లీగ్ క్రికెట్‌లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న తుది సమరంలో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోవడంతో 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..?
ఆర్సీబీ ఐదోసారి ((2009, 2011, 2016 ) ఐపీఎల్, 2011 ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.
తాజాగా జరుగుతున్న ఫైనల్లో కూడా ఆర్సీబీ ఛేజింగే చేస్తుండటంతో ఈసారైనా టైటిల్ గెలుస్తుందా అని ఆ జట్టు అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితులను (113 పరుగులకే ఆలౌటైన ఢిల్లీ) బట్టి చూస్తే.. ఆర్సీబీ చరిత్ర తిరగరాసి తొలి టైటిల్ గెలిచేలా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment