WT20 WC: విండీస్‌ మహిళల ధనాధన్‌ విక్టరీ | Womens T20 World Cup: West Indies Won By 8 Wickets Against Bangladesh, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

WT20 WC BAN Vs WI: విండీస్‌ మహిళల ధనాధన్‌ విక్టరీ

Published Fri, Oct 11 2024 2:39 AM | Last Updated on Fri, Oct 11 2024 1:15 PM

West Indies won by 8 wickets against Bangladesh

104 పరుగుల లక్ష్యం 12.5 ఓవర్లలోనే ఉఫ్‌

బంగ్లాదేశ్‌పై 8 వికెట్లతో జయభేరి  

దుబాయ్‌: వెస్టిండీస్‌ మహిళల ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు బంగ్లాదేశ్‌ బెంబేలెత్తిపోయింది. దీంతో టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ నెగ్గిన కరీబియన్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కెప్టెన్‌ నిగర్‌ సుల్తానా (39; 4 ఫోర్లు) మాత్రమే రాణించింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్పిన్నర్‌ కరిష్మా రమ్‌హరక్‌ (4–0–17–4) ఉచ్చులో బంగ్లా బ్యాటర్లంతా కుదేలయ్యారు. అఫీ ఫ్లెచర్‌ 2 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 12.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేసి గెలిచింది. 

కెప్టెన్ , ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (22 బంతుల్లో 34; 6 ఫోర్లు), స్టెఫానీ టేలర్‌ (29 బంతుల్లో 27 రిటైర్డ్‌హర్ట్‌; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 52 పరుగులు జోడించి శుభారంభమిచ్చారు.షెర్మయిన్‌  (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), డియాండ్రా డాటిన్‌ (7 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మిగతా పనిని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో నహిదా అక్తర్, మారుఫా అక్తర్‌ చెరో వికెట్‌ తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement