రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో | PM Narendra Modi Serves Food In Langar | Sakshi
Sakshi News home page

రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో

Published Mon, May 13 2024 12:49 PM | Last Updated on Mon, May 13 2024 12:57 PM

PM Narendra Modi Serves Food In Langar

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సిక్కు మందిరం గురుద్వార్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా లంగర్‌లో భక్తులకు భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో మోదీ ఒక స్టీల్ బకెట్ తీసుకుని, అందులోని ఆహారాన్ని అక్కడి ప్రజలకు వడ్డించడం చూడవచ్చు. అంతే కాకుండా మోదీ స్వయంగా రోటీ తయారు చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆదివారం బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు. బీహార్‌లో రోడ్‌షో నిర్వహించిన తొలి ప్రధాని మోదీ. సోమవారం ప్రధానమంత్రి రాష్ట్రంలోని హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం దేశ ప్రజలను అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం'' అని మోదీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement