seva
-
నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్న నీతా అంబానీ..ఏకంగా లక్షలాదిమంది..
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించారు. అందులో భాగంగా సుమారు 50 వేల మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స, 50 వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ కేన్సర్లకు ఉచిత స్క్రీనింగ్ పరీకలు, చికిత్స, అలాగే దాదాపు పదివేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వంటి సేవలను అందజేయనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలా సరసమైన ధరలో తమ రిలయన్స్ ఫౌండేషన్ వైద్యసేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా మిలియన్లమందికి జీవితాలను ప్రసాదించి లెక్కలేనన్ని కుటుంబాల్లో కొత్త ఆశను అందించామని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సేవలందింస్తోన్న తమ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు మరిన్ని సేవలందించేలా ఇలా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంబించామని అన్నారు. మంచి ఆరోగ్యం సంపన్న దేశానికి పునాది అని, అలాగే ఆరోగ్యవంతమైన స్త్రీలు, పిల్లలు సమాజానికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కాగా, రిలయన్స్ పౌండేష్ గత దశాబ్ద కాలంలో 1.5 లక్షల మంది పిల్లలతో సహా 2.75 మిలియన్ల భారతీయులకు వైద్య సేవలను అందించింది. అత్యాధునిక వైద్యం అందించడంలో అత్యుత్తమైన ఆస్పత్రిగా నిలిచింది. అంతేగాదు ఐదు వందలకు పైగా అవయవ మార్పిడి తోపాటు కేవలం 24 గంటల్లో ఏకంగా ఆరు అవయవాల మార్పిడి చేసి బహుళ ప్రాణాలను కాపాడిని ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. ఇది భారతధేశంలోనే నెంబర్ వన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తింపు పొందింది. (చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!) -
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహన సేవ (ఫొటోలు)
-
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బిహార్‌లోని పాట్నాలో పర్యటించారు.ఆ నేపథ్యంలో అక్కడ గురుద్వారాను సందర్శించారు. అక్కడ సిక్కులు ఎక్కుగా మట్లాడుకునే లంగర్ సేవాలో పాలు పంచుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనే స్వహస్తాలతో తయారు చేసిన భోజనాన్ని అక్కడ కమ్యూనిటీలకు వడ్డించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏంటీ లంగర్ సేవా? ఏం చేస్తారంటే..ఇక్కడ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాలో సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా లంగర్ సేవా అనే సమాజ సేవాలో పాల్గొన్నారు మోదీ. అక్కడ మోదీ సిక్కు మాదిరిగా నారింజరంగు తలపాగా ధరించి చక్కగా గరిటి తిప్పతూ వంటలు చేశారు. ఇక్కడ లంగర్ అంటే.. గురుద్వారాకి సంబంధించిన సాముహిక వంటగది. ఇక్కడ మనుషుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఎలాంటి రుసుము తీసుకోకుండా బోజనం అందిస్తారు. ఇక్కడ గురుద్వారాను సందర్శించినప్పుడు సందర్శకులుకు సాంప్రదాయకంగా తీపి ప్రసాదంతో స్వాగతం పలుకుతారు. ఇది గురువు కృపకు ప్రతీక. సేవల సమయంలో హజరైన వారికి పూర్తి లంగర్‌తో కూడని భోజనంతో స్వాగతం పలుకుతారు. ఇది మతపరమైన భాగస్వామ్యం, ఆతిథ్య స్ఫూర్తిని సూచిస్తుంది. ఇక్కడ భోజనాలు చేసేవారంతా నేలపైనే కలిసి కూర్చొని.. సమానత్వాన్ని చాటుకుంటారు. ఈ వంటగదిని సిక్కు వాలంటీర్లు నిర్వహిస్తారు. వారంతా సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తారు. ఈ సంప్రదాయం సిక్కు మతంలోని సమానత్వం కలుపుగోలుతనం, నిస్వార్థ సేవలకు నిదర్శనంగా కనిపిస్తుంది. గురుపురబ్, బైసాఖి వంటి పండుగ సందర్భాల్లో కుటుంబాలు గురుద్వార వద్ద సమావేశమవుతాయి. ఇక్కడి వాతావరణం మతపరమైన స్ఫూర్తితో నిండి ఉంటుంది. ఈ సాముహిక అన్నసమారాధనలో అన్ని రకాల వయసుల వ్యక్తులు చురుకుగా పాల్గొంటారు. కాగా, ఈ పాట్నాలోని గురుద్వారా గురు గోవింద్ సింగ్ జన్మస్థలాన్ని జరుపుకోవడానికి నిర్మించిన సిక్కుల పవిత్రమైన ఐదు తఖత్‌లలో(దేవాలయాల్లో) ఒకటిగా చెబుతారు. (చదవండి: ఆ డ్రగ్‌తో ఎదుటివాళ్ల మైండ్‌ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!) -
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. -
నాగర్ కర్నూల్ , తుమ్మంపేట గ్రామంలో టీటీఏ సేవా డేస్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించింది టీటీఏ టీమ్. తుమ్మంపేట గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. టీటీఏ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్‌కు స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు అందించారు. టీటీఏ నాయకులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. స్కూల్ అభివృద్ధిలో సహాయసహాకారాలు అందిస్తున్న టీటీఏ బృందానికి టీచర్లతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉన్నటీటీఏ సంస్థను గ్రామస్థులు, పలువురు నాయకులు ప్రసంశించారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్ ను దత్తత తీసుకోనున్నామని టీటీఏ సభ్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ అడిగిన గ్రీన్ బోర్డ్ త్వరలో అందిస్తామని ప్రామిస్ చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ధైర్య ప్రదర్శన చేసిన పిల్లలకు మోమొంటోలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసారు. ఇక కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గణిత శాస్త్ర నిపుణులు రామానుజం జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను టీటీఏ నాయకులు మనోహర్, నరసింహ పేరుక తిలకించారు. ఇక విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. (చదవండి: 'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్‌చైర్స్ పంపిణీ) -
డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం 9
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజర్ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల నాయకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్వెటర్లను పంపిణీ చేశారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస మానాప్రగడతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని 250 మంది విద్యార్థులకు స్వెటర్లను అందించారు. ఈ సందర్భంగా టీటీఏ నాయకులను టీచర్లు, స్థానిక నాయకులు అభినందించారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ప్రసంగించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టీటీఏ తరుపున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి, సత్కరించారు. కొసమెరుపు ఏమిటంటే టీటీఏ సంస్థలో అంతర్గత విభేధాల కారణంగా రెండు వర్గాలు ఏర్పాడ్డాయి. టీటీఏ సంస్థలో చోటుచేసుకున్న ఈ విభేదాలు ప్రస్తుతం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కూడా ఎవరివారై నిర్వహించటం విశేషం. (చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!) -
యాదాద్రిలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీటీఏ టీమ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన టీటీఏ టీమ్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వలిగొండలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. టిటిఎ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థుల కోసం మల్లారెడ్డి కంప్యూటర్, ఫర్నిచర్ వంటివి అందించడంపై ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ధన్యవాదాలు తెలిపారు . అనంతరం మల్లారెడ్డి స్వస్థలం సుంకిశాలకు చేరుకోని అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుంకిశాల గ్రామంలో మల్లారెడ్డి స్కూల్, కాలేజ్, దేవాలయాలు నిర్మించి చాలా అభివృద్థి చేశారని గ్రామస్థులు కొనియాడారు. మల్లారెడ్డి చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను వారు ప్రశంసించారు. -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని ఈనెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవ డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి,సురేష్ రెడ్డి,గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్,మనోహర్ తదితరులు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్ లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని ఇందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేసామని చెప్పారు.అదే విధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు కూడా రావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!) -
టీటీఏ సేవాడేస్.. నెక్లెస్ రోడ్లో 5కే రన్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 5కె రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ 'రన్ ఫర్ హెల్త్ అంటూ' టీటీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొని, ప్రసంగించారు. 5కె రన్ కార్యక్రమాన్ని టీటీఏ టీమ్‌తో కలిసి ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ప్రారంబించారు. టీటీఏ సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమికి సేవచేయాలనే ఆలోచన తో కదిలిన టీటీఏ సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు సుధీర్ రెడ్డి. ఈ 5కె రన్ కార్యక్రమం గురించి సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవా డేస్‌తో పాటు టీటీఏ సాధించిన విజయాలను సంస్థ అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల వివరించారు. ప్రతి రెండేళ్ల ఒకసారి చేసే టీటీఏ సేవా కార్యక్రమం.. ఇక నుంచి ప్రతి సంవత్సరం చేస్తామని సంస్థ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల టీటీఏ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదీర్ రెడ్డితో పాటు పలువురిని శాలువాతో సన్మానించి మెమెంటోలు అందించారు. ఈ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందిరని ఆకట్టుకున్నాయి. జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాలేజ్ స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన, మణిపూర్ సంప్రదాయ కర్ర ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆద్యంతం ఉత్సహబరితంగా సాగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. (చదవండి: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా) -
టీటీఏ సేవా డేస్.. గజ్వేల్ లో ట్రై సైకిల్ లు పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఈ సేవా డేస్‌లో భాగంగా ఐదవ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన టీటీఏ బృందం.. గజ్వేల్ లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిల్ లు పంపిణీ చేశారు. సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, విజేంద్ర భాష, రోటరి క్లబ్ ఖమ్మంతో వారి సహాయంతో పాటు దాతాల సహకారంతో ట్రై సైకిల్, వీల్ చైర్లు పంపిణీ చేసినట్లు టీటీఏ టీమ్ తెలిపింది. అలాగే అవసరమైన వారికి కృత్రిమ అవయవాలకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సహాకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీఏ చేస్తున్న ఈ సేవాకార్యక్రమాలను పలువురు కొనియడారు. (చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు) -
Rajasthan Election 2023: మోదీ నినాదం.. అదానీజీ కీ జై
బుందీ/దౌసా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ సేవలో తరిస్తున్నారని, ఆయన కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ మాతా జై’ అని చెప్పే మోదీ అదానీ కోసం నిత్యం 24 గంటలూ పరితపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘భారత్ మాతాకీ జై’ అనడానికి బదులు ‘అదానీజీ కీ జై’ అని నినదించాలని మోదీకి హితవు పలికారు. భరతమాత అంటే పేదలు, రైతులు, కారి్మకులేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజస్తాన్‌లోని బుందీ, దౌసా జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ రెండు హిందూస్తాన్‌లను సృష్టించాలని భావిస్తున్నారని, అందులో ఒకటి అదానీ కోసం, మరొకటి పేదల కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు నిర్వహించడం లేదని మోదీని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతటా కుల గణన ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజస్తాన్‌లోనూ అధికారంలోకి రాగానే కులగణనకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కులగణనతోనే భరతమాత విజయం సాధిస్తుందని వివరించారు. రోజుకు మూడుసార్లు దుస్తులు మారుస్తారు మనదేశంలో బడా పారిశ్రామికవేత్తల్లో ఎవరైనా ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారా అని రాహుల్ ప్రశ్నించారు. రాజస్తాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు. మోదీ రూ.12,000 కోట్లతో విమానం కొనుక్కున్నారని, రోజుకు మూడు సార్లు దుస్తులు మారుస్తారని, రూ.12 కోట్ల విలువైన కారులో ప్రయాణిస్తుంటారని మోదీపై ధ్వజమెత్తారు. తమ జనాభా ఎంత ఉందో చెప్పాలని ఓబీసీ, దళిత, గిరిజన యువత అడిగితే మాత్రం కులాలు లేవని ప్రధానమంత్రి అంటున్నారని దుయ్యబట్టారు. మోదీ 90 మంది ఐఏఎస్ అధికారులతో పరిపాలన నడిపిస్తున్నారని, వారిలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఓబీసీల జనాభా 50 శాతం ఉందని, ఐఏఎస్‌లు మాత్రం జనాభాకు తగ్గట్టుగా లేరని తెలిపారు. -
అమెరికా ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన రుక్మిణి విజయకుమార్
అమెరికా, బే ఏరియాలో AIM for Seva నిర్వహించిన Donor appreciation event 2023 గ్రాండ్ సక్సెస్ అయింది. అనుభవ పేరుతో ఏర్పాటు చేసిన ఏకపాత్రాభినయ ప్రదర్శనకు అనుహ్య స్పందన వచ్చింది. సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన సంగీతం, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్ ఆడియన్స్‌ని కట్టిపేడేసింది. డాన్సర్, కొరియోగ్రాఫర్ రుక్మిణి విజయకుమార్..ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసింది.వయోలిన్ విద్వాంసుడు అంబి సుబ్రమణ్యం వాయిద్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. AIM బే ఏరియా చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి రాణి గోయెల్ వివరించారు. నిరుపేద పిల్ల విద్య, వారి కలలను పెంపొందించేందుకు AIM for Seva కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి విజయకుమార్, అంబి సుబ్రమణ్యం ఎంతో ఉత్సాహంగా లో పాల్గొని.. తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన తీరు ఔరా అనిపించింది. -
సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి
జైపూర్: సమాజంలో పేరు రావాలనే ఉద్దేశంతోకాకుండా ఎలాంటివి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయండని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. రాజస్తాన్‌లోని జామ్దోలీలో జరుగుతున్న సేవా సంఘ్‌లో ‘రాష్ట్రీయ సేవా భారతి’ ప్రతినిధులు, సంఘ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవత్ ఉపన్యసించారు. ‘ వ్యవస్థీకృతమైన శక్తులు ఎల్లప్పుడూ ఘన విజయాలను సొంతం చేసుకుంటాయి. విశ్వమానవాళి శ్రేయస్సు కోసం నిశ్శబ్దంగా సేవచేసే కార్యకర్తలం మనం. నిస్వార్థ సేవ అలవాటు చేసుకోండి. మనల్ని ఇంకెవరో పొగడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలపైకి దృష్టిని పోనివ్వకండి. సామాజిక సేవ చేస్తే పేరు అదే వస్తుంది. అంతమాత్రానికే దానిపై ధ్యాస పెట్టొద్దు. అహం మీకు అవరోధంగా మారొద్దు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటపుడు హుందాగా ఉండాలి. మనమేం గొప్ప పని చేయడంలేదు. సమాజం కోసం మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. -
కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే..
మోతీనగర్: ప్రస్తుత కాలంలో కాస్త అనారోగ్యానికి గురైనా రూ. వేలల్లో మొదలుకొని లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే వివిధ రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్‌ల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమకు వంతు సాయంగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు. సుమారు దశాబ్దంన్నర క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్, ప్రస్తుత అధ్యక్షుడు కొలసాని రాథా మోహన్‌రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్, అమెరికా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మురికి వాడల్లో నివసిస్తున్న పేద బడుగు వర్గాల వారికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా, ఫిజియోకేర్, రీహాబిలేషన్ కేంద్రం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి సైతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో పాటు ప్రముఖ యోగా గురువుతో ఆసనాలు వేయిస్తున్నారు. ♦ రోగులు సూచించిన నొప్పిని బట్టి దాని నివారణకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు పలువురు ప్రముఖ యోగా గురువులు ఆసనాలు చేయిస్తున్నారు. ♦ అంతేకాక వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు యోగక్షేమాలు తెలుసుకుని సలహాలు, సూచనలు చేస్తుంటారు. ♦ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలోని మురికి వాడల్లో నివసించే వారితో పాటు నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లోనూ ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం మినహాయించి ఒక్కో ప్రాంతంలో రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి సాయికృప ప్లాట్ నెంబర్ 332, శ్రీవివేకానందనగర్, డీఏవీ స్కూల్ రోడ్డులో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ♦ మూసాపేట డివిజన్ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో గత నాలుగేళ్ల నుంచి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే వైద్యులు అందుబాటు ఉంటున్నారు. అదే విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆవరణలోనూ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ♦ హ్యాండ్ గ్రిప్పర్, టెన్స్, ఐఎఫ్‌టీ, ఆల్ట్రాసౌండ్, స్విస్ బాల్, షోల్డర్ పుల్లీ, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో వైద్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చిన్నారికి ఫిజియో థెరపీ చేస్తున్న సిబ్బంది ఉచితంగా చేయడం సంతోషం.. : ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్న నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చిన తర్వాత వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న ఈ రోజుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటం సంతోషం -టి.నారాయణ చదవండి : రికార్డు కొట్టేసిన వంటలక్క, లక్కీ చాన్స్! అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్.. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు చెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమైన రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత సుమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం. – డాక్టర్ కె. కామాక్షి, ఎంపీటీ న్యూరాలజీ ఆరోగ్యంగా ఇంటికెళ్లడమే మాకు ఆనందం.. చాలా మంది వివిధ నొప్పులతో బాధపడుతూ తమ కేంద్రానికి వస్తుంటారు. వయస్సు పై బడిన వారు నొప్పులతో బాధపడుతూ రావటం చూసి మాకే ఒక్కోసారి బాధ కలుగుతోంది. వారి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం ప్రారంభిస్తాం. వారు వ్యాధి తగ్గిన తర్వాత సంతోషంగా వెళ్లటమే మాకు ఆనందం. మాకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘం. – డాక్టర్ బి. కృష్ణకుమారి, ఎంపీటీ స్పోర్ట్స్ -
ఆన్లైన్ శ్రీవారి సేవా టికెట్లు విడుదల
తిరుమల : జూలై నెలకు సంబంధించిన 58,419 అన్ లైన్ శ్రీవారి సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేసింది. ఆన్లైన్ లక్కీ డిప్ కేటగిరిలో 9,619 టిక్కెట్లను ఉంచారు. జనరల్ కేటగిరిలో మిగతా 48, 800 టిక్కెట్లు కేటాయించారు. తోమాల(110 టిక్కెట్లు), అర్చన(110 టిక్కెట్లు), అష్టదళ పాద పద్మారాధన(120 టిక్కెట్లు), సుప్రభాతం(6,979 టిక్కెట్లు), నిజపాద దర్శనం(2,300 టిక్కెట్లు) సేవలకు సంబంధించి సేవా ఎలక్ట్రానిక్ డిప్ నమోదు శుక్రవారం(ఈ నెల 6న) ఉదయం 10 నుంచి ప్రారంభమౌతుంది. జనరల్ కేటగిరిలోని వైశేషపూజకు(1000 టిక్కెట్లు). కల్యాణానికి(12,350 టిక్కెట్లు), దోలోత్సవం(3,900 టిక్కెట్లు), ఆర్జిత బ్రహ్మోత్సవం(7,150 టిక్కెట్లు), వసంతోత్సవం(8,800 టిక్కెట్లు), సహస్ర దీపోత్సవానికి(15,600 టిక్కెట్లు) కేటాయించారు. -
సత్యదేవుని సేవల్లో భక్తుల భాగస్వామ్యం
మూడు విలక్షణ సేవల ప్రారంభానికి పాలకవర్గం నిర్ణయం ఒక రోజు అన్ని సేవల్లో పాల్గొనేందుకు రూ.పది వేలు కొద్ది మార్పులతో రూ.8,500, రూ.7,500 టిక్కెట్లు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తుల్ని భాగస్వాముల్ని చేస్తూ మూడు రకాల టిక్కెట్ల తో ‘ఉదయాస్తమాన సేవలు’ ప్రారంభించాలని అన్నవరం దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. శనివారం సాయంత్రం దేవస్థానంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశం హాలులో ఛైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రాత్రి విలేకర్లకు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో తెల్లవారు జామున సుప్రభాత సేవ వద్ద నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనేందుకు వివిధ రుసుములున్నాయి. అయితే ఒకే భక్తుడు అన్ని సేవల్లో పాల్గొనే వీలు లేదు. ఇప్పుడు కొన్ని మార్పులతో మూడు రకాల ‘ఉదయాస్తమాన సేవలు ’ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఛైర్మన్, ఈఓ తెలిపారు. ఈ సేవలు రూ.10,000, రూ.8,500, రూ.7,500 టిక్కెట్‌తో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సేవల్లో పాల్గొనే భక్తులకు అనేక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు వారు కోరుకున్న రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగించారు. రూ.పది వేల టిక్కెట్‌తో లభించే సదుపాయాలు నలుగురు భక్తులు(భార్యా భర్త, మరో ఇద్దరు) స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చనలో పాల్గొనవచ్చు. వారికి స్వామివారి నిత్యకల్యాణం, ఏసీ వ్రత మండపంలో వ్రతం నిర్వహిస్తారు. స్వామివారి అంతరాలయంలో దర్శనం, యంత్రాలయంలో లోపల దర్శనం చేయిస్తారు. వేద పండితులతో వేదాశీర్వచనం ఏర్పాటు చేస్తారు. భక్తులు దేవస్థానంలో రెండ్రోజులు బస చేసేందుకు ఏసీ గది కేటాయిస్తారు. దంపతులకు వస్రా్తలు, స్వామివారి ఫొటో, అన్నదానప«థకంలో ప్రత్యేకంగా భోజనం, స్వామివారి ప్రసాదం ఇస్తారు. రూ.8,500 టిక్కెట్‌తో... స్వామివారి సుప్రభాతసేవ, నిత్యార్చన నిత్య కల్యాణంలో పాల్గొనే అవకాశం తప్ప రూ.పదివేలు టిక్కెట్ తీసుకునే వారికి కల్పించే సదుపాయాలే వీరికి కూడా కల్పిస్తారు. అదనంగా వీరు స్వామివారి ఆయుష్యహోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు. వీరికి ఏసీ గదిలో బస ఒకరోజు మాత్రమే కల్పిస్తారు. రూ.7,500 టిక్కెట్‌తో ... వీరికి ఒక రోజు ఏసీ గదిలో బస, ఏసీ మండపంలో వ్రతం, నిత్యకల్యాణం, వేదాశీర్వవచనం కల్పిస్తారు. నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, యంత్రాలయ దర్శనం, దంపతులకు వస్రా్తలు, ప్రసాదం, అన్నదాన పథకంలో భోజనం, స్వామివారి ఫొటో కూడా ఇస్తారు. భక్తులు ఈ అరుదైన అవకాశాలను ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈ ఉదయాస్తమాన సేవలను భక్తులకు వివరించి టిక్కెట్లు కొనుగోలు చేసేలా చూసేందుకు కొంతమంది పండితులు, అధికారులు, వ్రతపురోహిత ప్రముఖులతో కమిటీలు వేసేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
‘అన్నపూర్ణ కృషి ప్రసార సేవ’పై అవగాహన
కొత్తపల్లి : రైతులకు సాంకేతిక సమాచారాన్ని అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నపూర్ణ కృషి ప్రసార సేవ పేరిట టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లాలో తొలిసారి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అన్నపూర్ణ కృషి ప్రసార సేవ టోల్ ఫ్రీ నంబర్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చన్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఉద్యాన వన పంటలు, చేపల పెంపకం తదితర అంశాలపై సూచనలు, సలహాలు పొందవచ్చునన్నారు. 24 గంటలూ ఈ టోల్ ఫ్రీ నంబర్ 18004253141 రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు సెల్‌ఫోన్ నంబర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాతే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. ఇప్పటివరకూ సుమారుగా 22 వేల నంబర్లు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పీఎల్ఆర్జే ప్రవీణ, శాస్త్రవేత్త ఎం.నందకిషోర్, గుంటూరు జిల్లా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీడియో ల్యాబ్ రీసెర్చి పర్సన్స్ డాక్టర్ ఎం.సహదేవయ్య, డాక్టర్ పి.సాయి, కాకినాడ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పి.పద్మజ, పిఠాపురం ఏడీఏ పద్మశ్రీ, ఏఓ జోగిరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, ఎంపీడీఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రాములోరికి ముత్తంగి సేవ
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారికి సోమవారం భక్తిశ్రద్ధలతో ముత్తంగి సేవ నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది తీర్థ జలాలతో భద్రుని గుడిలో అభిషేకం పూర్తి చేశారు. అంతరాలయంలో మూలవరులకు ముత్యాల వస్త్రాలు ధరింపజేసి..ముత్తంగి సేవ అనంతరం బేడా మండపానికి చేర్చారు. కంకణధారణ గావించి, స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రామయ్యకు ఘనంగా ముత్తంగి సేవ
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి సోమవారం ఘనంగా ముత్తంగి సేవ నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుడిగుడిలో అభిషేకం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో మూలవరులకు ఘనంగా ముత్తంగి సేవ చేశారు. రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి, ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ వారికి, అంజనేయ స్వామి వారికి ముత్యాలతో తయారు చేసిన వస్త్రాలతో ఘనంగా ముత్తంగి సేవ నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవతేధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. అర్చకులు స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు వివరించారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వైభవంగా అర్చకులు స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం గోదావరి అంత్య పుష్కరాలు పురస్కరించుకుని ఆలయ బేడా మండపంలో స్వామి వారి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలు, హరిద్రాచూర్ణాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.