నేడు మహిళల టి20వరల్డ్ కప్ ఫైనల్
తొలి టైటిల్ వేటలో ఇరు జట్లు
రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: ఒక వైపు న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది... మరో వైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి తుది పోరుకు అర్హత సాధించి ఈ సారైనా కప్‌ను ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళల టి20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో సఫారీ టీమ్‌తో కివీస్ తలపడనుంది. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో రెండు జట్ల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో సాగింది.
ఇరు జట్లు చెరో 3 విజయాలు సాధించి లీగ్ దశలో తమ గ్రూప్‌నుంచి రెండో స్థానంలోనే నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఆరు సార్లు చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ముందంజ వేయగా...మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై పైచేయి సాధించి కివీస్ ఫైనల్ చేరింది.
సుదీర్ఘ కాలంగా మహిళల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆ్రస్టేలియా, తమదైన రీతిలో క్రికెట్‌కు చిరునామాగా ఉన్న ఇంగ్లండ్‌లను దాటి రెండు కొత్త జట్లు ఇప్పుడు ఆటపై కొత్త ముద్ర వేసేందుకు ఈ ఫైనల్ సరైన వేదిక కానుంది. ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవుతారనే విషయమే మహిళల క్రికెట్‌లో ఆసక్తిని రేపుతోంది. సమ ఉజ్జీల్లాంటి రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది చూడాలి.
ఇరు జట్లనుంచి అగ్రశ్రేణి క్రికెటర్లుగా ఎదిగిన సోఫీ డివైన్, సుజీ బేట్స్, మరిజాన్ కాప్‌లలో ఎవరికి వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మారుతుందనేది ఆసక్తికరం. 2010లో ఫైనల్ ఆడిన కివీస్ జట్టులో డివైన్ సభ్యురాలిగా ఉంది. ఆమెతో పాటు అమేలియా కెర్, ప్లిమ్మర్, తహుహు, కార్సన్, రోజ్‌మేరీలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
దక్షిణాఫ్రికా టీమ్‌లో బేట్స్, కాప్‌లతో పాటు కెపె్టన్ లారా వోల్‌వార్ట్, తజ్‌మీన్, ఎమ్‌లాబా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగడం ద్వారా మహిళల క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ (333) రికార్డును బేట్స్ సవరించనుంది. సెమీస్‌లో అర్ధసెంచరీతో ఆసీస్ పని పట్టిన అనెక్ బాష్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉంది.
తుది జట్లలో ఎలాంటి మార్పు చేయకుండా సెమీస్ ఆడిన టీమ్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. దుబాయ్‌లో వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. టోర్నీలో ఒక్కసారి కూడా వాన వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగలేదు. మంచు సమస్య కూడా లేదు కాబట్టి స్పిన్నర్లు మంచి ప్రభావం చూపగలరు.
Comments
Please login to add a commentAdd a comment