Alzarri Joseph
-
రూ.11 కోట్లు తీసుకున్నాడు.. ఆర్సీబీని నిండా ముంచేశాడు!
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన జోసెఫ్.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 17.00 ఎకానమితో ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్.. జోసెఫ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడు వేసిన తొలి ఓవర్లోనే 2 సిక్స్‌లు బాది తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన జోసెఫ్ కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి ఇంకా ఛాన్స్‌లు కల్పిస్తున్న ఆర్సీబీ మేనెజ్మెంట్ తీరును ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. అతడి స్ధానంలో లూకీ ఫెర్గూసన్ లేదా టోప్లీకి అవకాశమివ్వాలని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఐపీఎల్-2024 వేలంలో జోసెఫ్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.11.50 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. కానీ జోసెఫ్ మాత్రం తన తీసుకున్న డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(83) మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆర్సీబీని గెలిపించలేకపోయాడు. RCB's premium pacer in IPL 2024, Alzarri Joseph (INR 11.5 Cr), hasn't lived up to the expectations in the first three games. 📸: BCCI/IPL pic.twitter.com/TYQlsHOA2O — CricTracker (@Cricketracker) March 29, 2024 Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
నిప్పులు చెరుగుతున్న కీమర్ రోచ్.. విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోచ్.. స్టీవ్ స్మిత్ (6), కెమరూన్ గ్రీన్ (8), ట్రవిస్ హెడ్లను (0) పెవిలియన్‌కు పంపగా.. అల్జరీ జోసఫ్ లబూషేన్ (3), మిచెల్ మార్ష్‌లను (21) ఔట్ చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 67/5గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (15), అలెక్స్ క్యారీ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 266/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించి, 311 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్, అరంగేట్రం ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీ చేసి, విండీస్ పైచేయి సాధించేలా చేశాడు. అతనికి ఆఖర్లో కీమర్ (8), షమార్ జోసఫ్ (3 నాటౌట్) కాసేపు సహకరించారు. దీనికి ముందు మిచెల్ స్టార్క్ (4/82) చెలరేగడంతో విండీస్ టాపార్డర్ పేకమేడలా కూలింది. స్టార్క్ ధాటికి విండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
హృదయం ముక్కలైంది.. సిరాజ్ పోస్ట్ వైరల్! అతడికి ఏకంగా రూ. 11 కోట్లు!
టీమిండియా స్టార్ బౌలర్, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్‌స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ నర్మగర్భ పోస్ట్‌పై టీమిండియా, ఆర్సీబీ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగమైన అతడికి.. వన్డే సిరీస్ సందర్భంగా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో.. డిసెంబరు 26న మొదలుకానున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్ హార్ట్‌బ్రేక్ ఎమోజీలను సిరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్-2024 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలు.. బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్‌కు నచ్చలేదేమో’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘కొంపదీసి సిరాజ్ గాయపడ్డాడా ఏంటి? ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఇండియా టెస్టు సిరీస్ గెలిచిందే లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరాజ్ ఈ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలతో ఏం సందేశం ఇస్తున్నట్లు?’’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సిరాజ్ ఆర్సీబీ కెప్టెన్ కావాలని భావించాడేమో! పాపం.. ఇంతకీ ఆర్సీబీ క్యాంప్‌లో ఏం జరుగుతోందో మీకేమైనా తెలుసా?’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్‌గా నియమించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ.. రోహిత్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌ను ముందుకు నడిపించిన సూర్యకుమార్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ క్రిప్టిక్ పోస్ట్ నేపథ్యంలో సూర్య పోస్ట్‌ను తెరమీదకు తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. తాను ఆ ఎమోజీలు పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో మహ్మద్ సిరాజ్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ వేలం-2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే: వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ అల్జారీ జోసెఫ్‌ను అత్యధికంగా రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అతడితో పాటు యశ్ దయాళ్ (రూ.5 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఇక సిరాజ్‌ను ఆర్సీబీ రూ. ఏడు కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. Did Siraj wake up and see his co-bowlers who ll be bowling at Chinnaswamy? pic.twitter.com/ZIDVVUvUD6 — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 Das (@SergioCSKK) December 21, 2023 Is there any secret message behind this? — King Kohli's Fan (@ViratFan100) December 21, 2023 Mohammed Siraj's Instagram story. pic.twitter.com/TSCqSCbshv — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 -
CPL 2023: జాన్సన్ చార్లెస్ ఊచకోత.. లూసియా కింగ్స్ ఘన విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. జాన్సన్ చార్లెస్ (52 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్సన్‌తో పాటు కొలిన్ మున్రో (33) ఓ మోస్తరుగా రాణించగా.. రోషన్ ప్రైమస్ (19), సికందర్ రజా (18), రోస్టన్ ఛేజ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బార్బడోస్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్ 3 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ 2, ఓబెద్ మెక్కాయ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 196 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన బార్బడోస్.. అల్జరీ జోసఫ్ (2.3-0-7-3), పీటర్ హ్యాట్జోగ్లో (3-0-4-2), రోషన్ ప్రైమస్ (2-0-11-2), సికందర్ రజా (1/21), మాథ్యూ ఫోర్డ్ (1/28), ఖారీ పిమెర్ (1/28) ధాటికి 17.3 ఓవర్లలో 105 పరుగులకు చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో న్యీమ్ యంగ్ (20), రకీమ్ కార్న్‌వాల్ (18), జేసన్ హోల్డర్ (18), వాన్ డర్ మెర్వ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. బార్బడోస్ ఆఖరి నుంచి రెండో స్థానానికి (ఐదో ప్లేస్) పడిపోయింది. పాయింట్ల పట్టికలో గయానా రెండో స్థానంలో ఉండగా.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, జమైకా తలైవాస్ 3, 4 స్థానాల్లో, సెయింట్ కిట్స్ పేట్రియాట్స్ ఆఖరి స్థానంలో నిలిచాయి. -
Ind vs WI: అయ్యో యశస్వి! ఆ పేసర్ వదల్లేదు.. ఓపికగా ఎదురుచూసి..
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్లోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ద్విశతకం దిశగా అడుగులు వేస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. అరంగేట్రంలోనే అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కాగా దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతున్న యశస్వి జైశ్వాల్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 సందర్భంగా తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటన రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరుకోవడం యశస్వికి కలిసి వచ్చింది. ఈ క్రమంలో జూలై 12న టీమిండియా- విండీస్ మధ్య ఆరంభమైన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఈ యువ ఆటగాడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకుని 143 పరుగుల వద్ద నిలిచిన యశస్వి.. మూడో రోజు తొలి సెషన్లో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులోనే అత్యంత పిన్న వయసులోనే ఈ మార్కు అందుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ క్రీజులో పాతుకుపోయి చుక్కలు చూపించాడు. పార్ట్ టైమ్ బౌలర్లతో సహా ఉన్న వాళ్లందరినీ దింపినప్పటికీ ఒక్కరికీ చిక్కలేదు. అయితే, మూడో రోజు తొలి సెషన్లో 171 పరుగుల వద్ద ఉన్న సమయంలో విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పదే పదే ఒకే చోట బాల్ వేస్తూ యశస్విని విసిగించాడు. 126వ ఓవర్ ఆరంభం నుంచే ఇద్దరి మధ్య పోటాపోటీ యుద్ధమే జరిగింది. ఈ ఓవర్లో యశస్వి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో ఓపికతో ఎదురుచూసిన అల్జారీ జోసెఫ్ ఆఖరి బంతికి అనుకున్నది సాధించాడు. 125.6వ డెలివరీ(outside off)లో యశస్వి బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి జోషువా డా సిల్వా చేతుల్లో పడింది. దీంతో యశస్వి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇక వచ్చీ రాగానే వైస్ కెప్టెన్ అజింక్య రహానే కేవలం 3 పరుగులు చేసి అవుటయ్యాడు. రోచ్ బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చదవండి: కోహ్లి నెమ్మదిగా! సీనియర్ అయి ఉండి ఏం లాభం?: ఇషాంత్ శర్మ IPL: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కోచ్ -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ప్రణాళికలు సిద్దం చేసిన విండీస్! ముందుగానే స్వదేశానికి
వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ ప్రయాణం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన విండీస్ అధికారికంగా వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్స్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. జూలై 5న ఒమన్, శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కరీబియన్ జట్టు సిద్దం కానుంది. దీంతో భారత్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్‌లను ముందుగానే స్వదేశానికి విండీస్ క్రికెట్ బోర్డు రప్పించింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఒమన్, శ్రీలంక జరగనున్న చివరి క్వాలిఫయర్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. విండీస్ జట్టు ప్రస్తుతం ట్రినిడాడ్‌లో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. వీరిద్దరూ నేరుగా విండీస్ జట్టుతో కలవనున్నారు. జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ నుంచి ముందుగానే స్వదేశానికి బయలుదేరనున్నారు. వారు కరేబియన్‌కు తిరిగి రానుందున చివరి రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు వారిపై వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని విండీస్ క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా జూలై 12 నుంచి డెమినికా వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ఇక టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు ఆతిథ్య విండీస్‌తో తలపడనుంది. భారత్‌తో టెస్టులకు వెస్టిండీస్ సన్నహాక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. -
ముంబైను చాంపియన్‌గా నిలబెట్టాలి: జొసెఫ్
ముంబై: ఐపీఎల్లో 11 ఏళ్ల రికార్డును ఆడిన మొదటి మ్యాచ్‌లోనే చెరిపేసి సంచలనం సృష్టించాడు ముంబై ఇండియన్స్ పేసర్ అల్జారి జొసెఫ్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ వెస్టిండీస్ యువ స్పీడ్ స్టర్.. కేవలం 12 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. ఓటమి అంచున ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనిపై మ్యాచ్ అనంతరం మీడియాతో అల్జారి మాట్లాడాడు. ‘ఇది గొప్ప ప్రారంభం. ఇంతకంటే మంచి ప్రారంభం అసాధ్యం. ప్రణాళిక ప్రకారమే బంతులు వేశా. బౌలింగ్ చేసే సమయంలో మ్యాచ్ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నిస్తా.. అందుకే వార్నర్‌ను ఔట్ చేసినా సంబరాలు చేసుకోలేదు. జట్టును గెలిపించేందుకు ఆడతా కానీ గుర్తింపు కోసం కాదు. ఈ టోర్నీలో ముంబైని చాంపియన్‌గా నిలబెట్టాలని భావిస్తున్నా’ అని జొసెఫ్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన పాక్ పేసర్ సొహైల్ తన్వీర్ 14 పరుగులకు 6 వికెట్లు తీయడం ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండేది. దాన్ని తాజాగా అల్జారి తిరగరాశాడు. దీనిపై విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా స్పందించాడు. ‘మనల్ని గర్వపడేలా చేసిన మరో విండీస్ యువ క్రికెటర్’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు.