Women's T20 World Cup 2024
-
నేడే ఫైనల్: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్
దుబాయ్: ఒక వైపు న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది... మరో వైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి తుది పోరుకు అర్హత సాధించి ఈ సారైనా కప్‌ను ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళల టి20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో సఫారీ టీమ్‌తో కివీస్ తలపడనుంది. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో రెండు జట్ల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో సాగింది. ఇరు జట్లు చెరో 3 విజయాలు సాధించి లీగ్ దశలో తమ గ్రూప్‌నుంచి రెండో స్థానంలోనే నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఆరు సార్లు చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ముందంజ వేయగా...మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై పైచేయి సాధించి కివీస్ ఫైనల్ చేరింది. సుదీర్ఘ కాలంగా మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆ్రస్టేలియా, తమదైన రీతిలో క్రికెట్‌కు చిరునామాగా ఉన్న ఇంగ్లండ్లను దాటి రెండు కొత్త జట్లు ఇప్పుడు ఆటపై కొత్త ముద్ర వేసేందుకు ఈ ఫైనల్ సరైన వేదిక కానుంది. ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవుతారనే విషయమే మహిళల క్రికెట్లో ఆసక్తిని రేపుతోంది. సమ ఉజ్జీల్లాంటి రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది చూడాలి. ఇరు జట్లనుంచి అగ్రశ్రేణి క్రికెటర్లుగా ఎదిగిన సోఫీ డివైన్, సుజీ బేట్స్, మరిజాన్ కాప్లలో ఎవరికి వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మారుతుందనేది ఆసక్తికరం. 2010లో ఫైనల్ ఆడిన కివీస్ జట్టులో డివైన్ సభ్యురాలిగా ఉంది. ఆమెతో పాటు అమేలియా కెర్, ప్లిమ్మర్, తహుహు, కార్సన్, రోజ్మేరీలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీమ్‌లో బేట్స్, కాప్‌లతో పాటు కెపె్టన్ లారా వోల్వార్ట్, తజ్మీన్, ఎమ్‌లాబా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగడం ద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ (333) రికార్డును బేట్స్ సవరించనుంది. సెమీస్‌లో అర్ధసెంచరీతో ఆసీస్ పని పట్టిన అనెక్ బాష్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉంది. తుది జట్లలో ఎలాంటి మార్పు చేయకుండా సెమీస్ ఆడిన టీమ్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. దుబాయ్‌లో వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. టోర్నీలో ఒక్కసారి కూడా వాన వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగలేదు. మంచు సమస్య కూడా లేదు కాబట్టి స్పిన్నర్లు మంచి ప్రభావం చూపగలరు. -
ఫైనల్లో న్యూజిలాండ్
షార్జా: మహిళల టి20 ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. విండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్ డాటిన్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడిపోయింది. -
W T20 WC: ఆసీస్ చిత్తు.. వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ధమాకా
దుబాయ్: ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను బోల్తా కొట్టించింది. తద్వారా సొంతగడ్డ (దక్షిణాఫ్రికా 2023)పై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు మెగా టోర్నీ జరిగితే ఏడుసార్లు ఫైనల్ చేరిన ఆ్రస్టేలియా జట్టును ఈసారి దక్షిణాఫ్రికా టైటిల్ పోరుకు దూరం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44; 2 ఫోర్లు), ఎలీస్ పెరీ (31; 2 ఫోర్లు), కెపె్టన్ తాలియా మెక్‌గ్రాత్ (27; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయ»ొంగ ఖాకా 2, మరిజాన్ కాప్, ఎమ్‌లాబా చెరో వికెట్ తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా మరో 2.4 ఓవర్లు మిగిలుండగానే 17.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ , ఓపెనర్ లౌరా వోల్వార్ట్ (37 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనెకె బాష్ (48 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు,1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. నేడు రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్
దుబాయ్: ఈ ప్రపంచకప్‌లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో ఇంగ్లండ్, రెండు విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ ఈ స్థానాల్ని తారుమారు చేసింది. ఇంగ్లండ్ మహిళల జట్టు అనూహ్యంగా ఒక్క ఆఖరి పోరుతో ఇంటిబాట పట్టింది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి ‘టాప్’లోకి వచ్చి నిలిచింది. మూడు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ విండీస్ (1.536) జట్టును సెమీఫైనల్స్‌కు పంపింది. ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా (1.382) రెండో జట్టుగా ముందంజ వేసింది. ఇంగ్లండ్ (1.091) మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టాపార్డర్‌లో బౌచిర్ (14), డ్యానీ వ్యాట్ (16), అలైస్ క్యాప్సీ (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నట్ సీవర్ బ్రంట్ (50 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. కెపె్టన్ హీథెర్ నైట్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో చకచకా 46 పరుగులు జోడించింది. అయితే 80 పరుగుల జట్టు స్కోరు వద్ద హీథెర్ రిటైర్డ్‌హర్ట్ కావడంతో ఇంగ్లండ్ ఆటతీరు మారింది. తర్వాత వచ్చిన వారిలో ఏ ఒక్కరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోవడంతో ఇంగ్లండ్ 150 మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. అఫీ ఫ్లెచర్ 3, హేలీ మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ ఇంకో 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), క్వియానా జోసెఫ్ (38 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభమిచ్చారు. మెరుపు వేగంతో ఆడిన ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు.తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలో 102 పరుగులు జోడించాక క్వియానా, తర్వాత ఓవర్లో కెపె్టన్ హేలీ నిష్క్రమించారు. అప్పటికి 41 బంతుల్లో 38 పరుగులు కావాల్సి ఉండగా, డాటిన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ) ధాటిగా ఆడింది. గెలుపు వాకిట ఆమె బౌల్డ్ కాగా, మిగతా లాంఛనాన్ని ఆలియా అలెన్ (4 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) పూర్తి చేసింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడతాయి. -
‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్‌లు డ్రాప్ చేయలేదు’
మహిళల టీ20 ప్రపంచకప్-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తేనే హర్మన్‌ప్రీత్ సేన టాప్-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.కానీ.. ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో రాణించినా.. ఫీల్డింగ్‌లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు జారవిడిచింది.లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్) నమోదు చేసింది. కివీస్ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్ మహిళా టీమ్.ఇంత చెత్త ఆట చూడలేదుఈ నేపథ్యంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై స్పందించాడు.మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయలేదు‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్‌ల జట్టు నుంచి బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్ ఇచ్చామని కోచ్‌లు చెప్పిన విషయం తెలిసిందే.అదే ప్రభావం చూపిందిఈ నేపథ్యంలో పాక్ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా ఇలా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత పాక్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్ చేశాం. కానీ.. బ్యాటింగ్.. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సింది.మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్‌లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్‌లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఆ ఎనిమిది క్యాచ్‌లు ఏదేమైనా.. పాకిస్తాన్ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్‌లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్ చేరాలన్న హర్మన్‌సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్ వంటి జట్టుతో మ్యాచ్ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లువేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ స్కోరు: 110/6 (20)పాకిస్తాన్ స్కోరు: 56 (11.4)ఫలితం: పాక్‌పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్‌లో అడుగుమహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి పాకిస్తాన్‌తో పాటు భారత్ కూడా అవుట్.చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024 -
India vs Australia: భారత్ సెమీస్ ఆశలకు దెబ్బ!
షార్జా: భారత మహిళల ముందున్న లక్ష్యం 152...అసాధ్యమేమీ కాదు కానీ 47 పరుగులకే టాపార్డర్ అవుట్! ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (47 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), దీప్తిశర్మ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) భాగస్వామ్యం ఆశలు రేపింది. 25 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి అవుటవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 40; 5 ఫోర్లు), కెపె్టన్ తాహ్లియా మెక్‌గ్రాత్ (26 బంతుల్లో 32; 4 ఫోర్లు), ఎలైస్ పెరీ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. రాణించిన గ్రేస్ హారిస్ భారత సీమర్ రేణుక ఆరంభ ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 17 పరుగుల వద్దే వరుస బంతుల్లో బెత్ మూని (2), జార్జియా (0) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ గ్రేస్ హారిస్, కెపె్టన్ తాహ్లియా కుదురుగా ఆడటంతో 10 ఓవర్లలో జట్టు 65/2 స్కోరు చేసింది. ఆష్లే గార్డ్నర్ (6) విఫలం కాగా, ఎలైస్ పెరీ ధాటిగా ఆడింది.హర్మన్ పోరాడినా... షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (16) విఫలం అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ నడిపించారు. జట్టు స్కోరును 15.1 ఓవర్లలో వందకు చేర్చారు. అయితే భారీ షాట్‌కు యతి్నంచిన దీప్తిశర్మ బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా...4 పరుగుల చేసిన భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది. పాక్ గెలిస్తేనే... ‘ఎ’ గ్రూప్ నుంచి ఆసీస్ సెమీస్ చేరగా...భారత్, కివీస్ మధ్య రెండో స్థానం కోసం పోటీ ఉంది. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో ఆ జట్టుకు ముందుకు వెళ్లి భారత్ ని్రష్కమిస్తుంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత కూడా భారత్ రన్‌రేట్ కివీస్కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్ చేతిలో ఆ జట్టు ఓడిపోతే చాలు. అయితే బలహీనమైన పాక్‌పై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్: హారిస్ (సి) స్మృతి (బి) దీప్తిశర్మ 40; బెత్ మూని (సి) రాధ (బి) రేణుక 2; జార్జియా (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 0; తాహ్లియా (స్టంప్డ్) రిచా (బి) రాధ 32; పెర్రీ (సి) సబ్–సజన (బి) దీప్తిశర్మ 32; ఆష్లే గార్డ్నెర్ (సి) రాధ (బి) పూజ 6; లిచ్‌ఫీల్డ్ నాటౌట్ 15; అనాబెల్ (బి) శ్రేయాంక 10; సోఫీ రనౌట్ 0; మేగన్ షట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–17, 2–17, 3–79, 4–92, 5–101, 6–134, 7–145, 8–145. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, శ్రేయాంక 4–0–32–1, పూజ వస్త్రకర్ 3–0–22–1, అరుంధతీ రెడ్డి 3–0–24–0, దీప్తిశర్మ 4–0–28–2, రాధా యాదవ్ 2–0–14–1. భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) అనాబెల్ (బి) ఆష్లే గార్డ్నర్ 20; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) సోఫి 6; జెమీమా (సి) గార్డ్నర్ (బి) మేగన్ షటల్ 16; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 54; దీప్తిశర్మ (సి) జార్జియా (బి) సోఫీ 29; రిచా ఘోష్ రనౌట్ 1; పూజ (బి) అనాబెల్ 9; అరుంధతి రనౌట్ 0; శ్రేయాంక రనౌట్ 0; రాధ (ఎల్బీడబ్ల్యూ) (బి) అనాబెల్ 0; రేణుక నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–26, 2–39, 3–47, 4–110, 5–111, 6–139, 7–139, 8–141, 9–141. బౌలింగ్: మేగన్ షట్ 4–0–25–1, ఆష్లే గార్డ్నర్ 4–0–32–1, అనాబెల్ 4–0–22–2, సోఫి మోలినెక్స్ 4–0–32–2, జార్జియా 3–0–22–0, డార్సిబ్రౌన్ 1–0–8–0. -
ఆ్రస్టేలియా మహిళల ఘన విజయం
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా జట్టు మహిళల టి20 ప్రపంచకప్‌లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్ ‘ఎ’లో వరుసగా ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పోరులో ఆసీస్ అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. టాస్ నెగ్గిన ఆ్రస్టేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆలియా రియాజ్ (32 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, మిగతా ఎవరూ కూడా కనీసం 15 పరుగులైనా చేయలేకపోయారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లే గార్డ్నెర్ 4, అనాబెల్ సదర్లాండ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా కేవలం 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 83 పరుగులు చేసి గెలిచింది. ఈ గ్రూపులో మూడు విజయాలతో ఆసీస్ (6 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉంది. -
WT20 WC: విండీస్ మహిళల ధనాధన్ విక్టరీ
దుబాయ్: వెస్టిండీస్ మహిళల ఆల్‌రౌండ్ ప్రదర్శనకు బంగ్లాదేశ్ బెంబేలెత్తిపోయింది. దీంతో టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గిన కరీబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (39; 4 ఫోర్లు) మాత్రమే రాణించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్పిన్నర్ కరిష్మా రమ్హరక్ (4–0–17–4) ఉచ్చులో బంగ్లా బ్యాటర్లంతా కుదేలయ్యారు. అఫీ ఫ్లెచర్ 2 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 12.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ , ఓపెనర్ హేలీ మాథ్యూస్ (22 బంతుల్లో 34; 6 ఫోర్లు), స్టెఫానీ టేలర్ (29 బంతుల్లో 27 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 52 పరుగులు జోడించి శుభారంభమిచ్చారు.షెర్మయిన్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), డియాండ్రా డాటిన్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మిగతా పనిని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో నహిదా అక్తర్, మారుఫా అక్తర్ చెరో వికెట్ తీశారు. -
శ్రీలంకపై భారత్ ఘన విజయం..
దుబాయ్: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టుతో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 82 పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. వరుసగా మూడో ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్స్), ఓపెనర్ స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20), కాంచన (19) తలా కొన్ని పరుగులు చేశారు. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, కేరళ స్పిన్నర్ ఆశ శోభన చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గి 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. లీగ్ దశలో ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో భారత జట్టు తలపడనుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) విష్మి గుణరత్నె (బి) చమరి ఆటపట్టు 43; స్మృతి మంధాన (రనౌట్) 50; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 52; జెమీమా (సి) ప్రబోధిని (బి) కాంచన 16; రిచా ఘోష్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు)172. వికెట్ల పతనం: 1–98, 2–98, 3–128, బౌలింగ్: ప్రియదర్శిని 2–0–11–0; సుగంధిక 3–0–29–0; ప్రబోధిని 3–0–32–0; కవిషా దిల్హారి 2–0–11–0; ఇనోక 3–0–26–0; చమరి ఆటపట్టు 4–0–34–1; కాంచన 3–0–29–1. శ్రీలంక ఇన్నింగ్స్: విష్మి గుణరత్నె (సి) (సబ్) రాధ (బి) రేణుక 0; చమరి ఆటపట్టు (సి) దీప్తి శర్మ (బి) శ్రేయాంక 1; హర్షిత (సి) రిచా ఘోష్ (బి) రేణుక 3; కవిషా దిల్హారి (సి) రేణుక (బి) అరుంధతి 21; అనుష్క (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శోభన 20; నిలాక్షిక సిల్వా (సి) షఫాలీ (బి) అరుంధతి 8; కాంచన (సి) (సబ్) రాధ (బి) అరుంధతి 19; సుగంధిక (సి) రిచా ఘోష్ (బి) శోభన 1; ప్రియదర్శిని (సి) (సబ్) రాధ (బి) శోభన 1; ప్రబోధిని (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 9; ఇనోక (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 90. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–6, 4–43, 5–57, 6–58, 7–61, 8–65, 9–86, 10–90, బౌలింగ్: రేణుక 4–0–16–2; శ్రేయాంక 4–0–15–1; దీప్తి 3.5–0–16–1; అరుంధతి రెడ్డి 4–0–19–3; ఆశ శోభన 4–0–19–3. -
బ్యాటింగ్‌లో సత్తా చాటితేనే...
దుబాయ్: అంతర్జాతీయ మహిళల టి20ల్లో శ్రీలంకపై భారత విజయాల రికార్డు 19–5తో ఎంతో ఘనంగా ఉంది. అయితే ఈ ఐదు పరాజయాల్లో చివరిది ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో వచ్చి0ది. అప్పటి వరకు అద్భుత ఫామ్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులో అనూహ్యంగా పరాజయం పాలైంది. కాబట్టి శ్రీలంకే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ వరల్డ్ కప్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలవడంతో పాటు రన్‌రేట్ మెరుగుపర్చుకోవడం కూడా భారత్‌కు ముఖ్యం. ఈ నేపథ్యంలో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు శ్రీలంక వరుసగా పాకిస్తాన్, ఆ్రస్టేలియాల చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో ఓడితే లంక నిష్క్రమణ ఖాయమవుతుంది. హర్మన్ సిద్ధం... కివీస్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. టాప్–5 స్మృతి, షఫాలీ, హర్మన్, జెమీమా, రిచా విఫలం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. దాని నుంచి కోలుకొని పాక్‌ను ఓడించినా... ఇక్కడా బ్యాటింగ్ గొప్పగా సాగలేదు. బౌలర్ల ప్రదర్శనతో పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా జట్టు 18.5 ఓవర్లు తీసుకోవడంతో రన్‌రేట్ కూడా పెంచుకునే అవకాశం లేకపోయింది. ఇలాంటి స్థితిలో లంకపై బ్యాటర్లు చెలరేగి భారీ స్కోరు సాధిస్తేనే జట్టుకు మేలు కలుగుతుంది. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన స్మృతికి లంకపై కూడా పేలవ రికార్డు ఉంది. మెడ నొప్పితో పాక్‌తో మ్యాచ్‌లో చివరి క్షణాల్లో నిష్క్రమించిన కెపె్టన్ హర్మన్ కోలుకొని ఈ పోరుకు అందుబాటులోకి రావడం టీమ్‌కు సానుకూలాంశం. షఫాలీ దూకుడుగా ఆడి శుభారంభం అందిస్తే మిగతా బ్యాటర్లు దానిని కొనసాగించగలరు. పాక్‌తో ఆడిన టీమ్‌నే ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. పేసర్ పూజ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్ సజనకు చోటు ఖాయం. అటపట్టు ఆడితేనే... వరుసగా రెండు ఓటముల తర్వాత శ్రీలంక పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న కెపె్టన్, స్టార్ ప్లేయర్ చమరి అటపట్టు రెండు మ్యాచ్‌లలోనూ ఓపెనర్‌గా విఫలం కావడంతో దాని ప్రభావం టీమ్‌పై కూడా పడింది. ఆ్రస్టేలియాతో పోరులో 93 పరుగులకే పరిమితం అయిన లంక... అంతకుముందు తమకంటే బలహీన జట్టు అయిన పాకిస్తాన్‌తో కూడా పేలవంగా ఆడి 85 పరుగులే చేయగలిగింది. రెండు మ్యాచ్‌లలో కూడా ఒక్క బ్యాటర్ కనీసం 30 పరుగుల స్కోరు చేయలేదు. బౌలింగ్‌లో అనుభవరాహిత్యం కూడా లంకను బలహీనంగా మార్చింది. ఇలాంటి టీమ్ భారత్‌కు పోటీనివ్వగలదా లేక ఆసియా కప్ ఫైనల్ స్ఫూర్తితో మళ్లీ ఇబ్బంది పెట్టగలదా అనేది చూడాలి. -
ఆస్ట్రేలియా జోరు
షార్జా: డిఫెండింగ్ చాంపియన్, ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా జట్టు మహిళల టి20 వరల్డ్ కప్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆసీస్ వరుసగా రెండో విజయంతో గ్రూప్ ‘ఎ’లో తమ అగ్ర స్థానాన్ని పటిష్ట పర్చుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (32 బంతుల్లో 40; 2 ఫోర్లు), ఎలైస్ పెరీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడగా... కెప్టెన్ అలీసా హీలీ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఫోబీ లిచ్‌ఫీల్డ్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలిచారు. ఒకదశలో 109/2తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్ జట్టు ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో 29 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... హ్యాలిడే, రోజ్మేరీ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అమేలియా కెర్ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు), సుజీ బేట్స్ (20) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మేగన్ షుట్ 3.2 ఓవర్లు బౌలింగ్ చేయగా... ఈ 20 బంతుల్లో 18 డాట్ బంతులు వేసింది. 3 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమె 3 వికెట్లు పడగొట్టింది. ఇతర బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ (3/21), సోఫీ మాలినెక్స్ (2/15) కివీస్ పతనంలో ప్రధాన పాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్‌లో నేడు భారత్ X శ్రీలంకవేదిక: దుబాయ్; రాత్రి గం. 7:30 నుంచిస్కాట్లాండ్ X దక్షిణాఫ్రికావేదిక: దుబాయ్ ;మధ్యాహ్నం గం. 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వెస్టిండీస్ ధనాధన్ విజయం
దుబాయ్: మాజీ చాంపియన్ వెస్టిండీస్ మహిళల టి20 ప్రపంచకప్‌లో తమ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలుపు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో సఫారీ చేతిలో ఓడిన 2016 చాంపియన్ ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్లు సారా బ్రిస్ (2), సస్కియా హార్లీ (11)లను ఆరంభంలోనే అవుట్ చేయడంతో స్కాట్లాండ్ తిరిగి పుంజుకోలేకపోయింది. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేథరిన్ బ్రిస్ (31 బంతుల్లో 25; 1 ఫోర్), అయిల్సా లిస్టెర్ (33 బంతుల్లో 26; 1 ఫోర్) కాసేపు క్రీజులో నిలబడటంతో స్కాట్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కరీబియన్ బౌలర్లలో అఫీ ఫ్లెచెర్ 3 వికెట్లు తీయగా, చినెల్లి హెన్రీ, హేలీ మాథ్యూస్, కరిష్మా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆరంభంలోనే ఓపెనర్లు స్టెఫానీ టేలర్ (4), హేలీ మాథ్యూస్ (8) వికెట్లను కోల్పోయి తడబడింది. అయితే క్వినా జోసెఫ్ ( 18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), చినెల్లి హెన్రీ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆట ఆడి వేగంగా మ్యాచ్‌ను ముగించారు. దీంతో విండీస్ 11.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. ఒలివియా బెల్కు 2 వికెట్లు దక్కాయి. రాచెల్, ప్రియనాజ్ ఛటర్జీ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు స్కాట్లాండ్ ఇన్నింగ్స్: హార్లీ (సి) డాటిన్ (బి) హేలీ మాథ్యూస్ 11; సారా బ్రిస్ (బి) హెన్రీ 2; కేథరిన్ బ్రిస్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 25; లిస్టెర్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 26; ప్రియనాజ్ ఛటర్జీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫ్లెచర్ 0; జాక్ బ్రౌన్ (రనౌట్) 11; డార్సీ కార్టర్ (నాటౌట్) 14; కేథరిన్ ఫ్రేజర్ (రనౌట్) 6; రాచెల్ (బి) కరిష్మా 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–59, 4–59, 5–76, 6–76, 7–98, 8–99. బౌలింగ్: హెన్రీ 4–2–10–1, హేలీ మాథ్యూస్ 4–0–21–1, కరిష్మా 4–0–24–1, అశ్మిని మునిసర్ 1–0–8–0, అఫీ ఫ్లెచర్ 4–0–22–3, క్వినా జోసెఫ్ 1–0–2–0, ఆలియా అలెన్ 2–0–10–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) కేథరిన్ బ్రిస్ (బి) ప్రియనాజ్ 8; స్టెఫానీ (బి) రాచెల్ 4; క్వినా జోసెఫ్ (సి) ప్రియనాజ్ (బి) ఒలివియా బెల్ 31; షెర్మయిన్ (సి అండ్ బి) ఒలివియా బెల్ 2; డాటిన్ (నాటౌట్) 28; చినెల్లి హెన్రీ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (11.4 ఓవర్లలో 4 వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–48, 4–59. బౌలింగ్: రాచెల్ స్లేటర్ 2–0–17–1, కేథరిన్ బ్రిస్ 3–0–22–0, ఒలివియా బెల్ 3–0–18–2, ప్రియనాజ్ 1–0–15–1, అబ్తాహ మక్సూద్ 2.4–0–28–0. -
భారత్ బోణీ
భారత మహిళల జట్టు గెలిచింది. ప్రపంచ కప్‌లో బోణీ అయితే కొట్టింది... కానీ బౌలర్లు కట్టుదిట్టంగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే... రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు ధనాధన్‌గా ఛేదించాల్సిన లక్ష్యం పట్ల మన బ్యాటర్లు నిర్లక్ష్యం వహించారు. హైదరాబాదీ సీమర్ అరుంధతి రెడ్డి (3/19) అదరగొడితే... పాక్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ 2 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా పాకిస్తాన్ (0.555) మూడో స్థానంలో ఉండగా... భారత్ (–1.217) నాలుగో స్థానంలో నిలిచింది. ఈనెల 9న జరిగే తమ మూడో లీగ్ మ్యాచ్‌లో ఆసియా చాంపియన్ శ్రీలంకతో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. దుబాయ్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ పోరులో భారత పేస్ బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అరుంధతి రెడ్డి (3/19), స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (2/12) సహా రేణుక సింగ్ (1/23), దీప్తి శర్మ (1/24), ఆశ శోభన (1/24) ఇలా బౌలింగ్‌కు దిగిన ప్రతి ఒక్కరు సమష్టిగా వికెట్లను పడగొట్టారు. దీంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. నిదా దర్ (34 బంతుల్లో 28; 1 ఫోర్) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్! అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు హర్మన్‌ప్రీత్ బృందం ఆఖరిదాకా పోరాడాల్సి వచ్చింది. ఇది భారత జట్టు రన్‌రేట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చివరకు టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (35 బంతుల్లో 32; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ (24 బంతుల్లో 29 రిటైర్డ్‌హర్ట్; 1 ఫోర్) రాణించారు. ఆరంభంలోనే తడబాటు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు కష్టాలు స్వాగతం పలికాయి. టాపార్డర్‌ను రేణుక, దీప్తి శర్మ, శ్రేయాంక దెబ్బతీస్తే అరుంధతి నిప్పులు చెరిగే బౌలింగ్‌తో మిడిలార్డర్ బ్యాటర్లు ఒమైమా (3), నిదా దర్, ఆలియా రియాజ్ (4)లను అవుట్ చేయడంతో పాక్ 100 పరుగులు చేయడం కూడా కష్టమనిపించింది. నష్రా సంధు ఆఖరి రెండు బంతుల్లో 2, 4 పరుగులు రాబట్టడంతో చివరకు పాక్ 105 పరుగులు చేయగలిగింది. తర్వాత భారత్ ముందున్న లక్ష్యం చిన్నదే అయినా బ్యాటర్లు చకాచకా ఛేదించే సాహసం చేయలేకపోయారు. స్మృతి మంధాన (7) ఆరంభంలోనే అవుటయ్యాక షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 23), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడు ప్రదర్శించలేదు. దీంతో 15, 16 ఓవర్లలో ముగించాల్సిన లక్ష్యం 19వ ఓవర్ ఐదో బంతిదాకా సాగింది. ఒక్క సిక్స్ కూడా నమోదుకాని ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు 8 ఫోర్లు, భారత బ్యాటర్లు 5 ఫోర్లు కొట్టారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు దుబాయ్‌లోని భారత్, పాక్ అభిమానులు ఊహించని స్థాయిలో పోటెత్తడంతో మైదానం నిండిపోయింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: మునీబా (స్టంప్డ్) రిచా (బి) శ్రేయాంక 17; గుల్ ఫిరోజా (బి) రేణుక 0; సిద్రా అమిన్ (బి) దీప్తి శర్మ 8; ఒమైమా (సి) షఫాలీ (బి) అరుంధతి 3; నిదా దర్ (బి) అరుంధతి 28; ఆలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) అరుంధతి 4; ఫాతిమా (సి) రిచా (బి) ఆశ శోభన 13; తుబా హసన్ (సి) షఫాలీ (బి) శ్రేయాంక 0; సైదా (నాటౌట్) 14; నష్రా సంధు (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 105. వికెట్ల పతనం: 1–1, 2–25, 3–33, 4–41, 5–52, 6–70, 7–71, 8–99. బౌలింగ్: రేణుక 4–0–23 –1, దీప్తి 4–0–24–1, అరుంధతి 4–0–19–3, శ్రేయాంక 4–1–12–2, ఆశ శోభన 4–0–24–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) ఆలియా (బి) ఒమైమా 32; స్మృతి (సి) తుబా (బి) సాదియా 7; జెమీమా (సి) మునీబా (బి) ఫాతిమా 23; హర్మన్‌ప్రీత్ (రిటైర్డ్‌హర్ట్) 29; రిచా (సి) మునీబా (బి) ఫాతిమా 0; దీప్తి శర్మ (నాటౌట్) 7; సజన (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 108. వికెట్ల పతనం: 1–18, 2–61, 3–80, 4–80. బౌలింగ్: ఫాతిమా 4–0–23–2, సాదియా 4–0–23–1, నిదా దర్ 1.5–0–10–0, ఒమైమా 3–0–17–1, నష్రా సంధు 4–0–21–0, తుబా హసన్ 2–0–14–0. -
ఇంగ్లండ్ జయభేరి
షార్జా: ఇంగ్లండ్ స్థాయికి సరితూగని బంగ్లాదేశ్ బౌలింగ్‌లో మెరిసింది. కలిసొచ్చిన పిచ్‌పై మాజీ చాంపియన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ రెండాకులు ఎక్కువే తిన్న ఇంగ్లండ్ బౌలర్లు బౌలింగ్‌కు అనుకూలించే వికెట్‌పై నిప్పులు చెరగడంతో మహిళల టి20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆరంభించింది. గ్రూప్ ‘బి’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులే చేయగలిగింది. ఆరంభం అదిరినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానీ వ్యాట్ (40 బంతుల్లో 41; 5 ఫోర్లు), మయా బౌచర్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు) మంచి ఆరంభమే ఇచ్చారు. 48 పరుగుల వద్ద బౌచర్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ గతి తప్పింది. మరో ఓపెనర్ డానీ వ్యాట్ మినహా నట్ సీవర్ బ్రంట్ (2), కెప్టెన్ హీథెర్ నైట్ (6), అలైస్ క్యాప్సీ (9)లను స్వల్ప వ్యవధిలో బోల్తా కొట్టించిన బంగ్లా బౌలర్లు ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ల తర్వాత ఎమీ జోన్స్ (12 నాటౌట్) ఒక్కరిదే రెండంకెల స్కోరు! శోభన పోరాడినా... బంగ్లా ముందున్న లక్ష్యం చిన్నదే. కానీ ప్రత్యర్థి కష్టమైంది. బౌలింగ్ క్లిష్టమైంది. దీంతో బంగ్లా బ్యాటర్ల ఆటలేమి సాగలేదు. వన్‌డౌన్ బ్యాటర్ శోభన మోస్తరి (48 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (15) కూడా ప్రభావం చూపకపోగా, ఇతర బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడంతో ఓవర్లు గడుస్తున్న కొద్దీ బంగ్లా లక్ష్యానికి దూరమైంది. లిన్సే స్మిత్ (2/11), చార్లీ డీన్ (2/22) ప్రత్యరి్థని దెబ్బ తీశారు. -
T20 World Cup: భారత్ వర్సెస్ పాకిస్తాన్
దుబాయ్: ఒకే ఒక్క పరాజయం... భారీ తేడాతో ఎదురైన చేదు ఫలితం... ఇప్పుడు భారత మహిళల జట్టుకు టి20 ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ అగ్నిపరీక్ష పెట్టబోతోంది. నేడు జరిగే మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడుతున్న హర్మన్‌ప్రీత్ సేన బోణీ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్‌తో పోల్చుకుంటే పాక్ పెద్ద పోటీ జట్టు కాదు. కానీ ఇది పొట్టి ఫార్మాట్! ఏదైనా జరగొచ్చు. ఈ నేపథ్యంలో నిలకడ లోపించిన హర్మన్‌సేన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా లాంటి గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొనే ముందు తప్పకుండా పాక్‌ను భారీ తేడాతో మట్టికరిపించాల్సివుంటుంది. అప్పుడే కివీస్‌తో తొలి మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఎదురైన ఓటమి ప్రభావం కనిపించకుండా ముందంజ వేసేందుకు కనీస అవకాశాలు ఉంటాయి. పైగా ఈ గ్రూప్ ‘ఎ’లో కివీస్, ఆసీస్, పాక్ విజయాలతో ఉంటే వరుస పరాజయాలతో శ్రీలంక రేసుకు దూరమైంది. ఇప్పుడు రేసులో నిలవాలంటే భారత జట్టు పాక్, లంకలపై భారీ విజయాలు సాధించాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని హర్మన్‌సేన్ వెంటనే తమ లోపాలను సరిదిద్దుకొని ముందడుగు వేయాలి. ముఖ్యంగా నిలకడ లోపించిన బ్యాటింగ్ ఆర్డర్ గాడిన పడాలి. ఓపెనర్లు షఫాలీ, స్మృతిలు మెరుపు ఆరంభం అందిస్తే మూడో స్థానంలో ఉన్న హర్మన్ కౌర్ దానిని కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జెమీమా, రిచా ఘోష్ కీలకం కానున్నారు. కివీస్‌తో మ్యాచ్‌లో ఒక అదనపు బౌలర్‌ను తీసుకోవడంతో బ్యాటింగ్ మరీ బలహీనంగా మారిపోయింది. దీనిని బట్టి ఈ మ్యాచ్ కోసం వ్యూహాల్లో మార్పు ఉండవచ్చు. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించాలి. ప్రతి మ్యాచ్‌లోనూ సమష్టిగా పోరాడితేనే భారత్ ఈ గ్రూపు నుంచి నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు లంకను ఓడించిన పాకిస్తాన్‌కు భారత్ క్లిష్టమైన ప్రత్యర్థే! అలాంటి జట్టుపై గెలిస్తే మాత్రం ప్రపంచకప్ గెలిచినంత సంబరం గ్యారంటీ. దీంతో గెలిచేందుకు పాక్ శక్తికి మించిన పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రేక్షకుల కూడా పెద్ద సంఖ్యలో ఈ మహిళల మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పోరు కోసం 12 వేల టికెట్లు అమ్ముడవడం విశేషం. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అరుంధతి, పూజ, శ్రేయాంక, ఆశ శోభన, రేణుక. పాకిస్తాన్: ఫాతిమా సన (కెప్టెన్), మునీబా, గుల్ ఫిరోజా, సిద్రా అమిన్, ఒమైమా, నిదా దర్, తుబా హసన్, అలియా, దియాన బేగ్, నష్రా సంధు, సాదియా. -
WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు
ప్రపంచకప్‌కు ముందు ఈ ఏడాది ఆడిన 13 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఒకటే గెలవగా... 17 మ్యాచ్‌ల్లో 11 గెలిచిన భారత్ ఫేవరెట్‌గా అడుగు పెట్టింది. కానీ అసలు సమయంలో మాత్రం టీమిండియా చేతులెత్తేసి టోర్నీని ఓటమితో మొదలు పెట్టింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో కివీస్ మెరుగైన స్కోరు సాధించే అవకాశం కల్పించిన మన మహిళలు... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పూర్తిగా తడబడ్డారు. టాప్–5 స్మృతి, హర్మన్, షఫాలీ, జెమీమా, రిచా సమష్టిగా విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. దుబాయ్: తొలి వరల్డ్ కప్ గెలిచే లక్ష్యంతో ఉత్సాహంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు తొలి పోరులోనే షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... ఓపెనర్లు జార్జియా ప్లిమ్మర్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), సుజీ బేట్స్ (24 బంతుల్లో 27; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ (15)దే అత్యధిక స్కోరు. రేపు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. రాణించిన ఓపెనర్లు న్యూజిలాండ్ ఓపెనర్లు ప్లిమ్మర్, బేట్స్ జట్టుకు ఘనమైన ఆరంభం అందించారు. పూజ వేసిన తొలి ఓవర్లో బేట్స్ రెండు ఫోర్లు కొట్టగా, దీప్తి ఓవర్లో ప్లిమ్మర్ ఫోర్, సిక్స్ బాదింది. అరుంధతి తొలి ఓవర్లో ప్లిమ్మర్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 55 పరుగులకు చేరింది. ఇదే ఓవర్లో బేట్స్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ రిచా వదిలేసింది. వీరిద్దరిని నిలువరించేందుకు ఇబ్బంది పడిన భారత బౌలర్లకు ఎట్టకేలకు ఎనిమిదో ఓవర్లో తొలి వికెట్ దక్కింది. మొదటి వికెట్‌కు 46 బంతుల్లో 67 పరుగులు జోడించిన ఓపెనర్లు ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. ఆ తర్వాత అమేలియా కెర్ (13) ప్రభావం చూపలేదు కానీ డివైన్ దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఆశ శోభన, రేణుక ఓవర్లలో డివైన్ రెండేసి ఫోర్లు కొట్టగా... ఆమె, హ్యాలీడే (16) కలిసి దీప్తి ఓవర్లో మూడు ఫోర్లతో 16 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మరో ఫోర్‌తో డివైన్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. టపటపా... మ్యాచ్ గెలవాలంటే వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక ఛేదన రికార్డును నమోదు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. కార్సన్ తన తొలి రెండు ఓవర్లలో షఫాలీ వర్మ (2), స్మృతి మంధాన (12)లను వెనక్కి పంపించగా... మూడో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్ కూడా విఫలమైంది. అంపైర్ ఎల్బీ నిర్ణయాన్ని ఆమె సవాల్ చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత జెమీమా (13) కూడా ప్రభావం చూపలేకపోయింది. 11వ ఓవర్ చివరికి బంతి రిచా ఘోష్ (12) రూపంలో తమ ఐదో వికెట్ కోల్పోయిన భారత్ ఆ తర్వాత ఓటమి దిశగా సాగిపోయింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) శ్రేయాంక (బి) అరుంధతి 27; ప్లిమ్మర్ (సి) స్మృతి (బి) శోభన 34; అమేలియా కెర్ (సి) పూజ (బి) రేణుక 13; డివైన్ (నాటౌట్) 57; హ్యాలీడే (సి) స్మృతి (బి) రేణుక 16; గ్రీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–67, 2–67, 3–99, 4–145. బౌలింగ్: పూజ వస్త్రకర్ 1–0–9–0, రేణుకా సింగ్ 4–0–27–2, దీప్తి శర్మ 4–0–45–0, అరుంధతి రెడ్డి 4–0–28–1, ఆశా శోభన 4–0–22–1, శ్రేయాంక పాటిల్ 3–0–25–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) గ్రీన్ (బి) కార్సన్ 12; షఫాలీ (సి అండ్ బి) కార్సన్ 2; హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) (బి) రోజ్మేరీ 15; జెమీమా (సి) గ్రీన్ (బి) తహుహు 13; రిచా (సి) డివైన్ (బి) తహుహు 12; దీప్తి (సి) డివైన్ (బి) తహుహు 13; అరుంధతి (సి) బేట్స్ (బి) రోజ్మేరీ 1; పూజ (బి) కెర్ 8; శ్రేయాంక (సి) (సబ్) పెన్ఫోల్డ్ (బి) రోజ్మేరీ 7; శోభన (నాటౌట్) 6; రేణుక (సి) డివైన్ (బి) రోజ్మేరీ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–42, 4–55, 5–70, 6–75, 7–88, 8–90, 9–102, 10–102. బౌలింగ్: జెస్ కెర్ 3–0–13–0, ఈడెన్ కార్సన్ 4–0–34–2, రోజ్మేరీ 4–0–19–4, అమేలియా కెర్ 4–0–19–1, తహుహు 4–0–15–3. -
బోణీ బాగుండాలి
దుబాయ్: తొమ్మిదో ప్రయత్నంలోనైనా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్ టైటిల్ వేటను నేడు ఆరంభించనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ (2020లో) చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం కొత్త చరిత్ర తిరగరాయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలతో ఉంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. గత ఏడాది వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ఈసారి కప్‌తో తిరిగి రావాలంటే శుభారంభం లభించాలి. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించగా... ఇప్పుడు అదే బాటలో తొలిసారి ‘విశ్వ కిరీటం’ దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్ జట్టు తహతహలాడుతోంది. టి20 ఫార్మాట్లో ప్రపంచకప్ ప్రవేశ పెట్టినప్పటి (2009) నుంచి భారత జట్టులో కొనసాగుతున్న 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్... జట్టును ఎలా నడిపిస్తుందనేది ఆసక్తికరం. టాపార్డర్ రాణిస్తేనే! అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం గెలుపు గీత దాటలేకపోతోంది. ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడం, ఆటలో కీలక దశలో పట్టు సడలించడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇటీవల ఆసియా కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... శ్రీలంకతో ఫైనల్లో అనూహ్యంగా తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో లోపాలను గుర్తించిన కోచింగ్ బృందం జట్టుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్లేయర్ల ఫిట్నెస్, ఫీల్డింగ్‌ను మరింత సానబెట్టింది. అదే సమయంలో మానసిక దృఢత్వం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన స్మృతి మంధాన ఆసియా కప్‌లో అదరగొట్టింది. స్మతి అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఆమెతో పాటు మిగిలిన ప్లేయర్లు సత్తా చాటాల్సిన అవసరముంది. భారత్‌ను పోలి ఉండే దుబాయ్, షార్జా పిచ్‌లపై మన స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుంది. దీప్తి శర్మపై భారీ అంచనాలు ఉండగా... శ్రేయాంక, ఆశ శోభన, రాధ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. సమతూకంగా న్యూజిలాండ్... న్యూజిలాండ్ జట్టు అటు అనుభవజ్ఞులు ఇటు యంగ్ ప్లేయర్లతో సమతూకంతో ఉంది. కెపె్టన్ సోఫీ డివైన్, టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సుజీ బేట్స్ (36 మ్యాచ్‌ల్లో 1066 పరుగులు), లీ తహుహూ, అమెలియా కెర్‌లతో కివీస్ జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండుసార్లు (2009, 2010) రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఈసారైనా చాంపియన్‌గా అవతరించాలని భావిస్తోంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోరీ్నలో లీగ్ దశలో ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో తలపడనుంది. దీంతో ప్రతి మ్యాచ్ కీలకమే కాగా... లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ శ్రీలంక ఉన్నాయి. దుబాయ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ అమెలియా కెర్ న్యూజిలాండ్ జట్టుకు కీలకం కానుంది. తుది జట్లు (అంచనా) భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రేణుక, రాధ యాదవ్, ఆశ శోభన. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమెలియా కెర్, బ్రూక్ హ్యాలీడే, మ్యాడీ గ్రీన్, ఇజీ గేజ్, కాస్పెరెక్, జెస్ కెర్, లీ తహుహూ, ఈడెన్ కార్సన్, రోస్‌మేరీ మైర్. 4 న్యూజిలాండ్ జట్టుతో భారత్ ఇప్పటి వరకు 13 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టి20 ప్రపంచకప్‌లో రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. గత రెండు ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌పై భారతే గెలిచింది.4/4 భారత జట్టు ఆడిన ఎనిమిది ప్రపంచకప్‌లలో తొలి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. తర్వాతి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. తొమ్మిదోసారి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. -
ఎవరిదో కిరీటం!
ధనాధన్ ఫార్మాట్లో విశ్వ కిరీటం కోసం మహిళల క్రికెట్ జట్లు మహా సమరానికి సిద్ధమయ్యాయి. టి20ల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఆస్ట్రేలియా... అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ను ఈసారైనా సొంతం చేసుకునేందుకు భారత్... రెండోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్... అంచనాలను తలకిందులు చేసి సంచలనం సృష్టించాలనే లక్ష్యంతో న్యూజిలాండ్... నేటి నుంచి మొదలయ్యే టి20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాయి. 18 రోజుల పాటు సాగనున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా... ఈసారి అస్త్రశ్రస్తాలతో సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత పురుషుల జట్టు ఇటీవల టి20 ప్రపంచకప్ నెగ్గగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా అలాంటి ఆటతీరుతోనే అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు! దుబాయ్: క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల టి20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్‌కు నేడు తెర లేవనుంది. ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... తొలిసారి ‘విశ్వ విజేత’ హోదా దక్కించుకోవాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 8 ప్రపంచకప్‌లలోనూ పాల్గొన్న టీమిండియా ఒక్కసారి (2020లో) రన్నరప్‌గా నిలిచింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా భారత జట్టు భారీ అంచనాలతో బరిలో దిగనుంది. షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా... ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చారు. పోటీల్లో భాగంగా గురువారం తొలి రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి పోరులో స్కాట్లాండ్తో బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడతాయి. శుక్రవారం న్యూజిలాండ్‌తో పోరుతో హర్మన్‌ప్రీత్ బృందం టైటిల్ వేట ప్రారంభించనుంది. ఎదురులేని ఆ్రస్టేలియా 2009లో తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిదిసార్లు ఈ టోర్నీ జరిగింది. ఆ్రస్టేలియా రికార్డు స్థాయిలో ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023లో) విజేతగా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండటం... చివరి బంతి వరకు ఓటమిని ఒప్పుకోని తత్వం ఆస్ట్రేలియా జట్టును మిగిలిన వాటికంటే భిన్నంగా నిలిపింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆ్రస్టేలియాపై అడపా దడపా విజయాలు సాధించిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ వంటి జట్లు... వరల్డ్ కప్‌లో మాత్రం ఆసీస్ ముందు నిలువలేకపోతున్నాయి. గత టోర్నీలో ఆ్రస్టేలియా జట్టుకు మెగ్‌లానింగ్ సారథ్యం వహించగా... తాజా టోరీ్నలో అలీసా హీలీ జట్టును నడిపించనుంది. ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, ఎలీస్ పెరీ, బెత్ మూనీ వంటి ప్లేయర్లతో ఆ్రస్టేలియా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరంతా కలిసి కట్టుగా కదం తొక్కితే ఆసీస్ మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’లో ఉంది. ఇంగ్లండ్ మెరిపించేనా? తొలి మహిళల ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మరోసారి చాంపియన్ కాలేకపోయింది. మరో మూడుసార్లు (2012, 2014, 2018లో) ఫైనల్‌కు చేరినా... ఆ్రస్టేలియా అడ్డంకిని అధిగమించ లేకపోయింది. సోఫీ ఎకెల్‌స్టోన్, కెప్టెన్ హీతర్ నైట్, అలీస్ కాప్సీ, అమీ జోన్స్, నటాలియా బ్రంట్, డానీ వ్యాట్‌తో కూడిన ఇంగ్లండ్ జట్టు తమదైన రోజున ఎంతటి మేటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలదు. బంగ్లాదేశ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో కలిసి ఇంగ్లండ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనుంది. ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయిన దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలని చూస్తోంది. 2009, 2010లలో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక ఇటీవల మహిళల ఆసియాకప్‌లో భారత జట్టుకు షాక్ ఇచ్చి చాంపియన్‌గా అవతరించిన శ్రీలంక సంచలన ప్రదర్శన కొనసాగించాలని భావిస్తోంది. హర్మన్ సేన సాధించేనా? అంతర్జాతీయ క్రికెట్లో నిలకడైన విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టుకు ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలాగే ఊరిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమిండియా... మెగా టోర్నీల్లో విజేతగా నిలవలేకపోతోంది. గత ఎనిమిది టోర్నీల్లోనూ పాల్గొన్న భారత్ కేవలం ఒక్కసారి (2020లో) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. భారత్‌ను పోలి ఉన్న యూఏఈలో టోర్నీ జరుగుతుండటం భారత్‌కు సానుకూలాంశం. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ప్రపంచకప్‌లలోనూ ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అంచనాల ఒత్తిడి అధికంగా ఉంది. వైస్ కెపె్టన్ స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమష్టిగా సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ఓటమి అనంతరం ప్రత్యేక శిబిరంలో ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై మరింత సాధన చేసిన హర్మన్ ప్రీత్ బృందం ఈ టోర్నీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి! -
టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల టీ20 ప్రపంచకప్-2024, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ఎంపికైంది. అదే విధంగా ఈ జట్టులో సీనియర్ క్రికెటర్ సుజీ బేట్స్‌కు కూడా చోటు దక్కింది. గత కొంత కాలంగా గాయం కారణంగా దూరంగా ఉంటున్న ఎక్స్‌ప్రెస్ పేసర్ రొస్మేరీ మైర్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఆమె రాకతో వైట్ ఫెర్న్(న్యూజిలాండ్ మహిళల జట్టు) బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. లీ కాస్పెరెక్, మెలీ కెర్, ఫ్రాన్ జోనాస్, ఈడెన్ కార్సన్ వంటి స్పిన్నర్లకు సైతం వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి యూఎఈ వేదికగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న భారత్‌తో తలపడనుంది.కాగా టీ20 వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గోనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి 24 మధ్య జరగనుంది. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ కసం యూఏఈకు వైట్ ఫెర్న్స్ బయలదేరనున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత సోఫీ డివైన్ కెప్టెన్సీకి విడ్కోలు పలకనుంది.న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్ (వికెట్ కీపర్), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, మెలీ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహుచదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్ -
న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్ తర్వాత?
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనట్లు డివైన్ ప్రకటించింది. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు సోఫీ తెలిపింది.తన వర్క్‌లోడ్‌ను తగ్గించుకునేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. కాగా డివైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండువ మహిళ క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. డివైన్ ఇప్పటివరకు 135 టీ20లు ఆడి 3268 పరుగులు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రంలో తన మార్క్‌ను డివైన్ చూపించలేకపోయింది. తన సారథ్యంలో ఇప్పటివరకు 56 టీ20లు న్యూజిలాండ్.. 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 28 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది."రెండు ఫార్మాట్లలో వైట్ ఫెర్న్ల(న్యూజిలాండ్ మహిళల జట్టు)కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కెప్టెన్సీతో అదనపు పనిభారం పడుతోంది. దాన్ని నేను ఆస్వాదించాను. కానీ కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా ఉంటుంది. కెప్టెన్సీ కారణంగా నా వ్యక్తిగత ప్రదర్శనలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. రెండూ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. దీంతో టీ20 కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నా ఆటపై మరింత దృష్టి సారిస్తాను.కొత్తగా ఎవరు జట్టు బాధ్యతలను చేపట్టిన వారికి అన్నిరకాలగా సపోర్ట్‌గా ఉంటాను. అయితే వన్డేల్లో మాత్రం సారథిగా కొనసాగుతున్నాను. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి మరి కొంత సమయం పడుతోందని" ఓ ప్రకటలో డివైన్ పేర్కొంది. -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన