మహిళల టీ20 ప్రపంచకప్-2024, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ఎంపికైంది. అదే విధంగా ఈ జట్టులో సీనియర్ క్రికెటర్ సుజీ బేట్స్‌కు కూడా చోటు దక్కింది.
గత కొంత కాలంగా గాయం కారణంగా దూరంగా ఉంటున్న ఎక్స్‌ప్రెస్ పేసర్ రొస్మేరీ మైర్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఆమె రాకతో వైట్ ఫెర్న్(న్యూజిలాండ్ మహిళల జట్టు) బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది.
లీ కాస్పెరెక్, మెలీ కెర్, ఫ్రాన్ జోనాస్, ఈడెన్ కార్సన్ వంటి స్పిన్నర్లకు సైతం వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి యూఎఈ వేదికగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న భారత్‌తో తలపడనుంది.
కాగా టీ20 వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గోనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి 24 మధ్య జరగనుంది. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ కసం యూఏఈకు వైట్ ఫెర్న్స్ బయలదేరనున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత సోఫీ డివైన్ కెప్టెన్సీకి విడ్కోలు పలకనుంది.
న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్ (వికెట్ కీపర్), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, మెలీ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు
చదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment