ఐపీఎల్‌లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై దాదాపుగా ఆశలు వదులుకున్న పంజాబ్ కింగ్స్.. ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న ఆర్సీబీని ఢీకొట్టనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇరు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలన్నా ఈ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లన్నీ (రెండు) భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇలా జరిగినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీ లేదు. ఫైనల్ ఫోర్ రేసులో ఉన్న మిగతా జట్ల జయాపజయాలపై ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ 11 మ్యాచ్‌లు ఆడి చెరి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. పంజాబ్‌తో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఆర్సీబీ -0.049 రన్‌రేట్ కలిగి ఉండగా.. పంజాబ్‌కు -0.049 ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ తరువాత ముంబై, గుజరాత్‌లతో తలపడాల్సి ఉండగా..పంజాబ్ ఈ మ్యాచ్ తర్వాత పటిష్టమైన రాజస్థాన్, సన్‌రైజర్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది.
పంజాబ్‌తో పోలిస్తే ఆర్సీబీ కాస్త బలహీనమైన ప్రత్యర్దులతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్‌తో పాటు ముంబై, గుజరాత్‌లపై భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు ఖాతాలో ఉండి సీఎస్‌కే (12), ఢిల్లీ (12), లక్నోలతో (12) ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడే అవకాశం ఉంది.
ఢిల్లీ, లక్నో ఇంకా రెండ్రెండు మ్యాచ్‌లు, సీఎస్‌కే మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ (16), రాజస్థాన్ (16) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ బెర్తులను దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్ (14).. సీఎస్‌కే, ఢిల్లీ, లక్నోల కంటే కాస్త మెరుగైన స్థానంలో ఉంది.
సన్‌రైజర్స్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచిన ప్లే ఆఫ్స్ మూడో బెర్త్ ఆ జట్టు వశమే అవుతుంది. అప్పుడు మిగిలిన నాలుగో బెర్త్ కోసం సీఎస్‌కే, ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడాల్సి ఉంటుంది. నిన్న లక్నోపై సన్‌రైజర్స్ భారీ విజయం సాధించడంతో ఈ సీజన్‌లో ముంబై పోరాటం అధికారికంగా ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా వాటి ఫలితంతో సంబంధం లేకుండా లీగ్ నుంచి నిష్క్రమించింది.
తుది జట్లు (అంచనా)..
పంజాబ్: జానీ బెయిర్‌స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ [ఇంపాక్ట్ సబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్]
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, మహ్మద్ సిరాజ్ [ఇంపాక్ట్ సబ్: రజత్ పాటిదార్]
Comments
Please login to add a commentAdd a comment