తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజర్ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల నాయకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో స్వెటర్లను పంపిణీ చేశారు.
టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస మానాప్రగడతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని 250 మంది విద్యార్థులకు స్వెటర్లను అందించారు. ఈ సందర్భంగా టీటీఏ నాయకులను టీచర్లు, స్థానిక నాయకులు అభినందించారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ప్రసంగించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
టీటీఏ తరుపున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి, సత్కరించారు. కొసమెరుపు ఏమిటంటే టీటీఏ సంస్థలో అంతర్గత విభేధాల కారణంగా రెండు వర్గాలు ఏర్పాడ్డాయి. టీటీఏ సంస్థలో చోటుచేసుకున్న ఈ విభేదాలు ప్రస్తుతం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కూడా ఎవరివారై నిర్వహించటం విశేషం.
(చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!)
Comments
Please login to add a commentAdd a comment