ఫైనల్లో న్యూజిలాండ్‌ | New Zealand in the final | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఫైనల్లో న్యూజిలాండ్‌

Published Sat, Oct 19 2024 3:31 AM | Last Updated on Sat, Oct 19 2024 7:35 AM

New Zealand in the final

షార్జా: మహిళల టి20 ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ 8 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ను ఓడించింది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్‌ అవతరించడం ఖాయమైంది. 

ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్‌ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్‌ తలపడుతుంది. విండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. 

జార్జియా ప్లిమర్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. విండీస్‌ బౌలర్‌ డాటిన్‌ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement