మహిళా అభ్యున్నతి లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పరంపరలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2022 మార్చి 13న నారీ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు నాట్స్ ప్రెసిడెంట్ విజయ్‌శేఖర్ అన్నె, చైర్ ఉమన్ అరుణ గంటిలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విజయం సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచిన దీప్తిరెడ్డి, నిహారికరెడ్డి, దేవి దొంతినేనిలు ప్రసంగించనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ https://www.natsworld.org/women_empowerment ద్వారా పాల్గొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment