చికాగో: భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దానికి తగ్గట్టుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టింది. 2500 డాలర్ల విలువైన ఆహారాన్ని, నిత్యావసరాలను సేకరించింది. చికాగోలో పేదల ఆకలి తీర్చే సంస్థ హెస్డ్ హౌస్ కు సేకరించిన ఆహారాన్ని అందించింది. అత్యంత నిరుపేదలకు, నిరాశ్రయులకు ఈ సంస్థ ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంటుంది.
పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నాట్స్ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన, శ్రీనివాస్ అర్సడ, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె. బాలినేని, లక్ష్మి బొజ్జ, వేణు కృష్ణార్ధుల, హరీశ్ జమ్ముల, బిందు విధులమూడి, భారతీ పుట్టా, వీర తక్కెళ్లపాటి, రోజా శీలం శెట్టి, కార్తీక్ మోదుకూరి, రజియ వినయ్, నరేంద్ర కడియాల, పాండు చెంగలశెట్టి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఆపి 40 వార్షిక సదస్సు వివరాలు
Comments
Please login to add a commentAdd a comment