తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన టీటీఏ టీమ్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వలిగొండలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు.
టిటిఎ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థుల కోసం మల్లారెడ్డి కంప్యూటర్, ఫర్నిచర్ వంటివి అందించడంపై ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ధన్యవాదాలు తెలిపారు . అనంతరం మల్లారెడ్డి స్వస్థలం సుంకిశాలకు చేరుకోని అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సుంకిశాల గ్రామంలో మల్లారెడ్డి స్కూల్, కాలేజ్, దేవాలయాలు నిర్మించి చాలా అభివృద్థి చేశారని గ్రామస్థులు కొనియాడారు. మల్లారెడ్డి చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను వారు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment