హీరో స్వెటర్‌.. బెటర్‌! | Different Fashion Collection in Winter Season | Sakshi
Sakshi News home page

హీరో స్వెటర్‌.. బెటర్‌!

Published Fri, Dec 14 2018 9:14 AM | Last Updated on Wed, Dec 19 2018 11:08 AM

Different Fashion Collection in Winter Season - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆలస్యంగా వచ్చిన చలిపులి సిటీజనుల్నివణికిస్తోంది. శీతల గాలులు మేనిని తాకడంతో వెచ్చదనం ఇచ్చే దుస్తుల కోసం పరుగులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. చలినితట్టుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నోవైవిధ్యభరితమైన నూలు దుస్తులు లభ్యమవుతున్నాయి. స్వెటర్లతో పాటు టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజ్‌లు తదితర వస్త్రాలు కొలువుదీరాయి. ఇదంతా మామూలు విషయమే.. కానీ ప్రస్తుతం స్వెటర్‌ ధరించే యువతలో మార్పు కనిపిస్తోంది. సినీ హీరో, హీరోయిన్లు ధరించిన స్వెటర్‌ మోడళ్లపై మోజు పెంచుకొంటున్నారు. అలాంటి బ్రాండ్‌లేకావాలని దుకాణా యజమానులనుఅడుగుతుండటం యువత నయా అభిరుచికి అద్దం పడుతోంది. 

చలిని తట్టుకోవడంతో పాటు హుందాగా కనిపించేందుకు విభిన్న రకాల స్టైల్స్‌లో స్వెటర్లు లభ్యమవుతున్నాయని మదీనా సర్కిల్‌లోని మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ నిర్వాహకుడు మహ్మద్‌ ఇల్యాస్‌ బుఖారీ తెలిపారు. దిలీప్‌కుమార్, ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి తదితర సినీ హీరోలు పలు సినిమాల్లో ధరించిన స్టైలిష్‌ స్వెటర్లపై ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా మక్కువ చూపేవారు. వాస్తవానికి స్వెటర్ల వాడకం సినీ నటుల అనుసరణ నుంచే ప్రారంభంమైందని చెప్పవచ్చు. ప్రస్తుత సినీ హీరోలు రాంచరణ్‌ తేజ్, నానీ, ప్రభాస్, జూనియర్‌ ఎన్టీఆర్, దేవరకొండ విజయ్, సుమంత్‌లు ధరించిన స్టైలిష్‌ స్వెటర్లు సైతం తమ పాపులో అందుబాటులో ఉన్నాయని ఇల్యాస్‌ బుఖారీ పేర్కొన్నారు. కొందరు  యువతీ యువకులు ఫలానా హీరో, హీరోయిన్‌ ఫలానా సినిమాల్లో ధరించిన స్వెటర్‌  తయారు చేసి ఇవ్వండని ఆర్డర్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో స్వెటర్లు కేవలం చలి నుంచి తట్టుకోవడానికి ధరించే వారు. ప్రస్తుతం చలి నుంచి తట్టుకొవడంతో పాటు స్టైలిష్‌గా కనిపించేందుకు ధరిస్తున్నారని అన్నారు. యువత అభిరుచికి అనుగుణంగా విదేశాల నుంచి స్వెటర్లను దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.  

స్టైలిష్‌ వింటర్‌ వేర్‌కు డిమాండ్‌
గతంలో నూలుతో తయారైన మందమైన స్వెటర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టవాడేవారు. ప్రస్తుతం తేలికపాటి, క్యాష్‌ మిలన్‌ దారంతో తయారైన వింటర్‌ వేర్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. తేలికగా ఉండి చలిని తట్టుకునే స్వెటర్లు, హ్యాండ్‌ గ్లౌజ్‌తో పాటు సాక్స్‌లను ఎక్కువగా వాడుతున్నారు. యువతరం హీరో, హీరోయిన్‌లు ధరించిన స్టైలిష్‌ వింటర్‌ వేర్‌ మోడళ్లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.  
    – మహ్మద్‌ ఇల్యాస్‌ బుఖారీ, క్యాప్‌ మార్ట్‌ నిర్వాహకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement