రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నూతన ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించారు. అందులో భాగంగా సుమారు 50 వేల మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స, 50 వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ కేన్సర్‌లకు ఉచిత స్క్రీనింగ్ పరీకలు, చికిత్స, అలాగే దాదాపు పదివేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వంటి సేవలను అందజేయనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.
ప్రతి భారతీయుడికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలా సరసమైన ధరలో తమ రిలయన్స్ ఫౌండేషన్ వైద్యసేవలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా మిలియన్లమందికి జీవితాలను ప్రసాదించి లెక్కలేనన్ని కుటుంబాల్లో కొత్త ఆశను అందించామని అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక సేవలందింస్తోన్న తమ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు మరిన్ని సేవలందించేలా ఇలా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంబించామని అన్నారు.
మంచి ఆరోగ్యం సంపన్న దేశానికి పునాది అని, అలాగే ఆరోగ్యవంతమైన స్త్రీలు, పిల్లలు సమాజానికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. కాగా, రిలయన్స్ పౌండేష్ గత దశాబ్ద కాలంలో 1.5 లక్షల మంది పిల్లలతో సహా 2.75 మిలియన్ల భారతీయులకు వైద్య సేవలను అందించింది.
అత్యాధునిక వైద్యం అందించడంలో అత్యుత్తమైన ఆస్పత్రిగా నిలిచింది. అంతేగాదు ఐదు వందలకు పైగా అవయవ మార్పిడి తోపాటు కేవలం 24 గంటల్లో ఏకంగా ఆరు అవయవాల మార్పిడి చేసి బహుళ ప్రాణాలను కాపాడిని ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. ఇది భారతధేశంలోనే నెంబర్ వన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుర్తింపు పొందింది.
(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!)
Comments
Please login to add a commentAdd a comment