కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024 చివరి లీగ్ దశ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నికోలస్ పూరన్ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
HUNDRED FOR NICHOLAS POORAN IN CPL...!!!! 🙇
- Pooran is a beast in T20s, What a remarkable consistency. pic.twitter.com/2gn9VaD5c6— Johns. (@CricCrazyJohns) September 30, 2024
జేసన్ రాయ్ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్ 19, రసెల్ 9, టిమ్ డేవిడ్, పార్రిస్ డకౌట్ అయ్యారు. వారియర్స్ బౌలర్లలో షమార్ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, ప్రిటోరియస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్
212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్ హిండ్స్, వకార్ సలాంకీల్, నాథన్ ఎడ్వర్డ్స్ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్‌ను దెబ్బకొట్టారు. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
వారియర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (36), షాయ్ హోప్ (28), గుడకేశ్ మోటీ (26 నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్‌మైర్ (9), కీమో పాల్ (1), మొయిన్ అలీ (5), రొమారియో షెపర్డ్ (0), ప్రిటోరియస్ (0) విఫలమయ్యారు.
ఈ మ్యాచ్ ఫలితంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్ 1న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ట్రిన్‌బ్రాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ తలపడనుండగా.. అక్టోబర్ 2న జరిగే క్వాలిఫయర్-1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ పోటీ పడనున్నాయి.
లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచాయి.
చదవండి: చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment