మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 17) జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది.
Literally every RCB fan. #DCvRCB pic.twitter.com/y8l9eUAR3K
— Yolo247 (@Yolo247Official) March 17, 2024
డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌కు చేరడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండోసారి కాగా.. ఆర్సీబీ తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్రం సీజన్‌లో (2023) కేవలం రెండే విజయాలతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆర్సీబీ.. ప్రస్తుత సీజన్‌లో గ్రూప్ దశలో నాలుగు విజయాలు, కీలకమైన ఎలిమినేటర్‌లో ముంబైపై విజయంతో మొత్తంగా ఐదు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది.
ఐపీఎల్ (2009, 2011, 2016), డబ్ల్యూపీఎల్ (2024), ఛాంపియన్స్ టీ20 లీగ్‌లతో (2011) కలిపి ఐదోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఫైనల్‌కు చేరింది. ఆర్సీబీ చివరిసారిగా 2016 ఐపీఎల్ ఎడిషన్‌లో ఫైనల్స్ ఆడింది. నాటి ఫైనల్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఆర్సీబీ మరోసారి ఫైనల్‌కు చేరింది. మరి ఈ సారి ఫైనల్లోనైనా ఆర్సీబీ విజయం సాధించి తమ టైటిల్ దాహానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment