న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కివీస్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20లు ఆడిన అండర్సన్ ఆఖరిసారిగా 2018లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
2014లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో)తో వెలుగులోకి వచ్చిన అతను ఆ తర్వాత 2015లో వరల్డ్ కప్ ఫైనల్ చేరిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. కెనడాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన అమెరికా టీమ్‌లో అండర్సన్‌కు చోటు దక్కింది.
అయితే ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లి అక్కడి మైనర్ లీగ్‌లో భారీగా పరుగులు సాధించినా...భారత అండర్–19 విజేత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. మరో వైపు భారత దేశవాళీ క్రికెట్‌లో రాణించిన హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్‌లు కూడా టీమ్‌లో అవకాశం దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment