మహిళకు సత్కారం | International Women's Day | Sakshi
Sakshi News home page

మహిళకు సత్కారం

Published Mon, Mar 9 2015 2:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

మహిళకు సత్కారం - Sakshi

మహిళకు సత్కారం

పురుషాధిక్య యుగంలో అన్ని రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళుతున్న మహిళల్ని గౌరవించుకునే రీతి లో,

 సాక్షి, చెన్నై :పురుషాధిక్య యుగంలో అన్ని రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళుతున్న మహిళల్ని గౌరవించుకునే రీతి లో, మహిళా శక్తిని చాటే విధంగా, మహిళలకు భద్రత కల్పించాలన్న నినాదంతో రాష్ట్రంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో మెరీనా తీరంలోని అవ్వయార్ విగ్రహం వద్ద నిరాడంబరంగా వేడుకలు జరిగాయి. అవ్వయార్ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, చిన్నయ్య, సెంథిల్ బాలాజీ, బివి రమణ, అబ్దు ల్ రెహ్మాన్  పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. మహిళా శక్తిని చాటే విధంగా, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యల్ని గుర్తు చేసుకున్నారు. అన్నాడీఎంకే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాలు విశాలక్షి నెడుంజెలియన్, ఎంపి శశికళ పుష్ప నేతృత్వంలో  అతి పెద్ద కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో మహిళా మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి పాల్గొని అందరికీ కేక్ ను పంచి పెట్టారు.
 
 అలాగే రాష్ట్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మహిళలకు మంత్రి గోకుల ఇందిర సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. సీక్ ఫౌండేషన్, సెయింట్ బ్రిట్టో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మెరీనా తీరంలో ఉదయాన్నే భారీ మారథాన్ జరిగింది. ఇందులో వేలాది మంది మహిళలతోపాటుగా యువకులు తరలివచ్చి పరుగులు తీశారు. గాంధీ విగ్రహం వద్ద ఈ రన్‌ను సినీ నటి అమల పాల్ తరపున ఆమె భర్త, దర్శకుడు విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఉత్సాహ భరితంగా ఈ రన్ సాగింది. బీసెంట్ నగర్‌లో న్యాయవాది అరుణ్ మొళి నేతృత్వంలో విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. మహిళలకు భద్రత కల్పించాలని, విద్యా, వైద్య రంగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ను వర్తింప చేయాలని నినాదిస్తూ ఈ ర్యాలీ సాగింది. ఇదే విధంగా రాష్ట్రంలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి, సేలం, కోయంబత్తూరు తదితర నగరాల్లోనూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు జరిగాయి.
 
  అవార్డుల ప్రదానం
 ఉత్తమ సేవల్ని అందిస్తున్న మహిళల్ని గౌరవించుకునే విధంగా సత్కారాలు చేశారు. టీఎన్‌సీసీ మహిళా విభాగం నేతృత్వంలో జరిగిన వేడుకలో అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంతను ఘనంగా సత్కరించి ఉత్తమ సేవా అవార్డును ప్రదానం చేశారు. టేక్ కేర్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా దినోత్స వం నిర్వహించారు. ఇందులో ఏడీజీపీ షకీల్ అక్తర్, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ప్రముఖ జర్నలిస్టు భగవాన్ సింగ్ పాల్గొన్నారు. ఇందు లో వివిధ రంగాల్లో రాణిస్తూ, మహిళ సంక్షేమం కోసం శ్రమిస్తున్న సేవకులను ఇందులో ఘనం గా సత్కరించారు. నటి రితిక, మహిళా విలేకరి శిరీషా రెడ్డికి అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్ర సోషియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్కా ఆవరణలో దేశం కోసం శ్రమిం చి అశువులు బాసిన వీర సైనికుల సతీమణులను సత్కరించారు. పెరంబూరు తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాలు జరిగాయి.
 
 నగరంలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుక లో మహిళా ఖ్యాతిని గుర్తు చేస్తూ ప్రసంగాలు సాగాయి. బీజేపీ మహిళా నేత వానతీ శ్రీనివాసన్ నేతృత్వంలో మైలాపూర్‌లో జరిగిన వేడుకలో యువతులకు పెప్పర్ స్ప్రేలను పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కేక్ కట్ చేశారు. మహానాడు తరహాలో కోయంబత్తూరు వేదికగా డీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ కనిమొళి పాల్గొన్నారు. నగరంలో జరిగిన వేడుకలో క్రీడా కారిణి, ప్రత్యేక ప్రతిభావంతురాలు అనురాధా రవి రాజను కాంగ్రెస్ నాయకురాలు, నటి కుష్భు సత్కరించారు.  అన్ని కార్పొరేషన్లలోని అమ్మ క్యాంటీన్లలో పనిచేస్తున్న మహిళలకు ఆ పార్టీ వర్గాలు పుష్ప గుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సేవల్ని ప్రశంసిస్తూ, ఉత్తమ మహిళా సేవకుల్ని సత్కరించుకునే విధంగా వేడుకలు జరిగాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ ఉచిత శిబిరాన్ని రాధికా శరత్‌కుమార్ ప్రారంభించా రు. అలాగే కీల్పాక్కం వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులు, నర్శింగ్ విద్యార్థుల నేతృత్వంలో మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ప్రతి ఏటా ఉత్తమ సేవల్ని అందించిన మహిళకు అవ్వయార్ బిరుదును ప్రకటిస్తున్నారు. ఈ ఏడాదికి  గాను ఈ బిరుదును వైద్య పరిశోధనా కేంద్రం కార్యదర్శి శాంతి రంగనాథన్‌కు ప్రకటించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement