చెన్నై: రానున్న ఐపీఎల్ సీజన్ గురించి ఆలోచించడం లేదని న్యూజిలాండ్ సంచలన ఆటగాడు కోరీ అండర్ సన్ తెలిపాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే మాత్రమే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భారత్ తో జరిగే సిరీస్ పై దృష్టి సారించనన్నాడు.జట్టలో స్థానాన్ని మరింత పదిలం పరుచుకుంటాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 36 బంతుల్లో సెంచరీ చేసి ఆఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.