
వాషింగ్టన్ డిసి : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) ఆధ్వర్యంలో ఆష్బర్న్, వర్జీనియా నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 500 మంది మహిళలకు పైగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. ప్రియ ప్రార్థనా గీతంతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం కూచిపూడి డాన్స్ అకాడమీ ట్రినిటీ పంత్ గణేష పంచరత్నాన్ని ప్రదర్శించారు. మాధవీ మైలవరపు బృందం అష్టలక్ష్మి స్తోత్రం ఆలపించారు. సుధ, శ్రీలత, లలిత మహిళా సంబంధిత పాటలు పాడి అలరించారు.శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన ర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది. కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబుకి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లెకి, తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునే రంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లకి, ఐటీ రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలును ఈ సందర్భంగా సన్మానించారు .
చైతన్యవంతుల సంబంధించిన ప్రశ్నలు, జయ తెలికుంట్ల, రాధిక జయంతిల వ్యాఖ్యానం, సరదా సరదా ఆటలతో ఈ కార్యక్రమం సాగింది. వసుధారారెడ్డి మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు. చివరగా సంధ్య బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫ్యాషన్ వాక్ ప్రత్యేకత సంతరించుకుంది. నాటా కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు, చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య, స్వరూప గిండి, అనిత ,లావణ్య, గౌరి, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్ పాల్గొన్నారు. తానా, అమెరికన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీడీఎప్, జీడబ్యూటీసీఎస్(GWTCS), ఇతర నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు.
నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ, ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి, సురేఖ, హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల, మోహన్ కలాడి, బాబూరావు సామల, కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు
మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు, సుజిత్ మారం, రమేష్ వల్లూరి తదితరులు పాల్గొన్నారు.








Comments
Please login to add a commentAdd a comment