Corey Anderson
-
ముంబై ఇండియన్స్‌కు మరో పరాభవం..ప్లే ఆఫ్స్‌కు యూనికార్న్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొంది, ఫైనల్ ఫోర్కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. యూనికార్న్స్‌కు ముందు వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. యూనికార్న్స్ చేతిలో ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ ఎడిషన్‌లో ఎంఐ టీమ్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్... కెప్టెన్ కోరె ఆండర్సన్ (59 నాటౌట్), హస్సన్ ఖాన్ (44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆండర్సన్, హసన్ ఖాన్‌తో పాటు కమిన్స్ (13), రూథర్‌ఫోర్డ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎంఐ బౌలర్లలో నోష్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్ తలో 2, రొమారియో షెపర్డ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.149 పరుగల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 20 పరుగులు అవసరం కాగా.. హీత్ రిచర్డ్స్, రషీద్ ఖాన్ జోడీ 16 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆఖరి బంతికి బౌండరీ అవసరం కాగా.. హరీస్ రౌఫ్ హీత్ రిచర్డ్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఎంఐకు పరాజయం తప్పలేదు. యూనికార్న్స్ బౌలర్లలో మాథ్యూ షార్ట్ 3, బ్రాడీ కౌచ్ 2, హరీస్ రౌఫ్, హస్సన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (56) అర్ద సెంచరీతలో రాణించాడు.కాగా, ఈ ఎడిషన్‌లో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాషింగ్టన్ ఫ్రీడం, యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, ఎంఐ న్యూయార్క్, సీయాటిల్ ఓర్కాస్ పోటీపడుతున్నాయి. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్.. 6 బంతుల్లో 5 వికెట్లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ హ్యాట్రిక్ వికెట్లతో (2.5-0-10-4) చెలరేగాడు. యూఎస్ఏ చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో (W, W, 0,W, W, W) కోల్పోయింది. జోర్డన్ ఒకే ఓవర్లో 4 వికెట్లు తీశాడు, జోర్డన్ తీసిన హ్యాట్రిక్ ఇవాళ రెండవది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఆఫ్ఘనిస్తాన్పై హ్యాట్రిక్ సాధించాడు. ఇది అతనికి వరుసగా రెండో మ్యాచ్‌లో రెండో హ్యాట్రిక్. యూఎస్ఏతో మ్యాచ్‌లో జోర్డన్‌తో పాటు ఆదిల్ రషీద్ (4-0-13-2), సామ్ కర్రన్ (2-0-23-2), రీస్ టాప్లే (3-0-29-1) సత్తా చాటారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కోరె ఆండర్సన్ (29), హర్మీత్ సింగ్ (21), స్టీవ్ టేలర్ (12), ఆరోన్ జోన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. -
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో రెండు దేశాలకు ఆడిన క్రికెటర్లు వీరే..!
క్రీడ ఏదైనా జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించడమనేది ప్రతి ఆటగాడి కల. ఈ అవకాశం కోసం కొందరు ఆటగాళ్లు జీవితకాలం ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఓ ఆటగాడు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించడమనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి.క్రికెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 52 మంది ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. వన్డే ఫార్మాట్లో 16 మంది, టెస్ట్‌ల్లో 17 మంది, టీ20 ఫార్మాట్లో 19 మంది ఇప్పటివరకు రెండు వేర్వేరు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకు ఎంత మంది రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించారు.మొదటిగా రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్.. 2009లో సౌతాఫ్రికా తరఫున పొట్టి ప్రపంచకప్ ఆడిన వాన్ డర్ మెర్వ్.. 2022, 2024 ప్రపంచకప్ టోర్నీల్లో నెదర్లాండ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.రెండో ఆటగాడు డిర్క్ నానెస్.. 2009 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఆడిన నానెస్.. 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు.మూడవ ఆటగాడు మార్క్ చాప్మన్.. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాప్మన్ 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో పుట్టిన దేశానికి ప్రాతినిథ్యం వహించి.. 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.నాలుగో ఆటగాడు డేవిడ్ వీస్.. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ఆడిన వీస్.. 2021, 2022, 2024 వరల్డ్‌కప్ ఎడిషన్లలో నమీబియాకు ప్రాతినిథ్యం వహించాడు.చివరిగా కోరె ఆండర్సన్.. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు ఆడిన ఆండర్సన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
T20 WC: తొలి హాఫ్ సెంచరీ ‘మనోడి’దే!.. కెనడా భారీ స్కోరు
క్రికెట్ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా, కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇదే నిజం. 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగినా... దానికి చాలా ఏళ్ల క్రితమే అంటే 1844లో మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య టి20 వరల్డ్ కప్‌లో పోటీ పడుతున్నాయి. ఇరు జట్లకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డాలస్‌కు ఈ మ్యాచ్ వేదిక. ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్యాడ్లు, బ్యాట్‌తో ‘స్కోర్ ఫోర్’ అని రాసి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బొమ్మ ముద్రించిన టీ షర్ట్‌లను అమ్ముతున్నారు.పీజే గోడ్హాల్స్ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ వేదికపై అమ్మకానికి ఉంచాడు. 1849లో చికాగో, మిల్వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు లింకన్ అతిథిగా హాజరయ్యారు. కెనడా భారీ స్కోరుటీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ తొలి మ్యాచ్‌లో భాగంగా యూఎస్ఏతో తలపడుతున్న కెనడా భారీ స్కోరు సాధించింది. డలాస్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కెనడా బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో ఆరోన్ జాన్సన్(16 బంతుల్లో 23) రాణించగా.. నవనీత్ ధాలివాల్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)తొలి హాఫ్ సెంచరీతద్వారా టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్ రికార్డు సాధించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ పగ్రాత్ సింగ్(5) నిరాశ పరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్ కిర్టాన్ (31 బంతుల్లో 51) అర్ధ శతకంతో రాణించాడు.ఇక వికెట్ కీపర్ బ్యాటర్ శ్రేయస్ మొవ్వా 32 పరుగులు చేసి దిల్లాన్ హేలిగెర్(1)తో కలిసి నాటౌట్‌గా నిలవగా.. దిల్‌ప్రీత్ సింగ్ 11 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చండీగఢ్‌లో జన్మించిఅక్టోబరు 10, 1988లో పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించాడు నవనీత్ ధాలివాల్. అనంతరం కెనడాకు మకాం మార్చిన 35 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును యూఎస్ఏ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ అండర్సన్‌కు చోటు దక్కింది. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అండర్సన్.. గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ నుంచి ఎన్వోసీ తీసుకుని అమెరికాకు మకాం మార్చాడు. ఇప్పుడు అతడికి ఏకంగా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్ భారత మూలాలు కలిగి ఉన్నారు.ఈ జట్టులో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న డల్లాస్ వేదికగా కెనడాతో తలపడనుంది.అమెరికా వరల్డ్‌కప్ జట్టు..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. -
అమెరికా జట్టులో కోరీ అండర్సన్
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కివీస్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20లు ఆడిన అండర్సన్ ఆఖరిసారిగా 2018లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2014లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో)తో వెలుగులోకి వచ్చిన అతను ఆ తర్వాత 2015లో వరల్డ్ కప్ ఫైనల్ చేరిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. కెనడాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన అమెరికా టీమ్‌లో అండర్సన్‌కు చోటు దక్కింది. అయితే ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లి అక్కడి మైనర్ లీగ్‌లో భారీగా పరుగులు సాధించినా...భారత అండర్–19 విజేత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మాత్రం జట్టులో స్థానం లభించలేదు. మరో వైపు భారత దేశవాళీ క్రికెట్లో రాణించిన హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్లు కూడా టీమ్‌లో అవకాశం దక్కించుకున్నారు. -
సొంత దేశాన్ని వీడి యూఎస్ఏకు ఆడనున్న ఫాస్టెస్ట్ సెంచరీ హీరో
వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ (36 బంతుల్లో) సెంచరీ వీరుడు, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరె ఆండర్సన్ సొంత దేశాన్ని వీడి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూఎస్ఏకు ఆడేందుకు సిద్దమయ్యాడు. త్వరలో కెనడాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏ సెలెక్టర్లు ఆండర్సన్ ఎంపిక చేశారు. 2018 నవంబర్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆండర్సన్.. వ్యక్తిగత కారణాల చేత 2020లో యూఎస్ఏకు షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే దేశవాలీ క్రికెట్ (మైనర్ లీగ్ క్రికెట్) ఆడుతూ ఐదేళ్ల నిరీక్షణ అనంతరం జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. లోకల్ కేటగిరీలో మేజర్ లీగ్ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న ఆండర్సన్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. కెనడా సిరీస్ కోసం ఆండర్సన్‌తో పాటు మరికొందరు నాన్ ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. భారత అండర్-19 ఫేమ్ హర్మీత్ సింగ్ యూఎస్ఏ దేశవాలీ టోర్నీలతో పాటు మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ తరఫున రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్మీత్‌తో పాటు మరో భారత క్రికెటర్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఢిల్లీ మాజీ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ మిలింద్ కుమార్ అక్కడి దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్, భారత మూలాలున్న నితీశ్ కుమార్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. తాజాగా ప్రకటించిన యూఎస్ఏ జట్టులో భారత అండర్-19 మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ బ్యాటర్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఉన్ముక్త్‌కు నితీశ్ కుమార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా సెలెక్టరు నితీశ్పైపే మొగ్గు చూపారు. కెనడా సిరీస్ కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరె అండర్సన్, గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, ఉస్మాన్ రఫిక్ -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించిన ఫించ్.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (కాలిఫోర్నియా నైట్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. న్యూజెర్సీ లెజెండ్స్‌తో నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 75 పరుగులు చేసిన ఫించ్.. ఇవాళ (ఆగస్ట్ 22) మోరిస్విల్లే యూనిటీపై 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 63 పరుగులు చేసి, తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. ఫించ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఫించ్ వరుసగా రెండో మ్యాచ్‌లో అజేయమైన అర్ధశతకం సాధించగా.. జాక్ కలిస్ (9), మిలింద్ కుమార్ (6), సురేశ్ రైనా (6), ఇర్ఫాన్ పఠాన్ (9) విఫలమయ్యారు. మోరిస్విల్లే బౌలర్లలో పియనార్ 3 వికెట్లు పడగొట్టగా.. సావేజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోని ఫించ్ మెరుపులు.. కోరె ఆండర్సన్ ఊచకోత 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే.. మరో 7 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మోరిస్విల్లే బ్యాటర్ కోరె ఆండర్సన్ సుడిగాలి ఇన్నింగ్స్ (5 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందు ఫించ్ మెరుపులు సరిపోలేదు. ఛేదనలో ఆరంభంలో నిదానంగా ఆడిన మోరిస్విల్లే.. ఆఖర్లో ఆండర్సన్‌తో పాటు పియనార్ (12 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), షెహన్ జయసూర్య (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విజయతీరాలకు చేరింది. మోరిస్విల్లే ఇన్నింగ్స్‌లో పార్థివ్ పటేల్్ (9 బంతుల్లో 14; 2 ఫోర్లు), క్రిస్ గేల్ (10 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కాలిఫోర్నియా బౌలర్లు పవన్ సుయాల్, ఆష్లే నర్స్, రికార్డో పావెల్ తలో వికెట్ పడగొట్టారు. -
చెలరేగిన అండర్సన్.. 8 సిక్స్‌లు, 7 ఫోర్లు.. ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తొలి ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఒమెన్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగులు తేడాతో విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ విజయంలో కేవిన్ పీటర్సన్, కోరీ ఆండర్సన్ కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా వరల్డ్ జెయింట్స్ బ్యాటర్ కోరీ అండర్సన్ విద్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అండర్సన్‌తో పాటు పీటర్సన్(48), బ్రాడ్ హాడిన్(37),సామీ(38) పరుగులతో రాణించారు. ఇక 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఆసియా లయన్స్ బ్యాటర్లలో సనత్ జయసూర్య(38), మహ్మద్ యూసుఫ్(39), దిల్షాన్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో ఆల్బీ మోర్కెల్ మూడు వికెట్ల పడగొట్టగా, మాంటీ పనేసర్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Under 19 World Cup: రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్ -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
క్రైస్ట్‌చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు. -
ప్రియురాలి కోరిక.. సొంత దేశానికి రిటైర్మెంట్
ఆక్లాండ్ : న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అండర్సన్ వెల్లడించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా(మొదటి స్థానంలో ఏబి డివిలియర్స్) అండర్సన్ రికార్డు సాధించాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన అండర్సన్ అప్పటివరకు షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత 2015లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించి ఆ రికార్డును తిరగరాశాడు. తనకు కాబోయే భార్య కోరిక మేరకు కివీస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి యూఎస్ఏ మేజర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నట్లు అండర్సన్ తెలిపాడు. (చదవండి : '11 ఏళ్లయినా తక్కువ అంచనా వేస్తున్నారు') 'ఇంతకాలం కివీస్ క్రికెటర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఫీలవుతున్నా. కివీస్ జట్టుకు సేవలందించినందుకు సంతోషంగా ఉన్నా. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అదే సరైన సమయమని భావించాలి. నా ప్రియురాలు.. కాబోయే భార్య మేరీ మార్గరేట్ అమెరికాలో ఉంటుంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. అమెరికాలోని యూఎస్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడాలని మార్గరేట్ కోరడంతో కాదనలేకపోయా. అందుకే కివీస్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇన్నిరోజులు నాకు అండగా నిలిచిన కివీస్ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.' అంటూ అండర్స్‌న్ చెప్పుకొచ్చాడు.(చదవండి : 'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు') 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా 29 ఏళ్ల కోరె అండర్సన్ కివీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరున్న అండర్సన్ భారీ షాట్లకు పెట్టింది పేరు. తన కెరీర్లో 13 టెస్టుల్లో 683 పరుగులు, 49 వన్డేల్లో 1,109 పరుగులు, 31 టీ20ల్లో 485 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 16, వన్డేల్లో 60, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. అండర్సన్ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎక్కువభాగం గాయాలతో సతమతమయ్యాడు. అతను కివీస్ తరపున చివరిసారిగా 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. అప్పటినుంచి కివీస్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా అండర్సన్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ , ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. (చదవండి : కోహ్లికి మాత్రం రూల్స్ వర్తించవా?) -
కోహ్లి జట్టులోకి కోరె అండర్సన్
బెంగళూరు : గాయంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్‌ను తీసుకున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రకటించింది. విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు వేలంలో నాథన్ కౌల్టర్ నీల్‌ను రూ.2.20 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కౌల్టర్ నీల్ అద్బుతంగా రాణించాడు. కేవలం 8 మ్యాచ్‌లే ఆడిన నీల్ 15 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే ఐపీఎల్ ఆరంభం ముందే గాయపడ్డ అతనికి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆర్సీబీ నీల్ స్థానంలో కివీస్ ఆల్‌రౌండర్ కోరే అండర్సన్‌ను కనీస ధర రూ.2 కోట్లకు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అండర్సన్లో అపార ప్రతిభ ఉందని, అతడు చాలా విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్ అని, జట్టులోకి స్వాగతం పలుకుతున్నామని ఆర్సీబీ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ పేర్కొన్నాడు. ఆర్సీబీ ఏప్రిల్ 8న కోల్‌కతాతో తొలి మ్యాచ్ ఆడనుంది. -
కోరీ అండర్సన్ కు అరుదైన గౌరవం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ అండర్సన్ కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది న్యూజిలాండ్ లో జరగబోయే అండర్ -19 వరల్డ్ కప్ కు గాను అండర్సన్ ను ఈవెంట్ అంబాసిడర్ గా నియమించారు. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అండర్సన్ ను అండర్-19 వరల్డ్ కప్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించించింది. దీనిలో భాగంగా 16 జట్ల ఆడబోయే మెగా టోర్నమెంట్ లో భవిష్యత్తు క్రికెట్ స్టార్లతో అండర్సన్ భాగస్వామ్యం కానున్నట్లు తెలిపింది. అండర్ 19 వరల్డ్ కప్ లో మరొకసారి ఇలా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని అండర్సన్ తెలిపాడు. దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. 2008(మలేషియా), 2010(న్యూజిలాండ్)లో జరిగిన రెండు అండర్ 19 వరల్డ్ కప్ ల్లో అండర్సన్ పాల్గొన్నాడు. ఇది 12వ అండర్-19 వరల్డ్ కప్ కాగా, న్యూజిలాండ్ మూడోసారి ఆతిథ్యం ఇస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి 13నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకూ నాలుగు నగరాల్లో ఏడు వేదికల్లో అండర్ 19 వరల్డ్ కప్ ను నిర్వహించనున్నారు. -
కోరీ అండర్సన్ వస్తున్నాడు..
వెల్లింగ్టన్: భారత్ తో జరిగే వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు కోరీ అండర్సన్ కు చోటు దక్కింది. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న అండర్సన్ గతవారం ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంతో భారత్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో చోటు కల్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో పర్యటించిన న్యూజిలాండ్ జట్టులో కోరీ అండర్సన్ గాయం కారణంగా స్థానం కోల్పోయాడు. అయితే భారత్‌తో జరిగే వన్డే సిరీస్ కు అండర్సన్ అందుబాటులోకి రావడం పట్ల న్యూజిలాండ్ సెలక్టర్ గావిన్ లార్సన్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో అండర్సన్ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే అండర్సన్ పూర్వవైభవాన్ని చాటుకుంటాడని ఆశిస్తున్నట్లు లార్సన్ పేర్కొన్నాడు. 'కోరీ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మిడిల్ ఆర్డర్లో కోరీ మాకు అత్యంత బలం. దాంతో పాటు భారత్‌లోని పరిస్థితులు బాగా తెలిసిన ఆటగాడు. భారత్ లో సిరీస్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా ఉపయోగిస్తాం. అండర్సన్ బౌలింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అవసరమైన సమయాల్లో బౌలింగ్ ఆయుధం కూడా అండర్సన్ ను బరిలోకి దింపుతాం'అని లార్సన్ తెలిపాడు. -
ఆ జట్టు సెమీస్లోఎదురైతే..
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా శ్రీలంక జట్టుతో సెమీ ఫైనల్లో తలపడాల్సి వస్తే వారిని కచ్చితంగా ఓడిస్తామని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కోరీ అండర్సన్ స్పష్టం చేశాడు. ఇరు జట్ల మధ్య పూల్ విభాగంలో మ్యాచ్ జరిగే ఆస్కారం లేదని, ఒకవేళ శ్రీలంకతో సెమీస్ ఆడితే మాత్రం ఆ జట్టును ఎలా ఓడించాలో తమకు తెలుసని అండర్సన్ అన్నాడు. 'పూల్ విభాగంలో మా రెండు జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉన్నాయి. శ్రీలంకతో సెమీస్‌లో మేము తలపడితే వారిని ఓడిస్తాం. శ్రీలంక జట్టులో కుమార సంగాక్కర, మహేలా జయవర్ధనేలు లేకపోవడం వల్ల మాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రస్తుతం ఉన్న లంక జట్టులో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్దే బాగా తెలిసిన ముఖం. దాంతో పాటు యువకులతో కూడిన మా జట్టు ఉత్సాహంగా ఉంది.ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఏ జట్టుతో తలపడినా ఎదురుదాడికి దిగడమే మా కర్తవ్యం 'అని అండర్సన్ పేర్కొన్నాడు. తమ తొలి మ్యాచ్ టీమిండియాతో కావడంతో దృష్టంతా ఆ గేమ్‌పైనే నిలిపినట్లు అండర్సన్ తెలిపాడు. ఇరు జట్ల మధ్య మార్చి 15 వ తేదీన నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనున్న ఆమ్యాచ్ హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందన్నాడు. గురువారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 74 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. మున్రో 67;అండర్సన్ ( 60 రిటైర్డ్‌హర్ట్), గప్తిల్ (41), ఇలియట్ (36 నాటౌట్) చెలరేగారు. అనంతరం లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది. -
కోరీ అండర్సన్ ఆల్‌రౌండ్ షో
వెల్లింగ్టన్: పాకిస్తాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి టీ 20లో న్యూజిలాండ్ 95 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కివీస్ కు గప్టిల్(42), విలియమ్సన్(33) లు శుభారంభాన్ని అందించారు. అనంతరం మున్రో(4) అవుట్ కావడంతో న్యూజిలాండ్ 62 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో సెకెండ్ డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చిన కోరీ అండర్సన్ వీరవిహారం చేశాడు. అండర్సన్ (82 నాటౌట్; 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్(2),అహ్మద్ షెహజాద్(8) వెనువెంటనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు. ఆపై రిజ్వాన్(4), షోయబ్ మాలిక్(14) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పాకిస్తాన్ 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత సర్ఫరాజ్ అహ్మద్(41) రాణించినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. పాకిస్తాన్ జట్టులో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో పాకిస్తాన్ 16.1 ఓవర్లలో 101 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. న్యూజిలాండ్ బౌలరల్లో మిల్నే, ఎలియట్ లు తలో మూడు వికెట్లు తీయగా, కోరీ అండర్సన్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అండర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
అండర్సన్‌పై తీవ్ర ఒత్తిడి
ముంబై మరీ ఎక్కువ రేటు పెట్టిందన్న డౌల్ న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లతో కూడిన ముంబై జట్టులో కోరీ అండర్సన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అన్నాడు. వేలంలో తనను ఎక్కువ ధర (రూ. 4.50 కోట్లు)కు కొనుగోలు చేశారనే ఉద్దేశంతో అతడు మరింత ఒత్తిడికి లోనై విఫలమవుతున్నాడని డౌల్ పేర్కొన్నాడు. ‘మ్యాక్స్‌వెల్, డ్వేన్ స్మిత్ వంటి వారిని కూడా వదులుకొని ముంబై ఫ్రాంచైజీ అండర్సన్‌ను కొనుగోలు చేసింది. వారిప్పుడు ఇతర జట్ల తరపున అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ కోణంలో కూడా కోరీపై ఒత్తిడి నెలకొని ఉండవచ్చు’ అని డౌల్ అన్నాడు. రోహిత్‌శర్మ, పొలార్డ్, మైక్ హస్సీ వంటి అంతర్జాతీయ స్టార్ల మధ్య రాణించడం అంత తేలికకాదని, కెరీర్ ఆరంభంలోనే అండర్సన్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చి భారీ మొత్తం చెల్లించడం సరికాదని డౌల్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తరపున ఇప్పటికి 7 టెస్టులు, 12 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన 23 ఏళ్ల అండర్సన్.. గత జనవరిలో వెస్టిండీస్‌పై 36 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఐపీఎల్ వేలంలో హాట్‌కేకులా మారిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెటర్‌గా అతడు మరింత రాటుదేలాల్సి ఉందని డౌల్ అన్నాడు. -
ఐపీఎల్ గురించి ఆలోచించడం లేదు:అండర్సన్
చెన్నై: రానున్న ఐపీఎల్ సీజన్ గురించి ఆలోచించడం లేదని న్యూజిలాండ్ సంచలన ఆటగాడు కోరీ అండర్ సన్ తెలిపాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే మాత్రమే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భారత్ తో జరిగే సిరీస్ పై దృష్టి సారించనన్నాడు.జట్టలో స్థానాన్ని మరింత పదిలం పరుచుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 36 బంతుల్లో సెంచరీ చేసి ఆఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. -
డి కాక్, అండర్సన్లకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: సంచలన ఆట తీరుతో చెలరేగుతున్న క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కోరీ అండర్సన్ (న్యూజిలాండ్)లకు ఐపీఎల్-7 వేలంలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో జరగనున్న వేలం పాటలో వీరిద్దరి కోసం పెద్ద మొత్తాన్ని వెచ్చించేందుకు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన డి కాక్.. వికెట్ కీపింగ్ కూడా చేస్తుండటం అతని అవకాశాలను రెట్టింపు చేసింది. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇతనిపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. మరోవైపు వన్డేల్లో 36 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అండర్సన్‌పై కూడా అందరి దృష్టి నెలకొంది. గతేడాది ఐపీఎల్‌కు ముందు రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా)... కివీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో 45 బంతుల్లోనే సెంచరీ చేసి ఒక్కసారిగా హాట్‌కేకులా మారాడు. అప్పట్లో వేలం లేకపోవడంతో లీగ్‌కు ముందు ముంబై ఇండియన్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈసారి వేలం జరుగుతుండటంతో అండర్సన్ కోసం గట్టి పోటీ నెలకొంది. సెహ్వాగ్‌ను కొనసాగిస్తారా? ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న సెహ్వాగ్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ ‘కొనసాగించే’ అవకాశాలు కనబడటం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఐకాన్ హోదాలో అతను ఢిల్లీకి ఆడుతున్నాడు. కానీ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వీరూని వేలంలోకి పంపించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ‘సెహ్వాగ్‌ను కొనసాగిస్తే దాదాపు రూ. 12.5 కోట్లు లేదా రూ. 9.5 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మాకు ఉన్న రూ. 60 కోట్లతో జట్టు మొత్తాన్ని తాజాగా కొనుగోలు చేయాలి. కాబట్టి ఇద్దరి కంటే ఎక్కువ మందిని కొనసాగిస్తే దీనిపై ప్రభావం పడుతోంది. వార్నర్‌ను కొనసాగించడం ఓ రకంగా మంచిదే’ అని ఫ్రాంచైజీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఏదేమైనా సెహ్వాగ్ భవితవ్యం... జట్టు కోచ్ కిర్‌స్టెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఐపీఎల్ రెండు దశల్లో భారతదేశంలో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ తేదీల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఒకవేళ ఎన్నికల సమయంలో మ్యాచ్‌లు ఉంటే... టోర్నీని రెండు దశల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఎన్నికల సమయంలో మ్యాచ్‌లను వేరే ఏదైనా దేశంలో (దక్షిణాఫ్రికా లేదా శ్రీలంక పేర్లు పరిశీలనలో ఉన్నాయి) నిర్వహించాలని అనుకుంటున్నారు. -
47 బంతుల్లో 131 వండర్సన్
కొత్త ఏడాది వేడుకలు ముందుగా మొదలయ్యే దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌కు సంచలన ఆరంభం కూడా అక్కడే లభించింది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి... 17 సంవత్సరాల క్రితం ఆఫ్రిది నెలకొల్పిన రికార్డు (37 బంతుల్లో)ను తిరగరాశాడు. ప్రళయకాల రుద్రుడిలా చెలరేగుతూ అండర్సన్ సృష్టించిన పరుగుల సునామీని వర్ణించడానికి ‘అద్భుతం’ కూడా చిన్నమాటే అవుతుందేమో..! కేవలం 47 బంతుల్లోనే అజేయంగా 131 పరుగులు చేసిన అండర్సన్ ధాటికి... 46 బంతుల్లోనే సెంచరీ చేసిన జెస్సీ రైడర్ సంచలన ఇన్నింగ్స్ కనపడకుండా పోయింది. మొత్తానికి కివీస్ ద్వయం సంచలన బ్యాటింగ్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఒకడు కొడితే బీభత్సం... ఇద్దరు కొడితే ప్రళయం.... అదే ఇద్దరూ కలిపి కొడితే...? ఒకరిది వేగం... మరొకరిది బలం... ఈ రెండూ కలిస్తే....? కొత్త ఏడాది తొలి రోజున న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోరీ అండర్సన్, జెస్సీ రైడర్ క్రికెట్ మైదానంలో ప్రళయకాండ సృష్టించారు. బౌలర్ ఎవరైనా... బంతి ఎలాంటిదైనా... వాయు వేగంతో బౌండరీ లైన్ దాటించారు. ముఖ్యంగా అండర్సన్... ఆరు బంతులకో సిక్సర్ (సిక్సర్ టు సిక్సర్) చొప్పున వాయువేగంతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఎదుర్కొన్న మూడో బంతికే బౌండరీ సాధించిన అతను తొలి ఆరు బంతులను మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు. హోల్డర్ బౌన్సర్ వేసినా... నరైన్ గింగరాలు తిప్పినా... కళ్లు చెదిరే రీతిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 36 బంతుల్లోనే సెంచరీ కొట్టిన అండర్సన్ ఇన్నింగ్స్ మొత్తంలో 14 సిక్సర్లు బాదాడు. తద్వారా వన్డేల్లో మూడో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ (16), వాట్సన్ (15)లు ముందున్నారు. నరైన్ బౌలింగ్ (10.1 ఓవర్)లో డీప్ మిడ్ వికెట్లో కొట్టిన తొలి సిక్సర్‌కు బంతి మైదానం బయట పడితే... హోల్డర్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ మీద రోప్ దాటించాడు. ఇక తర్వాతి ఓవర్లో నరైన్‌ను ఉతికిపారేశాడు. డీప్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, డీప్ మిడ్ వికెట్ (2) మీదుగా నాలుగు సిక్సర్లు బాది 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రేవో బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా మరో సిక్సర్ సంధిస్తే... రాంపాల్ వేసిన 15వ ఓవర్లో అండర్సన్ విశ్వరూపం చూపాడు. ఊహించని రీతిలో కళ్లు చెదిరే స్థాయిలో నాలుగు సిక్సర్లు కొట్టాడు. 95 పరుగుల వద్ద మిల్లర్ బౌలింగ్‌లో లాంగ్ లెగ్ మీద కొట్టిన సిక్సర్ అద్భుతం. ఫలితంగా 36 బంతుల్లో సెంచరీ ఫినిష్. దీంతో 1996లో ఆఫ్రిది (37 బంతుల్లో) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. తర్వాత కూడా మరో రెండు సిక్సర్లు, మరో రెండు బౌండరీలు కొట్టి అజేయంగా నిలిచాడు. మరోవైపు రైడర్ కూడా దూకుడుగా ఆడాడు. రెండో ఎండ్‌లో సహచరుడు చెలరేగుతుంటే అతను చూసి ఆగలేకపోయాడు. ఎక్కువగా బౌండరీలు కొట్టినా... హోల్డర్ ఒకే ఓవర్లో రెండు బలమైన సిక్సర్లతో మోత మోగించాడు. రాంపాల్, మిల్లర్, బ్రేవోలకు ఒక్కో సిక్సర్ రుచి చూపించాడు. తద్వారా 46 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని ఫాస్టెస్ట్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ‘అండర్సన్ చాలా చక్కటి షాట్లు ఆడాడు. ఆడిన తీరు చూస్తే గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడని అనిపిస్తోంది. ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్‌ను మలుపు తిప్పవచ్చు. ఐపీఎల్లో అతను మా చెన్నై జట్టులో ఆడాలని కోరుకుంటున్నా. వేలంలో ధోని, కోచ్ ఫ్లెమింగ్ అతడిని తీసుకుంటారని ఆశిస్తున్నా’ -డ్వేన్ బ్రేవో, వెస్టిండీస్ కెప్టెన్ ‘ఇప్పటివరకు నేను అండర్సన్ పేరు కూడా వినలేదు. కొత్త సంవత్సరంలో మొదటి వార్తగా నా రికార్డు చెరిగిపోయిందని తెలిసింది. అయితే అదో అద్భుత ప్రదర్శన. 36 బంతుల్లో సెంచరీ చిన్న విషయం కాదు. నేను రిటైరయ్యే వరకు నా రికార్డు నిలిచి ఉంటుందని భావించాను. ఇప్పటివరకు ఆఫ్రిది అంటే ఆ రికార్డే అందరికీ గుర్తొచ్చేది. ఇప్పుడు అండర్సన్ పేరు వచ్చింది. టి20ల కారణంగా వేగం పెరిగిన ఈ రోజుల్లో ఈ రికార్డు కూడా ఎప్పుడైనా బద్దలవుతుందేమో’ - షాహిద్ ఆఫ్రిది, పాక్ క్రికెటర్ ‘బ్యాటింగ్ చేసేటప్పుడు రికార్డు గురించి ఆలోచన లేదు. వేగంగా సెంచరీ చేయబోతున్నానని తెలుసు కానీ అదే ఫాస్టెస్ట్ సెంచరీ అవుతుందని నిజంగానే తెలీదు. నేను ఎదుర్కొన్న ప్రతీ బంతిని బాది వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టానే తప్ప రికార్డును మనసులో పెట్టుకునే తీరిక కూడా క్రీజ్‌లో లేదు. ఆఫ్రిది మళ్లీ విజృంభించి నా రికార్డును చెరిపేందుకు ప్రయత్నిస్తాడేమో’ - కోరీ అండర్సన్ బరువుతగ్గి... బాదాడు! క్వీన్స్టౌన్ వన్డేకు ముందు 23 ఏళ్ల కోరీ అండర్సన్ ఆడింది ఆరు వన్డేలే...వాటిలో అత్యధిక స్కోరు 46! అయితే ఒక్క ఇన్నింగ్స్ ఇప్పుడు అతని పేరు మార్మోగేలా చేసింది. ధాటిగా బ్యాటింగ్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేసే ఈ ఆల్‌రౌండర్ ఇటీవల న్యూజిలాండ్ భవిష్యత్ తారగా వెలుగులోకి వచ్చిన కొత్త కుర్రాళ్లలో ఒకడు. 59 ఏళ్ల న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో 16 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఇతను అదే వయసులో బోర్డు కాంట్రాక్ట్ పొందిన పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత వరుస గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో సరిగా ఆడలేకపోయాడు. 2008, 2010 అండర్-19 ప్రపంచకప్‌లలో అతను కివీస్ తరఫున ఆడాడు. 2010, 11 సంవత్సరాల్లో బరువు పెరిగి బాగా లావుగా తయారై ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆట దెబ్బతింది. దీంతో 2012లో ఫిట్నెస్పరంగా తీవ్రంగా శ్రమించి 20 కిలోల బరువు తగ్గి... మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.దేశవాళీ మ్యాచ్‌ల్లో శరవేగంగా పరుగులు చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి సెంచరీ చేశాడు. దీంతో అతనికి జాతీయ టి20 జట్టులో పిలుపు లభించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికైనా ప్రాక్టీస్‌లో గాయం కావడంతో తిరుగు ముఖం పట్టాల్సి వచ్చింది. అయితే జూన్‌లో చాంపియన్స్ ట్రోఫీలో అతను తొలి వన్డే అవకాశం దక్కింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ సాధించడంతో తొలిసారి అండర్సన్‌కు గుర్తింపు లభించింది. ఆ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పదునైన స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మరో సారి ఫిట్నెస్ సమస్యలు రాకుంటే అండర్సన్ కివీస్‌కు ఉపయుక్తమైన ఆల్‌రౌండర్ కాగలడు. ఓ కన్నేయాలి...: భారత జట్టు తమ తర్వాతి సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో అండర్సన్ కీలక ఆటగాడు అయ్యే అవకాశం ఉంది. నిలకడగా 140 కిమీ వేగంతో బౌలింగ్ కూడా చేస్తున్న కోరీని రెండు రంగాల్లోనూ ఎదుర్కునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. ఈ ఇన్నింగ్స్ కచ్చితంగా అండర్సన్‌ను ఐపీఎల్ వేలానికి ముందు స్టార్‌ని చేసింది. కాబట్టి తనకి ఐపీఎల్లో డిమాండ్ బాగా ఎక్కువగా ఉండొచ్చు. - సాక్షి క్రీడావిభాగం -
న్యూజిలాండ్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
-
న్యూజిలాండ్ క్రికెటర్ అండర్సన్ ప్రపంచ రికార్డు
క్వీస్స్టస్ : న్యూజిలాండ్ క్రికెటర్ కోరీ అండర్సన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి.. 18 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అఫ్రిది రికార్డును బద్ధలుకొట్టాడు. 37 బంతుల్లో సెంచరీ చేసిన అఫ్రిది రికార్డు.. ఆండర్సన్ దెబ్బకు మరుగున పడిపోయింది. క్వీన్స్టన్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అండర్సన్ కేవలం 47 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. అతని విధ్వంసక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ కేవలం 21 ఓవర్లలో 4 వికెట్లకు 283 పరుగులు చేసింది. కాగా 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఇన్నాళ్లకు అతని రికార్డు బద్దలైంది.