
సాక్షి, హైదరాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఏ సమాజమైనా సంపూర్ణంగా పురోగమిస్తుం దని అన్నారు. మహిళలు సాధికారత సాధించడానికి యావత్ సమాజం అండగా నిలవాలని సూచించారు. మహిళల అభ్యున్నతి, స్వేచ్ఛ, భద్రత, ప్రోత్సాహం కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment