PC: IPL.com
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన జోసెఫ్.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 17.00 ఎకానమితో ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు.
కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్.. జోసెఫ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడు వేసిన తొలి ఓవర్‌లోనే 2 సిక్స్‌లు బాది తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన జోసెఫ్ కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి ఇంకా ఛాన్స్‌లు కల్పిస్తున్న ఆర్సీబీ మేనెజ్‌మెంట్ తీరును ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
అతడి స్ధానంలో లూకీ ఫెర్గూసన్ లేదా టోప్లీకి అవకాశమివ్వాలని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఐపీఎల్-2024 వేలంలో జోసెఫ్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.11.50 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసింది. కానీ జోసెఫ్ మాత్రం తన తీసుకున్న డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(83) మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆర్సీబీని గెలిపించలేకపోయాడు.
RCB's premium pacer in IPL 2024, Alzarri Joseph (INR 11.5 Cr), hasn't lived up to the expectations in the first three games.
— CricTracker (@Cricketracker) March 29, 2024
📸: BCCI/IPL pic.twitter.com/TYQlsHOA2O
Venkatesh F-IYER 🔥🔥
— IndianPremierLeague (@IPL) March 29, 2024
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J
Comments
Please login to add a commentAdd a comment