ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బిహార్‌లోని పాట్నాలో పర్యటించారు.ఆ నేపథ్యంలో అక్కడ గురుద్వారాను సందర్శించారు. అక్కడ సిక్కులు ఎక్కుగా మట్లాడుకునే లంగర్ సేవాలో పాలు పంచుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఆయనే స్వహస్తాలతో తయారు చేసిన భోజనాన్ని అక్కడ కమ్యూనిటీలకు వడ్డించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏంటీ లంగర్ సేవా? ఏం చేస్తారంటే..
ఇక్కడ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాలో సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా లంగర్ సేవా అనే సమాజ సేవాలో పాల్గొన్నారు మోదీ. అక్కడ మోదీ సిక్కు మాదిరిగా నారింజరంగు తలపాగా ధరించి చక్కగా గరిటి తిప్పతూ వంటలు చేశారు. ఇక్కడ లంగర్ అంటే.. గురుద్వారాకి సంబంధించిన సాముహిక వంటగది. ఇక్కడ మనుషుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఎలాంటి రుసుము తీసుకోకుండా బోజనం అందిస్తారు.
ఇక్కడ గురుద్వారాను సందర్శించినప్పుడు సందర్శకులుకు సాంప్రదాయకంగా తీపి ప్రసాదంతో స్వాగతం పలుకుతారు. ఇది గురువు కృపకు ప్రతీక. సేవల సమయంలో హజరైన వారికి పూర్తి లంగర్‌తో కూడని భోజనంతో స్వాగతం పలుకుతారు. ఇది మతపరమైన భాగస్వామ్యం, ఆతిథ్య స్ఫూర్తిని సూచిస్తుంది. ఇక్కడ భోజనాలు చేసేవారంతా నేలపైనే కలిసి కూర్చొని.. సమానత్వాన్ని చాటుకుంటారు.
ఈ వంటగదిని సిక్కు వాలంటీర్లు నిర్వహిస్తారు. వారంతా సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తారు. ఈ సంప్రదాయం సిక్కు మతంలోని సమానత్వం కలుపుగోలుతనం, నిస్వార్థ సేవలకు నిదర్శనంగా కనిపిస్తుంది. గురుపురబ్, బైసాఖి వంటి పండుగ సందర్భాల్లో కుటుంబాలు గురుద్వార వద్ద సమావేశమవుతాయి. ఇక్కడి వాతావరణం మతపరమైన స్ఫూర్తితో నిండి ఉంటుంది. ఈ సాముహిక అన్నసమారాధనలో అన్ని రకాల వయసుల వ్యక్తులు చురుకుగా పాల్గొంటారు. కాగా, ఈ పాట్నాలోని గురుద్వారా గురు గోవింద్ సింగ్ జన్మస్థలాన్ని జరుపుకోవడానికి నిర్మించిన సిక్కుల పవిత్రమైన ఐదు తఖత్‌లలో(దేవాలయాల్లో) ఒకటిగా చెబుతారు.
(చదవండి: ఆ డ్రగ్‌తో ఎదుటివాళ్ల మైండ్‌ని మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చట!)
Comments
Please login to add a commentAdd a comment