
చండీగఢ్ : పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోథిలో బెర్ సాహిబ్ గురుద్వారలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం సందర్భంగా ప్రధాని గురుద్వారను సందర్శించారు. గురుదాస్‌పూర్‌లో డేరాబాబా నానక్ వద్ద కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.పాకిస్తాన్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం‘జాతా’కు జెండా ఊపుతారు.
Comments
Please login to add a commentAdd a comment