మెరుపులు మెరిపించిన మంధన.. ఆర్సీబీ భారీ స్కోర్‌ | WPL 2024: Mandhana 80 Runs Blast, RCB Scored 198 For 3 In A Match Vs UP Warriorz | Sakshi
Sakshi News home page

WPL 2024: మెరుపులు మెరిపించిన మంధన.. ఆర్సీబీ భారీ స్కోర్‌

Published Mon, Mar 4 2024 9:32 PM | Last Updated on Tue, Mar 5 2024 8:54 AM

WPL 2024: Mandhana 80 Runs Blast, RCB Scored 198 For 3 In A Match Vs UP Warriorz - Sakshi

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధన మెరుపులు మెరిపించింది. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనకు ఎల్లిస్‌ పెర్రీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సబ్బినేని మేఘన (28), రిచా ఘోష్‌ (21 నాటౌట్‌) కూడా మెరుపులు మెరిపించారు. వారియర్జ్‌ బౌలర్లలో దీప్తి శర్మ, అంజలి శర్వాణి, సోఫీ ఎక్లెస్టోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్‌.. రేణుక సింగ్‌ వేసిన తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఆతర్వాత రెండు ఓవర్లలో మాత్రం వారియర్జ్‌ ఓపెనర్లు అలైసా హీలీ (13), కిరణ్‌ నవ్‌గిరే (17) రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో వారియర్జ్‌ 3 ఓవర్లలో 40 పరుగులు చేసింది. తొలి ఓవర్‌ మొయిడిన్‌గా మలిచిన రేణుకా సింగ్‌, ఆతర్వాతి ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకుంది. 

కారు అద్దాలు పగలగొట్టిన పెర్రీ..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement