కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. జాన్సన్ చార్లెస్ (52 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్సన్‌తో పాటు కొలిన్ మున్రో (33) ఓ మోస్తరుగా రాణించగా.. రోషన్ ప్రైమస్ (19), సికందర్ రజా (18), రోస్టన్ ఛేజ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బార్బడోస్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్ 3 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ 2, ఓబెద్ మెక్‌కాయ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
196 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన బార్బడోస్.. అల్జరీ జోసఫ్ (2.3-0-7-3), పీటర్ హ్యాట్జోగ్లో (3-0-4-2), రోషన్ ప్రైమస్ (2-0-11-2), సికందర్ రజా (1/21), మాథ్యూ ఫోర్డ్ (1/28), ఖారీ పిమెర్ (1/28) ధాటికి 17.3 ఓవర్లలో 105 పరుగులకు చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో న్యీమ్ యంగ్ (20), రకీమ్ కార్న్‌వాల్ (18), జేసన్ హోల్డర్ (18), వాన్ డర్ మెర్వ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. బార్బడోస్ ఆఖరి నుంచి రెండో స్థానానికి (ఐదో ప్లేస్) పడిపోయింది. పాయింట్ల పట్టికలో గయానా రెండో స్థానంలో ఉండగా.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, జమైకా తలైవాస్ 3, 4 స్థానాల్లో, సెయింట్ కిట్స్ పేట్రియాట్స్ ఆఖరి స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment