న్యూజెర్సీ: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డా. పైళ్ల మల్లారెడ్డి, డా. మోహన్ పటోళ్ల, విక్రం జనగంల ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికిపైగా పాల్గొన్నారు. ఈ వేడుకలు అమెరికా, భారత జాతీయ గీతాలతో ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నేటి మహిళ డ్యాన్స్ కార్యక్రమం, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై జవాన్లుగా చిన్నారులు ప్రదర్శించిన స్కిట్ అందరిని ఆకట్టుకున్నాయి. దివ్య చంద్రిక రాయిల్లవీణ వాయిద్యం, మహిళల ఫ్యాషన్ షో కార్యక్రమాలు హైలెట్‌గా నిలిచాయి. డా. మీనా మూర్తి, టాటా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గనగోని, డా మోహన్ పటోళ్ల, గంగాధర్ ఉప్పాల, విక్రం జనగంలు చర్చించి కమ్యూనిటీ వైద్య సేవల కోసం సెయింట్ పీటర్స్ థైరాయిడ్ అండ్ డయాబెటిస్ సెంటర్‌తో టాటా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ప్రకటించారు.
ఈ వేడుకలు శ్రీనివాస్ గనగోని నేతృత్వంలో శివా రెడ్డి కొల్ల, కిరణ్ దుడ్డగి, దీప్తి మిర్యాల, నవ్యారెడ్డి, శ్రీకాంత్ అక్కపల్లి, గంగాధర్ ఉప్పాల, రామ్ మోహన్, మహేందర్ నరాల, నవీన్ కుమార్ యల్లమండ్ల, నరేందర్ యరవ, గోపి వుట్కూరి, విజయ్ భాస్కర్, సతీశ్ జిల్లెల, వేణు సుంకరిల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టాటా కార్యనిర్వాహక సభ్యులు రంజిత్ క్యాతం, సహోదర్ రెడ్డి, పవన్ రవ్వ, మల్లిక్ రెడ్డి, మధవి సొలేటి, రామ వనమ, సురేశ్ వెంకన్నగారి, ప్రసాద్ కన్నారపు, సుదర్శన్ చేతుకురిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment