న్యూ జెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ | NATS Cricket Tournament Conducted Successfully In New Jersey | Sakshi
Sakshi News home page

న్యూ జెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్

Published Sun, Oct 13 2024 5:14 PM | Last Updated on Sun, Oct 13 2024 5:14 PM

NATS Cricket Tournament Conducted Successfully In New Jersey

న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూ జెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూ జెర్సీలో దాదాపు 200 మంది తెలుగు క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఈ టోర్నీలో ఎడిసన్ కింగ్స్ విజేతగా నిలిచింది. రామ్ కోట ఎడిసన్ కింగ్స్‌ కెప్టెన్‌గా టీంను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఎఫ్ 5 జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టీంకు కెప్టెన్‌గా తులసి తోట వ్యవహరించారు.

ఈ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గత వారం రోజులుగా  విశేష కృషి చేశారు. నాట్స్ న్యూ జెర్సీ విభాగం క్రీడా సమన్వయకర్త రమేశ్ నెల్లూరి చేసిన కృషి మరువలేనిదని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. తెలుగువారిని కలిపే ఏ కార్యక్రమంలోనైనా నాట్స్ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. 

ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రికెటర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాట్స్ నాయకులు సురేంద్ర పోలేపల్లి, ప్రశాంత్ కుచ్చు, వెంకటేష్ కోడూరి, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకి, క్రాంతి యడ్లపూడి, హరీష్ కొమ్మాలపాటి, రాకేష్ వేలూరి, ధర్మేంద్ర ముమ్మిడి తదితరులు ఈ టోర్నీ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకులు గంగాధర దేసు, బిందు యలమంచిలి, టిపి రావు, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ భీమినేని, శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీనివాస్ కొల్లా, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, రాజేష్ బేతపూడి, శ్రీధర్ దోనేపూడి, హరీష్ కొమ్మాలపాటి, బినీత్ పెరుమాళ్ల తదితరులు విచ్చేసి క్రికెటర్ల క్రీడా స్ఫూర్తిని అభినందించారు. 

నాట్స్ బోర్డు డైరెక్టర్స్ టీపీ రావు, బిందు యలమంచిలి, మాజీ అధ్యక్షుడు గంగాదర్ దేసు, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని నాట్స్ చేస్తున్న భాష, సేవా కార్యక్రమాలు, మెంబెర్షిప్ డ్రైవ్ గురించి అందరికీ తెలియజేశారు. న్యూజెర్సీ నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement