డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా? | WPL 2024 Winner is RCB: Awards, Orange, Purple Cap Winner, Cash Prize | Sakshi
Sakshi News home page

WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

Mar 18 2024 7:35 AM | Updated on Mar 18 2024 10:43 AM

WPL 2024 Winner is RCB: Awards, Orange, Purple Cap Winner, Cash Prize - Sakshi

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. 

అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కుప్పకూలింది.

ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 4 వికెట్లతో అదరగొట్టగా.. మోలినెక్స్ 3, ఆశ శోభన 2 రెండో వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప ల‍క్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

తొలి టైటిల్‌ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన ఫ్రైజ్‌ మనీ ఎంత? ఆరెంజ్‌ క్యాప్‌ ఎవరికి దక్కింది? ఇటువంటి విషయాలపై ఓ లూక్కేద్దం.

విజేతకు ఎంతంటే?
డబ్ల్యూపీఎల్‌ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

ఆరెంజ్‌ క్యాప్‌ విజేత పెర్రీ..
ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీ ఆరెంజ్ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్‌ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది.

పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌ శ్రేయంక
అదేవిధంగా  అత్యధిక ఈ ఏడాది సీజన్‌లో వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్‌ శ్రేయంక పాటిల్‌ పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్‌ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది.

మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే..
ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌-దీప్తి శర్మ
ఎమర్జింగ్‌ ప్లేయర్‌  - శ్రేయాంక పాటిల్‌ (బెంగళూరు) 
మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌  - దీప్తి శర్మ (యూపీ) 
బెస్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద టోర్నీ - సజన సజీవన్‌ (ముంబై) 
ఫెయిర్‌ ప్లే టీమ్‌ - రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement