Telangana America telugu association
-
డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం 9
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజర్ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవాడేస్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల నాయకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్వెటర్లను పంపిణీ చేశారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస మానాప్రగడతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని 250 మంది విద్యార్థులకు స్వెటర్లను అందించారు. ఈ సందర్భంగా టీటీఏ నాయకులను టీచర్లు, స్థానిక నాయకులు అభినందించారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ప్రసంగించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టీటీఏ తరుపున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి, సత్కరించారు. కొసమెరుపు ఏమిటంటే టీటీఏ సంస్థలో అంతర్గత విభేధాల కారణంగా రెండు వర్గాలు ఏర్పాడ్డాయి. టీటీఏ సంస్థలో చోటుచేసుకున్న ఈ విభేదాలు ప్రస్తుతం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు కూడా ఎవరివారై నిర్వహించటం విశేషం. (చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!) -
యాదాద్రిలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీటీఏ టీమ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన టీటీఏ టీమ్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వలిగొండలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. టిటిఎ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థుల కోసం మల్లారెడ్డి కంప్యూటర్, ఫర్నిచర్ వంటివి అందించడంపై ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ధన్యవాదాలు తెలిపారు . అనంతరం మల్లారెడ్డి స్వస్థలం సుంకిశాలకు చేరుకోని అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుంకిశాల గ్రామంలో మల్లారెడ్డి స్కూల్, కాలేజ్, దేవాలయాలు నిర్మించి చాలా అభివృద్థి చేశారని గ్రామస్థులు కొనియాడారు. మల్లారెడ్డి చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను వారు ప్రశంసించారు. -
న్యూజెర్సీలో ఘనంగా టాటా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూజెర్సీ: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డా. పైళ్ల మల్లారెడ్డి, డా. మోహన్ పటోళ్ల, విక్రం జనగంల ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికిపైగా పాల్గొన్నారు. ఈ వేడుకలు అమెరికా, భారత జాతీయ గీతాలతో ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నేటి మహిళ డ్యాన్స్ కార్యక్రమం, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై జవాన్లుగా చిన్నారులు ప్రదర్శించిన స్కిట్ అందరిని ఆకట్టుకున్నాయి. దివ్య చంద్రిక రాయిల్లవీణ వాయిద్యం, మహిళల ఫ్యాషన్ షో కార్యక్రమాలు హైలెట్‌గా నిలిచాయి. డా. మీనా మూర్తి, టాటా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గనగోని, డా మోహన్ పటోళ్ల, గంగాధర్ ఉప్పాల, విక్రం జనగంలు చర్చించి కమ్యూనిటీ వైద్య సేవల కోసం సెయింట్ పీటర్స్ థైరాయిడ్ అండ్ డయాబెటిస్ సెంటర్‌తో టాటా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. ఈ వేడుకలు శ్రీనివాస్ గనగోని నేతృత్వంలో శివా రెడ్డి కొల్ల, కిరణ్ దుడ్డగి, దీప్తి మిర్యాల, నవ్యారెడ్డి, శ్రీకాంత్ అక్కపల్లి, గంగాధర్ ఉప్పాల, రామ్ మోహన్, మహేందర్ నరాల, నవీన్ కుమార్ యల్లమండ్ల, నరేందర్ యరవ, గోపి వుట్కూరి, విజయ్ భాస్కర్, సతీశ్ జిల్లెల, వేణు సుంకరిల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టాటా కార్యనిర్వాహక సభ్యులు రంజిత్ క్యాతం, సహోదర్ రెడ్డి, పవన్ రవ్వ, మల్లిక్ రెడ్డి, మధవి సొలేటి, రామ వనమ, సురేశ్ వెంకన్నగారి, ప్రసాద్ కన్నారపు, సుదర్శన్ చేతుకురిలు పాల్గొన్నారు. -
డాలస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు!
డాలస్ : తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇర్వింగ్‌లో ఉన్న కూచిపూడి ఇండియన్ కిచెన్‌లో జరిగిన ఈ వేడుకలకు రెండువందలకు పైగా మహిళలు హాజరయ్యారు. ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక సోదరిగా ఉద్యోగ రంగంలో మహిళ తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది అని పలువురు కొనియాడారు. డాలస్ శాఖ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సునీత త్రిపురం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది. ఉమెన్స్ కమిటీ నేషనల్ కో-ఛైర్ రూప కన్నయ్య, టాటా సంయుక్త కార్యదర్శి నీలోహిత కొత్తా, కల్చరల్ కమిటీ నేషనల్ ఛైర్ సమీరా ఇల్లెందుల, డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్లు శాంతి నూతి, దీప్తి సూర్యదేవార, ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ లేక్ మేయర్ లారా హిల్ పాల్గొన్నారు. సభని ఉద్యేశించి మాట్లాడుతూ భారతీయ స్త్రీ అంటే తనకి ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో వీణా యలమంచిలి తన గాత్రంతో అలరించారు. టాటా ప్రెసిడెంట్ విక్రం జంగం మాట్లాడుతూ పూర్తి కుటుంబాన్ని తన భుజాలపై మోస్తున్న స్త్రీ మూర్తికి ఎల్లవేళలా అందరూ కృతజ్ఞత తెలపాలని కోరారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. సెల్ఫీ కాంటెస్ట్, ఫ్యాషన్ షో అని వినూత్నమైన కార్యక్రమాలతో నిర్వాహుకులు అందరిని ఆకట్టుకున్నారు. టాటా బోర్డు సభ్యులు మహేష్ ఆదిభట్ల, చంద్ర రెడ్డి పోలీస్‌లతో పాటు పవన్ గంగాధరా, శ్రీధర్ కుంభాల, శ్రీనివాస్ తుల, నిరంజన్ బూడిద, శ్రీకాంత్ రౌతు, సురేష్ పతనేని, రత్న ఉప్పాల, భవాని జొన్నలగడ్డ పాల్గొని తన సహాయసహకారాలు అందించారు. -
మిషన్ కాకతీయకు ‘టాటా’ 40 లక్షల విరాళం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా) రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.40లక్షల విరాళాన్ని అందజేసింది. ‘టాటా’ ఈ నెల 5న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లోని రాయల్ అలర్ట్ ప్యాలెస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటన వెలువరించారు. ‘టాటా’ ఆవిర్భావ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నిజామాబాద్ ఎంపీ కె.కవిత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు హాజరయ్యారు. సుమారు 3వేల మంది ప్రవాస తెలంగాణవాసులు కూడా హాజరయ్యారని నిర్వాహకులు పేర్కొన్నారు. వరంగల్‌లోని సుధాకర్ విద్యాలయానికి కూడా ‘టాటా’ రూ.10 లక్షలు విరాళం అందజేసినట్లు తెలిపారు.