యక్షులు పిచ్చాల శ్రీనివాస రెడ్డి , ఎర్రి సాయినాథ్, ప్రాంతీయ సమన్వ్వయకర్తలుగా చింతం వెంకట్, పేరూరి రవి మరియు నారాయణ రెడ్డి, సలహాదారులుగా బండి శంకర్, చౌటి ప్రదీప్ ఉన్నారు. అదే విధంగా, ఈ కార్యక్రమ నిర్వాహణలో మూర్తి (అలంకరణ), వసుంధర రెడ్డి, దేవరపల్లి సౌజన్య, వుయ్యూరు మాలతి, చీకటి శైల, మిక్కిలినేని జయశ్రీ, బుడగం ప్రవీణ్, యడ్డాల ప్రతీప్ ఎంతగానో కష్టపడి ముఖ్య భూమికను పోషించారు. -
వేట ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
డాలస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేట) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్ నగరంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేట అధ్యక్షులు ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పవర్ ఆఫ్ ఉమెన్ అనే అంశంపై చర్చ కొనసాగించారు. అనంతరం ఐదు గంటలకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కాగా కార్యక్రమానికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) పూర్వాధ్యక్షులు కృష్ణవేణి రెడ్డి శీలం సమన్వయకర్తగా వ్యవహరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను ఆటా, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డాక్టర్ సంధ్య గవ్వ వివరించారు. దాదాపు ఈ కార్యక్రమానికి ఐదు వందల మందికి పైగా హాజరయ్యి సభను జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం విజయం వెనుక శ్రమించిన అను బెనకట్టి, లక్ష్మి పాలేటి, ఇందు మందాడి, సురేశ్ పఠానేని, మల్లిక్ రెడ్డి కొండ, అభితేజరెడ్డి, ప్రసన్న దొంగూర్, శ్రీలక్ష్మి మండిగ, కల్పన గనపురం, మాదవిరెడ్డి, లతా గదెద, వాణి ద్రోణవల్లి, రాధా బండాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర దర్శకురాలు నందినిరెడ్డి, సీనియర్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి, పీడియాటిక్ అనస్థీషియాలజిస్ట్ డా. అనుమప గోటిముకుల, ప్రముఖ టెక్సస్ న్యాయవాది యూఎస్ఐసీవోసీ అధ్యక్షులు నీల్ గోనుగుంట్ల, ఆటా, నాటా, టాంటెక్స్. నాట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక చివరగా వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించిన లిటిల్ జెమ్స్ నుంచి ప్రత్యూష, ఫోర్ పాయింటర్స్ షెటరాన్కు చెందిన సారా, అరుణ్ విట్టలకు వేట అధ్యక్షులు ఝాన్సీ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. -
మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాం
-
రాజ్‌భవన్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు
-
రాజ్ భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రరెడ్డి, సత్యవతి రాథోడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి ఎమ్మెల్యే ఆర్కే రోజాతోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. ముందుగా గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. (‘సోషల్ మీడియా సన్యాసం’పై మోదీ మరో ట్వీట్) గవర్నర్‌తో సెల్ఫీ -
‘నాటా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
నార్త్ కరోలినా: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) మహిళా దినోత్సవ వేడుకలను షార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నాటా ప్రెసిడెంటు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. నాటా తలపెట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 300పైగా మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం సమీరా ఇళ్ళెందుల యాంకరింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అనురాధా పన్నెం దర్శకత్వం లో ప్రదర్శించిన నాటికఅందరిని కడుపుబ్బ నవ్వించింది. సునీత సౌందరరాజన్ చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో హుందాగా సాగింది. దుర్గా శైలజ దలిపర్తి, లావణ్యకోనురి ఆధ్వర్యంలో సాగిన నాట్య విన్యాసాలు అందరిని ఆనందపరిచాయి. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట’ ను ఆచరిస్తూ ఆటపాటలే ముఖ్యోద్దేశం కాకుండా సేవాతత్వం తో విరాళాలు సేకరించారు. షార్లెట్ లో స్వచ్చందం గా సేవలు అందించే లిల్లిపాడ్ హేవన్ అనే సంస్థకి ఆ విరాళాలు అందించారు. ఈ మహిళా దినోత్సవం లో పాలుపంచుకొన్న మహిళలందరూ నాటా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారని ప్రధాన కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ రామిరెడ్డి తెలిపారు. -
నాటా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
వాషింగ్టన్ డిసి : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) ఆధ్వర్యంలో ఆష్బర్న్, వర్జీనియా నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 500 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. ప్రియ ప్రార్థనా గీతంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం కూచిపూడి డాన్స్ అకాడమీ ట్రినిటీ పంత్ గణేష పంచరత్నాన్ని ప్రదర్శించారు. మాధవీ మైలవరపు బృందం అష్టలక్ష్మి స్తోత్రం ఆలపించారు. సుధ, శ్రీలత, లలిత మహిళా సంబంధిత పాటలు పాడి అలరించారు.శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన ర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబుకి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లెకి, తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునే రంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లకి, ఐటీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలును ఈ సందర్భంగా సన్మానించారు . చైతన్యవంతుల సంబంధించిన ప్రశ్నలు, జయ తెలికుంట్ల, రాధిక జయంతిల వ్యాఖ్యానం, సరదా సరదా ఆటలతో ఈ కార్యక్రమం సాగింది. వసుధారారెడ్డి మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫ్యాషన్ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. నాటా కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు, చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య, స్వరూప గిండి, అనిత ,లావణ్య, గౌరి, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు. తానా, అమెరికన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీడీఎప్, జీడబ్యూటీసీఎస్(GWTCS), ఇతర నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు. నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ, హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల, మోహన్ కలాడి, బాబూరావు సామల, కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి తదితరులు పాల్గొన్నారు. -
బోస్టన్‌లో 'ఆటా' అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
బోస్టన్ : అమెరికాలోని బోస్టన్ నగరంలో అమెరికన్ తెలుగు అసోషియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. ఈ సంవత్సరం ‘బెటర్ ఫర్ బ్యాలెన్స్’ అనే థీమ్‌తో ఈ వేడుకలను ఆట నిర్వహించింది. న్యూ ఇంగ్లండ్ లోని బోస్టన్ పరిసర ప్రాంతాలు కన్నీటికట్, న్యూ హంపశైర్ నుండి ఈ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండి విజయం సాదించాలని రంజని సైగల్ అన్నారు. మసాచుసెట్స్ రాష్ట్ర సెనెటర్ ఎలిజబెత్ వారెన్ రాలేక పోయినందున వారి ప్రత్యేక సందేశాన్ని మహిళలకు చదివి వినిపించారు. మహిళా వాలంటీర్స్ అనిత రెడ్డి , సునీత నల్ల , మధు యానాల, శిల్ప శ్రీపురం, రజని తెన్నేటి , లక్ష్మి , సాహితి రొండ్ల లను మహిళా దినోత్సవ ప్రణాళిక, వక్తల ఏర్పాటు, కార్యక్రమ అమలు బ్రహ్మాండంగా జరిపారని మహిళలు కొనియాడారు ఈ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ ,సాంస్కృతిక కార్యక్రమాలు, విందు అందరినీ అలరించాయి. ఆటా రీజినల్ డైరెక్టర్ సోమ శేఖర్ రెడ్డి నల్ల, రీజినల్ కోఆర్డినేటర్స్ మల్లా రెడ్డి యానాల, లక్ష్మీనారాయణ రెడ్డి , మేఘనాథ్ రెడ్డి , చంద్రశేఖర్ రావు మంచికంటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 'ఆటా' మహిళలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని, 'ఆటా' మహిళా దినోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన, భాగస్వాములైన స్పాన్సర్స్, వాలంటీర్స్‌కు ఆటా బోర్డు మెంబర్లు రమేష్ నల్లవోలు, కృష్ణ ధ్యాప టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
డాలస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు!
డాలస్ : తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇర్వింగ్‌లో ఉన్న కూచిపూడి ఇండియన్ కిచెన్‌లో జరిగిన ఈ వేడుకలకు రెండువందలకు పైగా మహిళలు హాజరయ్యారు. ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక సోదరిగా ఉద్యోగ రంగంలో మహిళ తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది అని పలువురు కొనియాడారు. డాలస్ శాఖ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సునీత త్రిపురం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది. ఉమెన్స్ కమిటీ నేషనల్ కో-ఛైర్ రూప కన్నయ్య, టాటా సంయుక్త కార్యదర్శి నీలోహిత కొత్తా, కల్చరల్ కమిటీ నేషనల్ ఛైర్ సమీరా ఇల్లెందుల, డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్లు శాంతి నూతి, దీప్తి సూర్యదేవార, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ లేక్ మేయర్ లారా హిల్ పాల్గొన్నారు. సభని ఉద్యేశించి మాట్లాడుతూ భారతీయ స్త్రీ అంటే తనకి ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో వీణా యలమంచిలి తన గాత్రంతో అలరించారు. టాటా ప్రెసిడెంట్ విక్రం జంగం మాట్లాడుతూ పూర్తి కుటుంబాన్ని తన భుజాలపై మోస్తున్న స్త్రీ మూర్తికి ఎల్లవేళలా అందరూ కృతజ్ఞత తెలపాలని కోరారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. సెల్ఫీ కాంటెస్ట్, ఫ్యాషన్ షో అని వినూత్నమైన కార్యక్రమాలతో నిర్వాహుకులు అందరిని ఆకట్టుకున్నారు. టాటా బోర్డు సభ్యులు మహేష్ ఆదిభట్ల, చంద్ర రెడ్డి పోలీస్‌లతో పాటు పవన్ గంగాధరా, శ్రీధర్ కుంభాల, శ్రీనివాస్ తుల, నిరంజన్ బూడిద, శ్రీకాంత్ రౌతు, సురేష్ పతనేని, రత్న ఉప్పాల, భవాని జొన్నలగడ్డ పాల్గొని తన సహాయసహకారాలు అందించారు. -
ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
న్యూజెర్సీ : అమెరికన్ తెలుగు అసోషియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. ‘బెటర్ ఫర్ బ్యాలెన్స్’ అనే థీమ్‌తో అమెరికా నలుమూలల ఈ వేడుకలను ఆట నిర్వహించింది. డల్లాస్, రాలీ, వాషింగ్టన్ డీసీ, డెలావేర్ వాలీ, న్యూ జెర్సీ, నాశ్విల్లే, ఆస్టిన్ వంటి 15 నగరాలలో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన ఎన్నో విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళా దినోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన, భాగస్వాములైన స్పాన్సర్స్, వాలంటీర్స్‌కు ఆట అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ నాశ్విల్లెలో ఆటా ప్రతినిధులు భారతీయ భాషలను నేర్పిస్తున్న అధ్యాపకులకు సన్మానం చేశారు. 'ఫ్రీ ఫర్ లైఫ్' ఫౌండేషన్ వారు మనుషుల అక్రమ రవాణా గురించి వివరించారు. అనంతరం బాధిత మహిళల కోసం ఆటా అక్కడికక్కడే నిధులు సేకరించి ఫౌండేషన్ వారికి ఆర్థిక సహాయం అందించింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన మహిళా దినోత్సవ వేడకలో మహిళలకు విద్యా, వైద్యా, ఫైనాన్షియల్, సోషల్, బిజినెస్ టాపిక్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారీగా మహిళలు హాజరైన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ విమెన్ జెన్నిఫర్ వెస్ట్న్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల అభ్యన్నతి కోసం కృషి చేస్తున్న కవిత చల్ల, ఇందిరా కుమార్, అవంతిక నక్షత్రంలను ఆటా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. న్యూజెర్సీలో జరిగిన ఉమెన్స్ డే కార్యక్రమంలో హోమియోపతి, యోగ, బిజినెస్ టాపిక్స్‌పైన చర్చించారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేషనల్ ఉమెన్స్ చైర్ ఇందిరి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ లాయర్ ప్రశాంతి రెడ్డిలను ఆటా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి సంస్థ కార్యకలాపాలు, విలువలు, సేవల గురించి వివరించారు. డల్లాస్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలు అంశాలపైన మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజనాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాలీలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ డే వేడుకలకు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యరంగంలో నిష్ణాతులయిన డాక్టర్స్ పాల్గొని బ్రెస్ట్ క్యాన్సర్, మమ్మోగ్రఫీల గురించి అవగాహన కల్పించారు. పౌష్టిక ఆహారం, ఫైనాన్షియల్ సెక్యూరిటీ విషయాల మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. పలువురు మహిళలను ఆటా సభ్యులు సత్కరించారు. -
నాష్‌విల్లేలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నాష్విల్లే : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు చల్లా కవిత హాజరయ్యారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా, ఐసీఓఎన్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా మహిళలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. షాపింగ్ మేళాను నిర్వహంచారు. ఇండియన్ స్పెషల్ వంటకాలు, డ్యాన్స్‌లు, పాటలతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇండియన్ రిజినల్ లాంగ్వేజస్, కమ్యూనిటీ సర్వీస్‌లో కృషి చేసిన మహిళలు గ్రీష్మా బినోష్, హారిక కనగాల, కిరుతీగ వాసుదేవన్, శ్యామలి ముఖర్జీ, రచన కెడియా అగర్వాల్, డాక్టర్ అరుందతి రామేష్లను ఆటా సన్మానించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు సభ్యులు జయంత్ చల్లా, అనిల్ బోడిరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆళ్ల, శివ రామడుగు, సుశీల్ చందా, శ్రీహాన్ నూకల, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో ఘనంగా ఆటా మహిళా దినోత్సవ వేడుకలు
డల్లాస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఘనంగా నిర్వహించింది. డల్లాస్‌లోని మినర్వా బాంక్వెట్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు 300కు పైగా మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రీజనల్ కో ఆర్డినేటర్లు అశోక్ పొద్దుటూరి, మాధవి సుంకిరెడ్డి అతిథులను ఆహ్వానించగా... మధుమతి వైశ్యరాజు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాలికలు ప్రార్థనా గీతంతో పాటు భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. ఆ తర్వాత సభికులంతా పుల్వామా ఉగ్రదాడి అమరజవాన్లకు నివాళులర్పించారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో దూసుకుపోతున్న వుమెన్ ప్రొఫెషనల్స్ డాక్టర్ సెజల్ మెహతా(సైకియాట్రిస్ట్), డాక్టర్ శ్రీవిద్య శ్రీధర(ఇమ్యూనాలజిస్ట్), సునీత చెరువు(ఫ్రిస్కో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్), శ్రీ తిన్ననూరు(ఐటీ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్)లతో మాధవి లోకిరెడ్డి ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. తమ విలువైన అనుభవాలు పంచుకున్నందుకు, సలహాలు అందించినందుకు సుమన బీరం, శ్వేత పొద్దుటూరి వీరికి ధన్యవాదాలు తెలిపారు. ఆటపాటలు.. పండుగ వాతావరణం మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా బాలికలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. ఈ క్రమంలో మహిళలు సైతం పోటీకి సై అంటూ నృత్యాలు చేయడంతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం సంధ్య గవ్వ, అనురాధ మేకల గేమ్స్ కండక్ట్ చేసి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఇక ఆటా నేతృత్వంలో జరిగిన ఈ తొమ్మిదో మహిళా దినోత్సవానికి శ్రీలతా సూరి(కూచిపూడి డాన్సర్), ఇందు మందాడి(ఐఏఎన్టీ మాజీ ప్రెసిడెంట్), తృప్తి దీక్షిత్(ఒమేగా ట్రావెల్స్ సీఈఓ) తదితర వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. సంధ్య గవ్వ, అరవింద్‌రెడ్డి ముప్పిడి (కోశాధికారి), రఘువీర్ బండారు, సతీశ్ రెడ్డి, అజయ్ రెడ్డి, అశోక్ కొండాల, రామ్ అన్నాడి, మహేందర్ ఘనపురం, కవితా కడారి సూచనలతో, శారద సింగిరెడ్డి, సుధాకర్ కలసాని, శ్రీకాంత్ కొండ, మధుమతి వైశ్యరాజు, సుమర బీరం, అనురాధ మేకల, మంజుల ముప్పిడి, శ్వేతా పొద్దుటూరి, అశ్విన్ ఆయంచ, దామోదర్ ఆకుల, రవికాంత్ మామిడి, భాస్కర్ అర్రోజుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రీజనల్ కో ఆర్డినేటర్లు మాధవి సుంకిరెడ్డి, అశోక్ పొద్దుటూరి తెలిపారు. -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
సాక్షి, సుజాతనగర్: సమాజంలో మహిళలు పాత్ర కీలకమైనదని ఐసీడీఎస్ సింగభూపాలెం సెక్టార్ సూపర్వైజర్ పయ్యావుల రమాదేవి అన్నారు. శుక్రవారం జరిగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగభూపాలెం సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఆత్మ విశ్వాసంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో మహిళలు రాణించాలన్నారు. ఉపాధ్యాయులు మన్నా, పుల్లయ్య, అంగన్వాడీ టీచర్లు వి.జ్యోతి, నరసమ్మ, వరలక్ష్మి, శేషుమణి, శశికళ, లలిత, సరస్వతి, పార్వతి, నాగమణి, పద్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శరణాలయంలో పండ్లు పంపిణీ సూపర్‌బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ సేవా సమితి ఆధ్వర్యంలో శరణాలయంలో గురువారం పండ్లు పంపిణీ చేశారు. చాతకొండలోని హమాలీ కాలనీలోగల జ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో సేవా అధ్యక్షురాలు పద్మజా శంకర్ పండ్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ వారం రోజులుగా సింగరేణి కాలనీలలో మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, మహిళా దినోత్సవం రోజున సీఈఆర్ క్లబ్లో జరిగే వేడుకల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ బేతిరాజు, సేవా సెక్రటరీ సుమభాను, సభ్యులు శ్రీలత, పుష్పలత, రమాదేవి, మునీల, సుజాత, ఝాన్సీరాణి, రాజేశ్వరి, అరుణ, పద్మ, సేవా కో–ఆర్డినేటర్ ఈఏ.షరీఫ్ పాల్గొన్నారు. ఇందిరాకాలనీ పాఠశాలలో.. సూపర్‌బజార్(కొత్తగూడెం): లక్ష్మీదేవిపల్లి మం డలం ఇందిరానగర్‌కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగే మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని బాలికలకు ఫ్యాన్సీడ్రెస్ పోటీలను నిర్వహించారు. విజేతలకు సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం సీనియర్ రోవర్ లీడర్, ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత మహమ్మద్ ఖాశీం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం జ్యోతిరాణి, విద్యావలంటీర్లు సైదమ్మ, విజయలక్ష్మి, అరుణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు సూపర్‌బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలోని లేడీస్ క్లబ్ మెంబర్స్, మహిళా ఉద్యోగులకు గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఎస్ఓ టూ జీఎం నారాయణరావు పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. దీనిలో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని లేడీస్ క్లబ్ మెంబర్స్, మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి విజేతలకు శుక్రవారం ఆర్‌సీఓఏ క్లబ్లో జరిగే వేడుకల్లో బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. వాలీబాల్ ఆడుతున్న క్లబ్ సభ్యులు, మహిళా ఉద్యోగులు కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ శ్రీనివాస్, డీవైపీఎంలు కిరణ్‌బాబు, సీహెచ్.అశోక్, లేడీస్ క్లబ్ సెక్రెటరీ మాధవి నారాయణరావు, సునీత మురళి, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ వజ్రమ్మ, సమన్వయకర్తలు సంగారావు, సాయికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, లేడీస్ క్లబ్ మెంబర్స్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మహిళా దినోత్సవ వేడుకలు
-
డల్లాస్‌లో 'ఆటా - టాటా' మహిళా దినోత్సవ వేడుకలు
డల్లాస్ : ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు సంయుక్తంగా టెక్సాస్‌లోని ప్లానోలో మినర్వా బాంక్వెట్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు, యువతులు భారీ ఎత్తున పాల్గొని ఆటా, పాటలతో కార్యక్రమాన్ని ఆద్యంతం ఉర్రూతలూగించారు. రామ్ అన్నాడీ, అశోక్ కొందాల(ఆటా రీజినల్ కోఆర్డినేటర్స్ ఆఫ్ డల్లాస్ ఫోర్ట్ వర్త్), చంద్రారెడ్డి పోలీస్ (టాటా రీజినల్ వైస్ ప్రెటిడెంట్ ఆఫ్ డల్లాస్ ఫోర్ట్ వర్త్) ఆధ్వర్యంలో ఆటా - టాటా సంయుక్తంగా మార్చి17న ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించింది. ఇటీవలే మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవికి సభ్యులు నివాళులు అర్పించారు. ఆటా మహిళా ప్రతినిధులు డా. సంధ్య గువ్వ, మాధవి సుంకిరెడ్డి, మాధవి లోకి రెడ్డి, నిలోహితా కొట్టా, ప్రసన్న దొంగురు, అనురాధ మేకల, మధుమతి వైశ్య రాజు, దీప్తి సూర్యదేవర యార్లగడ్డ, సంధ్య మద్దూరి, టాటా మహిళా ప్రతినిధులు సమీరాఇల్లెందుల, రూపా కకన్నయ్యగరి, సునితా త్రిపురం, శాంతి నూతి, పద్మశ్రీ తోట, గోమతి సుంధరబాబు, స్వేత గుండపనేని, జ్యోశ్న ఉండవల్లిలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ఎంతగానో కృషి చేశారు. డ్యాన్సులు, పాటలు, ఫ్యాషన్ షో, ఆటలతో పాటూ మహిళా సాధికారతపై జరిపిన చర్చాగోష్టి కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీదేవి నటించిన చిత్రాల్లోని పలు పాటలను స్థానిక సింగర్స్ వీనా యలమంచిలి, శ్రియ వస్కర్లలు పాడి తమ గాత్రంతో అందరిని ఆకట్టుకున్నారు. మంచి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం, అలవాట్లతోపాటూ మహిళలు కుటుంబం, పనిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే అంశాలపై వక్తలు డా. సుధా కల్వగుంట్ల, డా. హిమబిందు రెడ్డి, డా. యమునా గుర్రపు, డా. సంధ్యా గువ్వా, సమీరా ఇల్లెందుల ప్రసంగించారు. సమాజానికి మహిళలు పిల్లర్లలాంటి వారని టాటా అధ్యక్షులు హరనాథ్ పొలిచెర్ల అన్నారు. మే 31, జూన్ 1, 2వ తేదీల్లో డల్లాస్ లో ఆటా-టాటా సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డల్లాస్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్తలు శారదా సింగిరెడ్డి, కళ్యాణి తడిమేటి, ఇందు పంచార్పుల, కవిత బ్రహ్మదేవరలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేశారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఆటా సభ్యులు మహేందర్ గణపురం, కలాసాని, అశోక్ పొద్దుటూరి, అశ్విన్ కేంచా, ఫణీందర్ రెడ్డి, వెంకట్ ముసుకు, దామోదర్ ఆకుల, రమణ లష్కర్, రవికాంత్ మామిడి, డల్లాస్ ఫోర్ట్ వర్త్ టాటా సభ్యులు పవన్ గంగాధర, శరత్ రెడ్డి యెర్రం, సురేష్ పాతనేని, శ్రీనివాస్ తుల, విజయ్ బాల, నిరంజన్ రెడ్డి, ఉదయ్ నిదిగంటి, నిశాంత్ సిరికొండ, రత్న ఉప్పాలలు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తమవంతు తోడ్పాటును అందించారు. ఆటా సభ్యులు అజయ్ రెడ్డి( బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ), సతీష్ రెడ్డి( మాజీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ), ఆత్మాచరణ్ రెడ్డి(మాజీ ఆటా అధ్యక్షులు), రఘువీర్ బండారు(బోర్డ్ ఆఫ్ ట్రస్టీ), రాజ్ ఆకుల, టాటా జనరల్ సెక్రటరీ విక్రమ్, ట్రెజరర్ మహేష్ ఆదిభట్లలు ఇచ్చిన సూచనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆటా- టాటా సభ్యులు, ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన అతిథులకు మాధవి సుంకిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
న్యూజెర్సీలో 'ఆటా' మహిళా దినోత్సవం
న్యూ జెర్సీ : అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వాహక సంఘం సభ్యురాలు ఇందిరారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అతిపిన్న వయస్సున్న ఆసియన్ అమెరికన్ న్యూ జెర్సీ స్టేట్ సెనెటర్ విన్ గోపాల్ విశిష్ట అతిధిగా రావడంతో పూర్వ ప్రెసిడెంట్ సుధాకర్ పెర్కారి సభకు పరిచయం చేశారు. విన్ గోపాల్ మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళలు అన్నిరంగాల్లో ఆర్థిక స్వావలంబన, వ్యాపార రంగం సేవా రంగాల్లో రాణించడం గురించి చర్చించారు. న్యూ జెర్సీ ఫ్రీ హోల్డర్ కుమారి శాంతి నర్రా మాట్లాడుతూ మహిళలు కూడా అమెరికా రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ అమెరికా తెలుగు అసోసియేషన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా డల్లాస్, టెక్సాస్‌లలో మే 31, జూన్ 1, జూన్ 2 తేదీలో మూడు రోజులపాటూ నిర్వహించబోయే తెలుగు కన్వెన్షన్‌కు హాజరు కావాల్సిందిగా తెలుగువారిని ఆహ్వానించారు. అదే విధంగా అందరు ఆటా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఆటా న్యూ జెర్సీ ప్రాంతీయ సమన్వయకర్తలు రవీందర్ గూడురు, విలాస్ రెడ్డి జంబుల, లోకల్ ఆటా బోర్డు ట్రస్టీ సభ్యులు, స్టాండింగ్ కమిటీ ఛైర్స్ మిగితా ఆటా లోకల్ సభ్యులు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో కృషి చేశారు. అలాగే, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి, మాజీ ప్రెసిడెంట్ సుధాకర్ పెర్కారి, రాజేందర్ జిన్నా, సలహా కమిటీ సహ కన్వీనర్ సురేష్ జిల్లా ట్రస్టీలు పరశు రామ్, పిన్నపురెడ్డి, రఘు రెడ్డి, శ్రీను దార్గుల, రవి పటోళ్ల, స్టాండింగ్ కమిటీ రమేష్ మాగంటి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ గుడిపాటి, రీజినల్ అడ్వైజరీ రాజ్ చిములలు తమవంతు సహాయసహకారాలు అందించారు. అదేవిధంగా కమ్యునిటీ లీడర్స్ నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని, తానా రీజినల్ కో-ఆర్డినేటర్ విద్య గారపాటి, టీపాస్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ సుధాకర్ ఉప్పల, సిలికానాంధ్ర మనబడి వైస్ ప్రెసిడెంట్ శరత్ వేట, టాటా సభ్యులు శివ బి రెడ్డిలు, పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి తమ వంతుగా మందు ఉండి సహాయ సహకారాలు అందించిన నందిని దార్గుల, మాధవి అరువ, అనురాధ దాసరి, వినీల రెడ్డి, అరుంధతి షాకెళ్లి, ఇందిరా సముద్రాల, శ్రీదేవి ఒబ్బినేని, నందిత తడసిన, దీపిక బెలూం, మాధవి గూడూరు, జమున పుస్కూర్, భాను మాగంటి, సంగీత ధన్నపనేని, మాధవ గూడూర్, స్వర్ణ భీం రెడ్డి, జ్యోతి, నిహారిక గుడిపాటి, శ్రీలత రెడ్డి, చిత్ర లేఖ జంబులను ఆటా కార్యవర్గం అభినందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తరచుగా వార్తల్లో తారసిల్లే భారతీయ మహిళలను గురించి సంయుక్తంగా నిర్వహించిన క్విజ్ పోటీ అందరిని ఆకట్టుకుంది. సభ్యులు ఉత్సాహంగా క్విజ్ లో పాల్గొని సమాధానాలు చెప్పడంలో పోటీ పడ్డారు. విజేతలందరికీ తగిన రీతిలో బహుమతులు అందజేశారు. ఇలాంటి సందర్భాల్లో ఏర్పాటు చేసే చీరెలు, బంగారు ఆభరణాల స్టాళ్లలో సందడి కనిపించింది. చక్కటి వ్యాపారం జరిగినందుకు స్టాళ్ల నిర్వాహకుల్లో ఆనందం కనిపించింది. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది. -
చికాగోలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
చికాగో : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ చికాగో(టీఏజీఏసీ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చికాగోలోని గ్లెన్ డేల్ లో రమడ ఇన్ బాంక్వెట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కాన్సుల్ రాజేశ్వరి చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేశ్వరి చంద్రశేఖరన్, కో స్పాన్సర్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు జ్యోతి మాధవరామ్, ప్రణిత కందిమళ్లలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఏజీఏసీ మహిళ ఫోరం ఛైర్పర్సన్ బింధు గంగోటి, టీఏజీఏసీ ప్రెసిడెంట్ జ్యోతి చింతలపాణిలు అతిథులను సాధర ఆహ్వానం పలుకుతూ ప్రసంగించారు. చికాగోలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారు.బింధు గంగోటి, కో ఛైర్పర్సన్స్ నందిని కొండపల్లి, కీర్తి అడ్డుల, శైలజ యెండులూరి, మేఘన లక్కిడి సౌమ్య బొజ్జ, రజిత గోపు, దీప్తి గార్లపాటి, దీప్తి ముత్యం పేట్, క్రాంతి దొండ, శ్వేత జనమంచి, హరిత గునుగాటిలు పలు వినోధ కార్యక్రమాలకు రూప కల్పన చేసి అతిథులను ఆహ్లాద వాతావరణంలో గడిపేలా చేశారు. ఆటా, పాటలతో పాటూ వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శైలజా మురుగు తన సంగీతంతో అందరిని ఆకట్టుకున్నారు. మమతా శర్మ, గ్రీష్మ వర్గీస్‌లు అతిథులకు విలువైన సూచనలు చేశారు. ప్రముఖ నటి శ్రీదేవి మృతికి సంతాపం తెలిపారు. యూత్ వాలంటీర్లు సునైనా గొంగటి, రియా గునుగంటి, సంజనా గొంగటి, రివా లక్కడి, స్మ్రుతి బెర్రమ్, లహరి బెర్రం, అమెయా, తాన్వి శ్రీవోల్లు చికాగోలోని లా రబిడా పిల్లల ఆసుపత్రికి విరాళాల సేకరణకు తమవంతు సహాయం చేశారు. టీఏజీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మమతా లంకల, విజయ్ బెర్రమ్, వెంకట్ గునుగంటి, శ్వేత జనమంచిలు ఆతిథులను మర్వాదపూర్వకంగా ఆహ్వానించే పనులు చూసుకోగా, వాణి యంత్రింతాల డెకరేషన్ పనులను పర్యవేక్షించారు. కో స్పాన్సర్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సత్య కందిమళ్ల, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, మిగతా స్పాన్సర్స్, బోర్డు మెంబర్స్, ఉమా అవదూత, సుజాత కట్ట, మానస లట్టుపల్లి, క్రాంతి బీరం, రుక్మిణి చాడ, వాలంటీర్లకు టీఏజీఏసీ ప్రెసిడెంట్ జ్యోతి చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. -
‘కేసీఆర్ గారూ.. మీ కేబినెట్లో మహిళలేరీ..?’
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ మాత్రమే రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. పార్టీలోని మూడో వంతు పోస్టులు మహిళలకే కేటాయించిందన్నారు. అత్యధిక మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఘనత కూడా బీజేపీకే దక్కుతుందన్నారు. మోదీ కూడా తన మంత్రి వర్గంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రాధాన్యమిచ్చారన్నారు. మిగిలిన పార్టీలు కేవలం మాటలకే పరిమితయ్యాయని విమర్శించారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని..ఈ విషయం ఆధారంగా మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ గారూ.. మీలో కాంగ్రెస్ భావాలు పోలేదు.. మీ పాపాల ప్రక్షాళన మోదీ చేస్తున్నారు.. వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు... మరి మీరంటున్న గుణాత్మకమైన మార్పు అంటే ఏమిటి.. మహిళలు లేకుండా చేయడమేనా’ అని ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం బీజేపీ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కేవలం బీజేపీకే సాధ్యమని వ్యాఖ్యానించారు. -
మహిళలకు అండగా నిలవాలి: సీఎం
సాక్షి, హైదరాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఏ సమాజమైనా సంపూర్ణంగా పురోగమిస్తుం దని అన్నారు. మహిళలు సాధికారత సాధించడానికి యావత్ సమాజం అండగా నిలవాలని సూచించారు. మహిళల అభ్యున్నతి, స్వేచ్ఛ, భద్రత, ప్రోత్సాహం కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
నేను శక్తి స్వరూపం
సాక్షి, హైదరాబాద్ : నేను శక్తి.. అంటూ నారీలోకం గళమెత్తింది. స్త్రీ శక్తిని నలుచెరుగులా చాటి చెప్పింది. లింగ వివక్ష, గృహహింస, వేధింపులకు వ్యతిరేకంగా కదం తొక్కింది. మహిళా సాధికారత కోసం నినదించింది. మహిళాభ్యున్నతికి గత నెలరోజులుగా ‘సాక్షి’నిర్వహించిన ‘నేను శక్తి’అక్షర ఉద్యమ ముగింపు ఉత్సవం బుధవారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లోని సమావేశ మందిరంలో అంగరంగ వైభవంగా జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు మహిళల కోసం, మహిళల చేత, మహిళలే ముందుండి నిర్వహించిన ఈ కార్యక్రమం వారిలో నూతనోత్సాహం, ఉత్తేజాన్ని నింపింది. మహిళా హక్కుల ఉద్యమకారులు, కార్యకర్తలు, రచయిత్రులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన అమ్మ, అద్దిల్లు, లివింగ్ ఐడల్, చిట్టితల్లి లఘు చిత్రాల్లోని కీలక సన్నివేశాలు సమాజంలో నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దంపట్టాయి. సెలబ్రిటీలూ బాధితులే.. విద్యా, ఆర్థిక స్థిరత్వంతోనే మహిళలు సాధికారత సాధించగలుగుతారని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని చేసిన కీలకోపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. సెలబ్రిటీలైన తాము సైతం సమాజంలో భౌతిక, మానసిక వేధింపులకు గురికాక తప్పట్లేదని తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మహిళల హక్కులు, లింగ సమానత్వంపై సాంస్కృతిక, మహిళా హక్కుల కార్యకర్తలు దేవి, కాకర్ల సజయల ప్రసంగాలు ఆలోచింపజేశాయి. మహిళల కోసం ‘నేను శక్తి’పేరుతో అక్షర ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ‘సాక్షి’ప్రతినిధులు తనను సంప్రదించినప్పుడు.. ఇందులో కొత్తదేముంది? అంద రూ చేసే కార్యక్రమమేనని తొలుత భావించానని, అయితే ఈ కార్యక్రమం తన అంచనాలకు మించి విజయవంతమైందని దేవి ప్రశంసించారు. ఈ ఉద్యమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని, అందరి సలహాలు, సూచనలతో మరో దశకు తీసుకెళ్లాలని సూచించారు. తెలుగు సినీ రంగంలో తనకు ఎదురైన వేధింపులు, వివక్షపై పాటల రచయిత్రి శ్రేష్ట ఈ కార్యక్రమంలో నిర్భయంగా మాట్లాడారు. వృత్తి జీవితంలో తన ఎదుగుదలలో ‘సాక్షి’కీలక పాత్ర పోషించిందని ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్, న్యాయవాది నిశ్చలరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పురస్కారాల ప్రదానం ఆడపిల్ల పుట్టిందని వివక్ష చూపకుండా కూతుళ్లను ప్రయోజకురాలుగా తీర్చిదిద్దిన పలువురు తల్లిదండ్రులతో పాటు మహిళల సమస్యలపై లఘు చిత్రాలు రూపొందించిన వారికి ‘సాక్షి’గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, అమల అక్కినేని నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. ‘సాక్షి’టీవీ ప్రజెంటర్ స్వప్న యాంకరింగ్‌లో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కార్యక్రమం జరిగింది. మహిళల కోసం ‘సాక్షి’అక్షర యజ్ఞం ఇకపై కూడా కొనసాగుతుందని రాణిరెడ్డి హామీ ఇచ్చారు. -
‘నేను శక్తి’ వేడుకలు
‘నేను శక్తి’. స్త్రీలు తరతరాల అంతరాలను దాటుకుని, తమలో దాగున్న అనంత శక్తిని యావత్ ప్రపంచానికి చాటాలన్న సమున్నత లక్ష్యంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. అసమానతల్ని అధిగమించి ఇంటా బయటా, సమాజ ప్రగతికి సంబంధించిన ప్రతి మలుపులోనూ తనదైన ముద్రవేసిన మహిళా మణులెందరినో మనసారా స్మరించుకునే ఘట్టం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షిస్తూ, సిసలైన మహిళాభ్యున్నతి భావనను ‘సాక్షి’ సొంతం చేసుకున్న అపురూప సందర్భం. స్త్రీలు ఆజన్మాంతం ఎదుర్కొంటున్న సవాళ్ళను సవివరంగా చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించి, మహిళా సాధికారతను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సాగింది ‘సాక్షి’. ఈ క్రతువులో నెల రోజుల పాటు అందించిన, అందిస్తున్న కథనాలు, కథలు, వాస్తవికతలను పాఠకలోకం ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. నిండు మనసుతో సొంతం చేసుకుంది. సమానత్వ సాధనకు ‘సాక్షి’ చేపట్టిన లింగ వివక్ష వ్యతిరేకోద్యమంలో అశేష పాఠకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను నిలదీస్తూ, వారి మధ్య సమానత్వ సాధన దిశగా ‘సాక్షి’ వేసిన ఈ ముందడుగును మేధావులు, కవులు, రచయిత్రులు, ప్రజాస్వామికవాదులెందరో హృదయపూర్వకంగా అభినందించారు. ‘నేను శక్తి’ ప్రచారోద్యమంలో మొదట లింగ వివక్ష, గృహ హింస, లైంగిక వేధింపులు, సాధికారత... ఈ నాలుగు అంశాలపై ‘సాక్షి’ విçస్తృతంగా చర్చించింది. తమ అమ్మాయిలను వివక్షను ఎదిరించి నిలిచే ధీరవనితలుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ‘సూపర్ పేరెంట్స్’గా సత్కరించుకునేందుకు, సంబంధిత కథనాలతో కూడిన 10 నిమిషాల నిడివి గల ‘షార్ట్ ఫిల్మ్’లను ఆహ్వానించింది. ఇందుకు పాఠక లోకం నుంచి విశేష స్పందన లభించింది. అందిన ఎంట్రీల్లోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నేను శక్తి’ ముగింపు వేడుకల్లో సముచితంగా సత్కరించాలని భావిస్తున్నాం. ఈ నెల 7న హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ‘నేను శక్తి’ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మీ అందరికీ ఇదే సాదర ఆహ్వానం. వేడుకల్లో పాల్గొనేందుకు 95055 55020కు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోగలరు. -
కొలంబస్లో ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం
కొలంబస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఒహియోలోని కొలంబస్లో ఘనంగా నిర్వహించారు. పెర్సిస్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 130 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. నృత్యాలు, పాటలతో పాటూ ముఖ్యంగా యువతుల ఫ్యాషన్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ప్రణీతా రెడ్డి ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఆటా సభ్యులైన సుధా రెడ్డి అతిథులను సాదరంగా ఆహ్వానించారు. చందు రెడ్డి, అమర్ రెడ్డి కార్యక్రమరూపకల్పన చేయగా స్వాతి రెడ్డి కార్యక్రమం విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు. -
ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
-
‘సాక్షి’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
-
అన్ని రంగాల్లో రాణించాలి
‘సాక్షి’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సిటీబ్యూరో: సమాజంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్లాలని ‘సాక్షి’ విమెన్స్ డే వేడుకల్లో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం ‘సాక్షి’ జర్నలిజం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డితో పాటు ప్రముఖ వైద్యులు పి.రఘురాం,ప్రత్యూష, కవితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ రఘురాం మాట్లాడుతూ కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చని. మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌పై అపోహలు, భయాలు, అవగాహన లేకపోవడంతో తీవ్రత పెరుగుతోందన్నారు. దేశంలో ఏటా 70వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మారిన జీవనవిధానం, తల్లిపాలు ఇవ్వకపోవడం, స్థూలకాయం రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. విదేశాల్లోలాగా ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ సరిగా జరగడంలేదని, ఏటా దేశ వ్యాప్తంగా స్క్రీనింగ్ నిర్వహించల్సిన అవసరం ఉందన్నారు. రొమ్ములో వచ్చే అన్ని గడ్డలు కేన్సర్ గడ్డలు కావని, మహిళలు గడ్డలు రాగానే భయాలతో కేన్సర్ అని భావించి ఆందోళనలతో ఎవరికీ చెప్పకుండా తమలో తామే కుమిలిపోతుంటారన్నారు. అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ సంప్రదించాలని కోరారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా రొమ్ముక్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్వైకల్ క్యాన్సర్, పలు వ్యాధులపై డాక్టర్ కవిత వివరించగా, దంత సంరక్షణపై డాక్టర్ ప్రత్యూష సలహాలు,సూచనలు అందజేశారు. అనంతరం సాక్షి మహిళా ఉద్యోగులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి, ఐటీ విభాగం ప్రెసిడెంట్ దివ్యారెడ్డి, సీఎఫ్ఓ సాచిమహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
'పురుష దినోత్సవం జరుపుకునేలా చేస్తా'
మహిళలు 'మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నట్లే పురుషులు కూడా పురుష దినోత్సవం నిర్వహించుకునేలా చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆ రోజున తమ ఇబ్బందులు, కష్టాలను చర్చించుకునే అవకాశం దక్కేలా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'మహిళా ఉపాధ్యాయ సదస్సు'లో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మగవాళ్లంతా చూసి గర్వం అనుకుంటున్నారని... కాలు మీద కాలు వేసుకునేది గర్వంతో కాదు, కాళ్లు నొప్పులతోనేనని సరదాగా చమత్కరించారు. -
మహిళకు సత్కారం
సాక్షి, చెన్నై :పురుషాధిక్య యుగంలో అన్ని రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళుతున్న మహిళల్ని గౌరవించుకునే రీతి లో, మహిళా శక్తిని చాటే విధంగా, మహిళలకు భద్రత కల్పించాలన్న నినాదంతో రాష్ట్రంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో మెరీనా తీరంలోని అవ్వయార్ విగ్రహం వద్ద నిరాడంబరంగా వేడుకలు జరిగాయి. అవ్వయార్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, చిన్నయ్య, సెంథిల్ బాలాజీ, బివి రమణ, అబ్దు ల్ రెహ్మాన్ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. మహిళా శక్తిని చాటే విధంగా, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యల్ని గుర్తు చేసుకున్నారు. అన్నాడీఎంకే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాలు విశాలక్షి నెడుంజెలియన్, ఎంపి శశికళ పుష్ప నేతృత్వంలో అతి పెద్ద కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో మహిళా మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి పాల్గొని అందరికీ కేక్ ను పంచి పెట్టారు. అలాగే రాష్ట్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మహిళలకు మంత్రి గోకుల ఇందిర సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. సీక్ ఫౌండేషన్, సెయింట్ బ్రిట్టో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మెరీనా తీరంలో ఉదయాన్నే భారీ మారథాన్ జరిగింది. ఇందులో వేలాది మంది మహిళలతోపాటుగా యువకులు తరలివచ్చి పరుగులు తీశారు. గాంధీ విగ్రహం వద్ద ఈ రన్‌ను సినీ నటి అమల పాల్ తరపున ఆమె భర్త, దర్శకుడు విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఉత్సాహ భరితంగా ఈ రన్ సాగింది. బీసెంట్ నగర్లో న్యాయవాది అరుణ్ మొళి నేతృత్వంలో విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. మహిళలకు భద్రత కల్పించాలని, విద్యా, వైద్య రంగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ను వర్తింప చేయాలని నినాదిస్తూ ఈ ర్యాలీ సాగింది. ఇదే విధంగా రాష్ట్రంలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి, సేలం, కోయంబత్తూరు తదితర నగరాల్లోనూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు జరిగాయి. అవార్డుల ప్రదానం ఉత్తమ సేవల్ని అందిస్తున్న మహిళల్ని గౌరవించుకునే విధంగా సత్కారాలు చేశారు. టీఎన్‌సీసీ మహిళా విభాగం నేతృత్వంలో జరిగిన వేడుకలో అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంతను ఘనంగా సత్కరించి ఉత్తమ సేవా అవార్డును ప్రదానం చేశారు. టేక్ కేర్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా దినోత్స వం నిర్వహించారు. ఇందులో ఏడీజీపీ షకీల్ అక్తర్, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ప్రముఖ జర్నలిస్టు భగవాన్ సింగ్ పాల్గొన్నారు. ఇందు లో వివిధ రంగాల్లో రాణిస్తూ, మహిళ సంక్షేమం కోసం శ్రమిస్తున్న సేవకులను ఇందులో ఘనం గా సత్కరించారు. నటి రితిక, మహిళా విలేకరి శిరీషా రెడ్డికి అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్ర సోషియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్కా ఆవరణలో దేశం కోసం శ్రమిం చి అశువులు బాసిన వీర సైనికుల సతీమణులను సత్కరించారు. పెరంబూరు తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాలు జరిగాయి. నగరంలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుక లో మహిళా ఖ్యాతిని గుర్తు చేస్తూ ప్రసంగాలు సాగాయి. బీజేపీ మహిళా నేత వానతీ శ్రీనివాసన్ నేతృత్వంలో మైలాపూర్‌లో జరిగిన వేడుకలో యువతులకు పెప్పర్ స్ప్రేలను పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కేక్ కట్ చేశారు. మహానాడు తరహాలో కోయంబత్తూరు వేదికగా డీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ కనిమొళి పాల్గొన్నారు. నగరంలో జరిగిన వేడుకలో క్రీడా కారిణి, ప్రత్యేక ప్రతిభావంతురాలు అనురాధా రవి రాజను కాంగ్రెస్ నాయకురాలు, నటి కుష్భు సత్కరించారు. అన్ని కార్పొరేషన్లలోని అమ్మ క్యాంటీన్లలో పనిచేస్తున్న మహిళలకు ఆ పార్టీ వర్గాలు పుష్ప గుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సేవల్ని ప్రశంసిస్తూ, ఉత్తమ మహిళా సేవకుల్ని సత్కరించుకునే విధంగా వేడుకలు జరిగాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ ఉచిత శిబిరాన్ని రాధికా శరత్‌కుమార్ ప్రారంభించా రు. అలాగే కీల్పాక్కం వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు, నర్శింగ్ విద్యార్థుల నేతృత్వంలో మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ప్రతి ఏటా ఉత్తమ సేవల్ని అందించిన మహిళకు అవ్వయార్ బిరుదును ప్రకటిస్తున్నారు. ఈ ఏడాదికి గాను ఈ బిరుదును వైద్య పరిశోధనా కేంద్రం కార్యదర్శి శాంతి రంగనాథన్‌కు ప్రకటించారు. -
సాక్షి మహిళా దినోత్సవ వేడుకలు
-
అమానుషం
మేకలు మేపే యువతిపై అత్యాచారం, హత్య స్థానికులే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానం తెల్లవారితే మహిళా దినోత్సవ సంబరాలు.. ఇదే సమయంలో అభం శుభం తెలియని యువతి బతుకు తెల్లారిపోయింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు.. అంతటితో ఆగకుండా గొంతునులిమి చంపేశారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చారు. -పెనుమూరు తండ్రి లేడు.. తల్లికి మతిస్థిమితం లేదు. ఆసరా లేని ఆడపిల్ల పిన్ని ఇంట్లో పెరిగింది. మేకలు కాసేందుకు వెళ్లి కామాంధుల అకృత్యానికి బలైంది. కలవగుంట పంచాయతీ దిగువపూనేపల్లెలో అంతులేని విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, గిలిజ దంపతులకు నలుగురు ఆడ సంతానం. సుబ్రమణ్యం పిల్లలు చిన్నతనంలో చనిపోయాడు. దీంతో బాలికలు తండ్రి లేనివారయ్యారు. భర్త మృతితో గిలిజకు మతిస్థిమితం లేకుం డాపోయింది. దీంతో బాలికలు పిన్నమ్మ కుట్టెమ్మ, చిన్నాన్న జగన్నాథం వద్ద పెరిగారు. మొదటి ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపారు. చివరి అమ్మాయి రీటా (18) చదువుకోలేదు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మేకలు తోలుకుని ఊరి పొలిమేరకు వెళ్లింది. ఇదే సమయంలో కొందరు కామాంధులు ఆమెపై కన్నేశారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రీటాను వివస్త్రను చేసి ఆత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిపి చంపేశారు. నాలుగు గంటల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియ లేదు. ఆ వైపుగా వెళ్తున్న కొందరు పొదల మధ్య పడి ఉన్న మృతదేహం చూసి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాగిలాలను రప్పించి తీవ్ర స్థాయిలో పరిశోధన ప్రారంభించారు. రాత్రి 10 గంటల వరకు ఎస్పీ స్థానికులను విచారించి నిందితుల సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు జాగిలాలు ఘటన జరిగిన మొత్తం ప్రాంతాన్ని తనిఖీచేసి అనుమానం ఉన్న చోట ఆగిపోయాయి. తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను త్వరలో పట్టుకుంటాం ఎస్పీ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురు, నలుగురు కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉం డవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. సంఘటన స్థలం నుంచి జాగిలాలు ప్రధాన రహదారి వరకు వచ్చి ఆగిపోవడంతో నిందితులు అక్కడి వరకు మాత్రమే ద్విచక్రవాహనంలో వచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. మాయని మచ్చ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడానికి తయారవుతున్నాం. ఇంతలో పెనుమూరు మండలంలో ఘటన తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. చట్టాలు చేయడం తేలిక అయితే వాటి అమలు చేసి మహిళల ప్రాణాలు కాపాడాల్సినబాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. నిందితులను వెంటనే పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. -గాయత్రీదేవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు