swetter made
-
డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం 9
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజర్ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల నాయకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్వెటర్లను పంపిణీ చేశారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస మానాప్రగడతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని 250 మంది విద్యార్థులకు స్వెటర్లను అందించారు. ఈ సందర్భంగా టీటీఏ నాయకులను టీచర్లు, స్థానిక నాయకులు అభినందించారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ప్రసంగించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టీటీఏ తరుపున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి, సత్కరించారు. కొసమెరుపు ఏమిటంటే టీటీఏ సంస్థలో అంతర్గత విభేధాల కారణంగా రెండు వర్గాలు ఏర్పాడ్డాయి. టీటీఏ సంస్థలో చోటుచేసుకున్న ఈ విభేదాలు ప్రస్తుతం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కూడా ఎవరివారై నిర్వహించటం విశేషం. (చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!) -
వెచ్చటి అనుబంధం
జిల్లాలో చలి మొదలైంది. ప్రజల గుండెల్లో గుబులు తలెత్తింది. చలి తగ్గే వరకు వెచ్చని అనుబంధం కోసం వెతుకులాట ప్రారంభమైంది. పలువురు స్వెటర్లు, ఉన్నితో తయారు చేసిన దుస్తుల కొనుగోళ్లపై మక్కువ చూపుతున్నారు. ఫుట్‌పాత్ బిజినెస్ జోరుగా సాగుతోంది. నెల్లూరు(బారకాసు): చలి అధికంగా ఉండడంతో ఉన్ని దుస్తులకు గిరాకీ ఏర్పడింది. వీటిని ఒడిశా, నేపాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల విక్రయదారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాటు చేసుకున్న దుకాణాల్లో విక్రస్తున్నారు. వీటిలో స్వెట్టర్లు, టోపీలు, శాలువాలు, మఫ్లర్లు, దుప్పట్లు లభిస్తున్నాయి. ఇవి అందంగా.. మన్నికగా.. తక్కువ ధరల్లో ఉండటంతో జనం బాగా∙కొంటున్నారు.నెల్లూరు నగరం సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం మరీ చల్లగా మారింది. రోజురోజుకి చలి పెరుగుతోంది. సాయంత్రం ఆరు గంటలకే మంచు కురవడం ప్రారంభమవుతోంది. రాత్రి తొమ్మిది గంటలు దాటితే మంచు పెరగడంతో విపరీతమైన చలితో వణికిపోయే పరిస్థితి. దీంతో నగర ప్రజలతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే వారందరిని చలి భయపెడుతోంది. దీని నుంచి రక్షణ పొందేందకు ముఖ్యంగా తెల్లవారుజామున పనిచేసే పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, పేపర్ బాయ్స్ తదితరులు ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. నెల్లూరు: ఏసీ స్టేడియం ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్నిదుస్తులు విక్రయిస్తున్న వ్యాపారులు రోడ్ల పక్కనే దుకాణాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు నగరంలోని జీటీరోడ్డు, పొదలకూరురోడ్డు, మినీబైపాస్‌రోడ్డు తదితర ప్రధాన రహదారుల పక్కనే దుకాణాలు ఏర్పాటు చేశారు. పలు రకాల డిజైన్లలో స్వెట్టర్లు, టోపీలు, శాలువాలు, మంకీ క్యాప్‌లు విక్రయిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ సైజుల్లో పలు డిజైన్లలో లభిస్తున్నాయి. మహిళలకు ప్రత్యేక స్వెట్టర్లు కూడా ఉన్నాయి. స్వెటర్లు పెద్దలకు రూ.200 నుంచి రూ.800, చిన్నపిల్లలకు రూ.150నుంచి రూ.300 వరకు ఉన్నాయి. అదేవిధంగా చలికి, వర్షానికి వేసుకునేదుస్తులు రూ.600 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. తయారయ్యే ప్రాంతాలు ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నేపాల్ వాసులకు నెల్లూరుతో 20 ఏళ్లుగా అనుబంధం ఉంది. చలికాలం మొదలవుతుందంటే ఆయా ప్రాంత వాసులు నెల్లూరు వచ్చేస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి ఉన్ని దుస్తులను తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వ్యాపారం సాగిస్తుంటారు. వ్యాపారం చేసుకుని వెళ్లిపోతాం చలికాలం ప్రారంభమయ్యే సమయంలో నెల్లూరు కు వచ్చి మూడునెలలపాటు ఇక్కడే ఉంటాం. తెచ్చిన ఉన్ని దుస్తులు అమ్ముకుని అనంతరం మా సొంత ఊరికి వెళ్లిపోతాం. దుస్తులు నాణ్యంగా ఉండటం వలనే జనం మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ధరలు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నెల్లూరు ప్రజలు చాలా సౌమ్యులు. అందుకే ఈ ఊరుంటే మాకు ఇష్టం.– ప్రహ్లాద్, మధ్యప్రదేశ్ బృందాలుగా వ్యాపారం చేస్తుంటాం మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. మేము చాలామంది బృందాలుగా ఏర్పడి కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తాం. మాకు తెలుగు రాకపోయినా ఇక్కడి ప్రజల మమ్మల్ని ఆదరిస్తూ సహకరిస్తున్నారు.– ఉదయ్రాం, మధ్యప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటాం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తుంటాం. వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని కుటుంబ పోషణకు పంపిస్తుంటాం. పెద్ద దుకాణాల్లో కంటే చౌకగా విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తున్నాం.– పరశురాం, మధ్యప్రదేశ్ -
హీరో స్వెటర్.. బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: ఆలస్యంగా వచ్చిన చలిపులి సిటీజనుల్నివణికిస్తోంది. శీతల గాలులు మేనిని తాకడంతో వెచ్చదనం ఇచ్చే దుస్తుల కోసం పరుగులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. చలినితట్టుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నోవైవిధ్యభరితమైన నూలు దుస్తులు లభ్యమవుతున్నాయి. స్వెటర్లతో పాటు టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజ్‌లు తదితర వస్త్రాలు కొలువుదీరాయి. ఇదంతా మామూలు విషయమే.. కానీ ప్రస్తుతం స్వెటర్ ధరించే యువతలో మార్పు కనిపిస్తోంది. సినీ హీరో, హీరోయిన్లు ధరించిన స్వెటర్ మోడళ్లపై మోజు పెంచుకొంటున్నారు. అలాంటి బ్రాండ్లేకావాలని దుకాణా యజమానులనుఅడుగుతుండటం యువత నయా అభిరుచికి అద్దం పడుతోంది. చలిని తట్టుకోవడంతో పాటు హుందాగా కనిపించేందుకు విభిన్న రకాల స్టైల్స్‌లో స్వెటర్లు లభ్యమవుతున్నాయని మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు మహ్మద్ ఇల్యాస్ బుఖారీ తెలిపారు. దిలీప్‌కుమార్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి తదితర సినీ హీరోలు పలు సినిమాల్లో ధరించిన స్టైలిష్ స్వెటర్లపై ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా మక్కువ చూపేవారు. వాస్తవానికి స్వెటర్ల వాడకం సినీ నటుల అనుసరణ నుంచే ప్రారంభంమైందని చెప్పవచ్చు. ప్రస్తుత సినీ హీరోలు రాంచరణ్ తేజ్, నానీ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, దేవరకొండ విజయ్, సుమంత్‌లు ధరించిన స్టైలిష్ స్వెటర్లు సైతం తమ పాపులో అందుబాటులో ఉన్నాయని ఇల్యాస్ బుఖారీ పేర్కొన్నారు. కొందరు యువతీ యువకులు ఫలానా హీరో, హీరోయిన్ ఫలానా సినిమాల్లో ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వండని ఆర్డర్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో స్వెటర్లు కేవలం చలి నుంచి తట్టుకోవడానికి ధరించే వారు. ప్రస్తుతం చలి నుంచి తట్టుకొవడంతో పాటు స్టైలిష్‌గా కనిపించేందుకు ధరిస్తున్నారని అన్నారు. యువత అభిరుచికి అనుగుణంగా విదేశాల నుంచి స్వెటర్లను దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. స్టైలిష్ వింటర్ వేర్‌కు డిమాండ్ గతంలో నూలుతో తయారైన మందమైన స్వెటర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టవాడేవారు. ప్రస్తుతం తేలికపాటి, క్యాష్ మిలన్ దారంతో తయారైన వింటర్ వేర్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తేలికగా ఉండి చలిని తట్టుకునే స్వెటర్లు, హ్యాండ్ గ్లౌజ్‌తో పాటు సాక్స్‌లను ఎక్కువగా వాడుతున్నారు. యువతరం హీరో, హీరోయిన్లు ధరించిన స్టైలిష్ వింటర్ వేర్ మోడళ్లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, క్యాప్ మార్ట్ నిర్వాహకుడు -
స్వెట్టర్ కాదు.. ‘జుట్ట’ర్
భర్త కోసం స్వెట్టర్లు అల్లేవారెందరో.. కానీ చైనాలోని చాంగ్‌క్వింగ్‌కు చెందిన జియాంగ్ రెంక్సియాన్(60) అనే రిటైర్డ్ ఉపాధ్యాయిని మాత్రం భర్త కోసం తన శిరోజాలతో స్వెట్టర్‌ను అల్లింది! దానికి మ్యాచింగ్ టోపీ కూడా తయారుచేసింది. అదీ 11 ఏళ్లు కష్టపడి.. జియాంగ్‌కు 34 ఏళ్ల వయసప్పుడు ఈ ఆలోచన వచ్చిందట. ‘కాలేజీ రోజుల్లో అందరూ నా శిరోజాల గురించే మాట్లాడుకునేవారు. అయితే వయసు పెరిగే కొద్దీ.. నా ముఖంతోపాటు శిరోజాల కాంతి కూడా తగ్గడం మొదలైంది. అవి రాలిపోవడం మొదలుపెట్టాయి. అందుకే వాటితో నా భర్త కోసం ఏదైనా చేయాలని ఆలోచించాను. రోజు దువ్వుకున్న అనంతరం దానికి చిక్కుకునే శిరోజాలను దాచి ఉంచడం మొదలుపెట్టాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. అలా మొత్తం 1,16,058 శిరోజాలతో భర్తకు స్వెట్టర్ , క్యాప్ అల్లింది. 2003 మొదట్లో మొదలుపెట్టిన ఆ పని ఈ మధ్యే పూర్తయింది. స్వెట్టర్ బరువు 382.3 గ్రాములుండగా.. క్యాప్ బరువు 119.5 గ్రాములుంది. రేపొద్దున్న తన శిరోజాలు పూర్తిగా పాడైపోయినా.. ఈ స్వెట్టర్ తన యవ్వనాన్ని, భర్తతో తాను గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెస్తునే ఉంటుందని జియాంగ్ అంటోంది.