
Winter Fashion: డ్రెస్సింగ్ స్టయిల్‌గా ఉండాలి... పార్టీలో గ్రాండ్‌గా కనిపించాలి... అదే సమయంలో కాలానికి తగినట్టు ఉండాలి. ఈ సీజన్ మోసుకొచ్చే చలితో పాటు ఈవెనింగ్ పార్టీలకు కూడా ఆహ్వానం పలుకుతుంది. సందర్భానికి తగినవిధంగా కుర్తా, పలాజో, లాంగ్ గౌన్, శారీ.. ధరించే డ్రెస్ ఏదైనా వాటి మీదకు లాంగ్ ష్రగ్ ఒకటి ధరిస్తే చాలు చలిని తట్టుకుంటూ పార్టీలను ఎంజాయ్ చేయచ్చు.
గ్రాండ్‌గానూ, ఫ్యాషనబుల్‌గానూ ఆకట్టుకోవచ్చు. కుర్తా, పైజామా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ ష్రగ్ లేదా ఓవర్‌కోట్ నైట్ పార్టీలలో మరింత సౌకర్యంగా ఉంటుంది.
రిసెప్షన్, బర్త్‌డే పార్టీలు సాధారణంగా ఈవెనింగ్ సమయాల్లోనే జరుగుతుంటాయి. ఈ పార్టీలో స్టయిల్‌గా కనిపించాలంటే జార్జెట్ పలాజో, టాప్‌విత్ లాంగ్ ష్రగ్ ఒకే కలర్ ఉన్నవి ధరిస్తే చాలు. ఇన్‌బిల్ట్ ష్రగ్ పలాజో రెడీమేడ్ డ్రెస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాలానుగుణంగా వెలిగిపోవచ్చు.
చీర మీదకు డిజైనర్ ష్రగ్ లేదా లాంగ్ కోట్ ధరిస్తే చాలు పార్టీలో ఎక్కడున్నా స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకోవచ్చు.
ప్లెయిన్ లాంగ్ గౌన్ మీదకు కాంట్రాస్ట్ బెనారస్ లాంగ్ ష్రగ్ లేదా జాకెట్ ధరిస్తే చాలు పెళ్లి వేడుక కూడా గ్రాండ్‌గా మారి పోతుంది.
క్యాజువల్, గెట్ టు గెదర్ పార్టీలకు హాజరవ్వాలంటే జీన్స్ ట్యునిక్ మీదకు ఇలా ఒక మందపాటి లాంగ్ ష్రగ్ వేసుకుంటే చాలు. వణికించే చలిలోనూ కులాసాగా ఫ్యాషనబుల్ మార్కులు కొట్టేయచ్చు.
చదవండి: Christmas 2021: ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్, క్యాండీబాల్స్‌తో అందంగా..
Comments
Please login to add a commentAdd a comment