
డాలస్ : తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇర్వింగ్‌లో ఉన్న కూచిపూడి ఇండియన్ కిచెన్‌లో జరిగిన ఈ వేడుకలకు రెండువందలకు పైగా మహిళలు హాజరయ్యారు. ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక సోదరిగా ఉద్యోగ రంగంలో మహిళ తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది అని పలువురు కొనియాడారు.
డాలస్ శాఖ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సునీత త్రిపురం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది. ఉమెన్స్ కమిటీ నేషనల్ కో-ఛైర్ రూప కన్నయ్య, టాటా సంయుక్త కార్యదర్శి నీలోహిత కొత్తా, కల్చరల్ కమిటీ నేషనల్ ఛైర్ సమీరా ఇల్లెందుల, డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్లు శాంతి నూతి, దీప్తి సూర్యదేవార, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ లేక్ మేయర్ లారా హిల్ పాల్గొన్నారు. సభని ఉద్యేశించి మాట్లాడుతూ భారతీయ స్త్రీ అంటే తనకి ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో వీణా యలమంచిలి తన గాత్రంతో అలరించారు.
టాటా ప్రెసిడెంట్ విక్రం జంగం మాట్లాడుతూ పూర్తి కుటుంబాన్ని తన భుజాలపై మోస్తున్న స్త్రీ మూర్తికి ఎల్లవేళలా అందరూ కృతజ్ఞత తెలపాలని కోరారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. సెల్ఫీ కాంటెస్ట్, ఫ్యాషన్ షో అని వినూత్నమైన కార్యక్రమాలతో నిర్వాహుకులు అందరిని ఆకట్టుకున్నారు. టాటా బోర్డు సభ్యులు మహేష్ ఆదిభట్ల, చంద్ర రెడ్డి పోలీస్‌లతో పాటు పవన్ గంగాధరా, శ్రీధర్ కుంభాల, శ్రీనివాస్ తుల, నిరంజన్ బూడిద, శ్రీకాంత్ రౌతు, సురేష్ పతనేని, రత్న ఉప్పాల, భవాని జొన్నలగడ్డ పాల్గొని తన సహాయసహకారాలు అందించారు.






Comments
Please login to add a commentAdd a comment