Sophie Devine
-
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో..పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్‌లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్‌లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్‌లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్‌స్పిన్నర్ ఈడెన్ కార్సన్‌లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల టీ20 ప్రపంచకప్-2024, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ఎంపికైంది. అదే విధంగా ఈ జట్టులో సీనియర్ క్రికెటర్ సుజీ బేట్స్‌కు కూడా చోటు దక్కింది. గత కొంత కాలంగా గాయం కారణంగా దూరంగా ఉంటున్న ఎక్స్‌ప్రెస్ పేసర్ రొస్మేరీ మైర్ తిరిగి జట్టులోకి వచ్చింది. ఆమె రాకతో వైట్ ఫెర్న్(న్యూజిలాండ్ మహిళల జట్టు) బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. లీ కాస్పెరెక్, మెలీ కెర్, ఫ్రాన్ జోనాస్, ఈడెన్ కార్సన్ వంటి స్పిన్నర్లకు సైతం వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి యూఎఈ వేదికగా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న భారత్‌తో తలపడనుంది.కాగా టీ20 వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గోనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి 24 మధ్య జరగనుంది. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ కసం యూఏఈకు వైట్ ఫెర్న్స్ బయలదేరనున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత సోఫీ డివైన్ కెప్టెన్సీకి విడ్కోలు పలకనుంది.న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్ (వికెట్ కీపర్), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, మెలీ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహుచదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్ -
న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్ తర్వాత?
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనట్లు డివైన్ ప్రకటించింది. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు సోఫీ తెలిపింది.తన వర్క్‌లోడ్‌ను తగ్గించుకునేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. కాగా డివైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండువ మహిళ క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. డివైన్ ఇప్పటివరకు 135 టీ20లు ఆడి 3268 పరుగులు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రంలో తన మార్క్‌ను డివైన్ చూపించలేకపోయింది. తన సారథ్యంలో ఇప్పటివరకు 56 టీ20లు న్యూజిలాండ్.. 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 28 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది."రెండు ఫార్మాట్లలో వైట్ ఫెర్న్ల(న్యూజిలాండ్ మహిళల జట్టు)కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కెప్టెన్సీతో అదనపు పనిభారం పడుతోంది. దాన్ని నేను ఆస్వాదించాను. కానీ కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా ఉంటుంది. కెప్టెన్సీ కారణంగా నా వ్యక్తిగత ప్రదర్శనలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. రెండూ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. దీంతో టీ20 కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నా ఆటపై మరింత దృష్టి సారిస్తాను.కొత్తగా ఎవరు జట్టు బాధ్యతలను చేపట్టిన వారికి అన్నిరకాలగా సపోర్ట్‌గా ఉంటాను. అయితే వన్డేల్లో మాత్రం సారథిగా కొనసాగుతున్నాను. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి మరి కొంత సమయం పడుతోందని" ఓ ప్రకటలో డివైన్ పేర్కొంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ వుమెన్ తొలిసారి తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండడంతో పాటు రన్‌రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలన్నా.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్న కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఆర్సీబీది. అందుకే కీలకమ్యాచ్‌లో తొలిసారి జూలు విదిల్చింది. ముఖ్యంగా సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆమె విధ్వంసానికి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. బంతి పడిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డివైన్ 36 బంతుల్లోనే 9ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసింది. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఔటైన డివైన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి ఉంటే చరిత్రకెక్కేది. ఎందుకంటే మహిళల క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ డీజెఎస్ డొట్టిన పేరిట ఉంది. ఆమె 38 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత అలీసా హేలీ 46 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యూమౌంట్ 47 బంతుల్లో, నాలుగో స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుంది. కానీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సోఫీ డివైన్ అరుదైన ఫీట్‌ను మిస్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. Devine power at play ⚡ #GGvRCB #CheerTheW | @RCBTweets pic.twitter.com/YOi84P4tLB — JioCinema (@JioCinema) March 18, 2023 .@RCBTweets register their second win in a row 😍#CheerTheW #TATAWPL #GGvRCB pic.twitter.com/SHz3eh9sRA — JioCinema (@JioCinema) March 18, 2023 చదవండి: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్ సూపర్ సోఫీ... ఆర్సీబీ వరుసగా రెండో విజయం -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్‌లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్‌గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్‌స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో టీమిండియా ప్లేయర్ల హవా
ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ.. వన్‌డౌన్‌లో సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆతర్వాతి స్థానాలకు ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్, భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్ (భారత్)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం. -
36 బంతుల్లోనే శతకం...ఫాస్టెస్ట్ రికార్డు
డ్యునెడిన్: న్యూజిలాండ్ మహిళల క్రికెట్ టి20 టోర్నమెంట్లో వెల్లింగ్టన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సోఫీ డివైన్ (38 బంతుల్లో 108 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) రికార్డు సెంచరీతో అదరగొట్టింది. 36 బంతుల్లోనే సెంచరీ బాది మహిళల టి20 క్రికెట్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొలి్పంది. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ ప్లేయర్ డియోండ్ర డాటిన్ (38 బంతుల్లో దక్షిణాఫ్రికాపై 2010లో) పేరిట ఉండేది. (లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్) డివైన్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఒటాగో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వెల్లింగ్టన్ జట్టు 10 వికెట్లతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత ఒటాగో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. అనంతరం వెల్లింగ్టన్ జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 131 పరుగులు చేసి గెలుపొందింది. కెపె్టన్ మ్యాడీ గ్రీన్ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) రాణించింది. తాజా శతకంతో సోఫీ డివైన్ మహిళల టి20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు (6) చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. సుజీ బేట్స్ (న్యూజిలాండ్–5), అలీసా హీలీ (ఆస్ట్రేలియా–5) రెండో స్థానానికి పడిపోయారు. (పంత్ మొత్తుకున్నా నమ్మలేదు..)