‘నాటా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు | Womens Day Celebrations In NATA At North Carolina | Sakshi
Sakshi News home page

‘నాటా’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

May 9 2019 2:30 PM | Updated on May 9 2019 3:19 PM

Womens Day Celebrations In NATA At North Carolina - Sakshi

నార్త్ కరోలినా: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) మహిళా దినోత్సవ వేడుకలను షార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నాటా ప్రెసిడెంటు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. నాటా తలపెట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 300పైగా మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం సమీరా ఇళ్ళెందుల యాంకరింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అనురాధా పన్నెం దర్శకత్వం లో ప్రదర్శించిన నాటికఅందరిని కడుపుబ్బ నవ్వించింది. సునీత సౌందరరాజన్ చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో హుందాగా సాగింది. దుర్గా శైలజ దలిపర్తి, లావణ్యకోనురి ఆధ్వర్యంలో సాగిన నాట్య విన్యాసాలు అందరిని ఆనందపరిచాయి. 

‘సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవయే నాటా బాట’ ను ఆచరిస్తూ ఆటపాటలే ముఖ్యోద్దేశం కాకుండా సేవాతత్వం తో విరాళాలు సేకరించారు. షార్లెట్ లో స్వచ్చందం గా సేవలు అందించే లిల్లిపాడ్ హేవన్ అనే సంస్థకి ఆ విరాళాలు అందించారు. ఈ మహిళా దినోత్సవం లో పాలుపంచుకొన్న మహిళలందరూ నాటా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారని ప్రధాన కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ రామిరెడ్డి  తెలిపారు.  
 

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement