ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు.
ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు.
ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్‌లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్‌లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది.
బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్‌లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment