Trinbago Knight Riders
-
పూరన్ సుడిగాలి శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024 చివరి లీగ్ దశ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నికోలస్ పూరన్ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. HUNDRED FOR NICHOLAS POORAN IN CPL...!!!! 🙇- Pooran is a beast in T20s, What a remarkable consistency. pic.twitter.com/2gn9VaD5c6— Johns. (@CricCrazyJohns) September 30, 2024జేసన్ రాయ్ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్ 19, రసెల్ 9, టిమ్ డేవిడ్, పార్రిస్ డకౌట్ అయ్యారు. వారియర్స్ బౌలర్లలో షమార్ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, ప్రిటోరియస్ తలో వికెట్ దక్కించుకున్నారు.137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్ హిండ్స్, వకార్ సలాంకీల్, నాథన్ ఎడ్వర్డ్స్ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్‌ను దెబ్బకొట్టారు. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (36), షాయ్ హోప్ (28), గుడకేశ్ మోటీ (26 నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్‌మైర్ (9), కీమో పాల్ (1), మొయిన్ అలీ (5), రొమారియో షెపర్డ్ (0), ప్రిటోరియస్ (0) విఫలమయ్యారు.ఈ మ్యాచ్ ఫలితంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్ 1న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ట్రిన్బ్రాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ తలపడనుండగా.. అక్టోబర్ 2న జరిగే క్వాలిఫయర్-1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచాయి.చదవండి: చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం -
నికోలస్ పూరన్ ఊచకోత.. 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో(వీడియో)
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం(ఆగస్టు 31) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో టీకేఆర్ ఘన విజయం సాధించింది. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది. సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో మైఖల్ లూయిస్(56), స్టబ్స్(39), ఎవిన్ లూయిస్(39) మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిచిపించలేకపోయారు. ట్రినిడాడ్ బౌలర్లలో లిటిల్,నరైన్, వఖార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్, హిండ్స్ చెరో వికెట్ పడగొట్టారు.పూరన్, కీసీ కార్తీ ఊచకోత..తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టేకేఆర్ బ్యాటర్లలో నికోలస్ పూరన్, కీస్ కార్తీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. పూరన్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేయగా.. కార్తీ 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. సెయింట్స్ కిట్స్ బౌలర్లలో నోకియా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సీపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. Nicholas Pooran is the six hitting Machine and having the form of his life.Scored another brilliant 97 and now holds the record of most sixes in a calendar year. Now He has 139 sixes and still 4 months is remaining 🥶https://t.co/tWApgR9iN1— Sujeet Suman (@sujeetsuman1991) September 1, 2024 -
రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరిన పోలార్డ్ టీమ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ నేతృత్వం వహిస్తున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి ఫైనల్‌కు చేరింది. ఈ లీగ్‌లో నైట్‌రైడర్స్‌తో పాటు అమెజాన్ వారియర్స్ కూడా ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరినప్పటికీ, ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. అయితే నైట్‌రైడర్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు ఫైనల్స్‌లో విజయాలు సాధించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్‌పై కన్నేసింది. సీపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ (4) రికార్డు నైట్‌రైడర్స్ పేరిటే ఉంది. నైట్‌రైడర్స్ తర్వాత జమైకా తల్లావాస్ మూడు సార్లు, బార్బడోస్ రాయల్స్ రెండు సార్లు, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఓసారి సీపీఎల్ టైటిల్ సాధించాయి. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎడిషన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన నైట్‌రైడర్స్, క్వాలిఫయర్ 1లో గయానా అమెజాన్ వారియర్స్‌పై విజయం సాధించి, నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆ జట్టు అమెజాన్ వారియర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. సైమ్ అయూబ్ (49), అజమ్ ఖాన్ (36) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో వకార్ సలామ్‌ఖీల్, టెర్రెన్స్ హిండ్స్ చెరో 2 వికెట్లు.. అకీల్ హొస్సేన్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. చాడ్విక్ వాల్టన్ అజేయమైన 80 పరుగులతో నైట్‌రైడర్స్‌ను గెలిపించాడు. పూరన్ (33), పోలార్డ్ (23) ఓ మోస్తరుగా రాణించారు. వారియర్స్ బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 2, ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ పడగొట్టారు. జమైకా తల్లావాస్, అమెజాన్ వారియర్స్ మధ్య సెప్టెంబర్ 23న జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో నైట్‌రైడర్స్ ఫైనల్స్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 25న జరుగనుంది. -
శివాలెత్తిన గప్తిల్.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్‌కు పోలార్డ్ (32 బంతుల్లో 46; ఫోర్, 4 సిక్సర్లు), మార్క్ దెయాల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. Raise your bat Martin Guptill. What a knock from the kiwi sensation 🙌 #CPL23 #BRvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Betbarter @BetBarteronline pic.twitter.com/GdqWmEzPx5 — CPL T20 (@CPL) August 31, 2023 నైట్‌రైడర్స్‌లో గప్తిల్, పోలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్ (6), ఆండ్రీ రసెల్ (5), డ్వేన్ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్ ధాటికి బార్బడోస్ బౌలర్ ఓబెద్ మెక్కాయ్ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్ మరో బార్బడోస్ బౌలర్ రకీమ్ కార్న్‌వాల్‌ను కూడా ఆడుకున్నాడు. కార్న్‌వాల్ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2.. కైస్ అహ్మద్, వాన్ డర్ మెర్వ్ తలో వికెట్ దక్కించుకున్నారు. వకార్ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్.. నైట్‌రైడర్స్ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్.. వకార్ సలామ్ కైల్ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్ (2-0-13-2), అకీల్ హొసేన్ (4-0-16-2), సునీల్ నరైన్ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రకీమ్ కార్న్‌వాల్, కైల్ మేయర్స్ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్ (5), అథనేజ్ (2), కెవిన్ విక్హమ్ (9), యంగ్ (3), వాన్ డర్ మెర్వ్ (3), ఓబెద్ మెక్ కాయ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్ హోల్డర్ (14), రోవ్‌మన్ పావెల్ (10), కైస్ అహ్మద్ (10 నాటౌట్) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. -
CPL 2023: క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ ప్రయోగం.. తొలి బాధితుడిగా..!
క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్ జారీ చేయబడింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా సునీల్ నరైన్ చరిత్రపుటల్లోకెక్కాడు. Red Card in cricket. So apparently, captain gets to pick who they have to send out of the field. Dhoni might have a lot of options if this comes in IPL.pic.twitter.com/gycU62MmAF — Silly Point (@FarziCricketer) August 28, 2023 స్లో ఓవర్‌రేట్ కారణంగా జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉండటంతో, అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్ నరైన్ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ప్రతిపాదించగా.. ఫీల్డ్ అంపైర్ నరైన్‌కు రెడ్ కార్డ్ చూపించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లోనే తొలిసారి క్రికెట్లో ఈ రెడ్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఫుట్‌బాల్‌లో ఈ రెడ్ కార్డ్ విధానాన్ని మనం తరుచూ చూస్తుంటాం. అయితే క్రికెట్లో మాత్రం ఇదే తొలిసారి. ఫుట్‌బాల్‌లో ఓ ఆటగాడు కఠినమైన ఫౌల్కు పాల్పడినప్పుడు రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి, మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే క్రికెట్లో ఫుట్బాల్లోలా కాకుండా స్లో ఓవర్ రేట్‌కు పెనాల్టీగా ఈ రెడ్ కార్డ్‌ను ఇష్యూ చేస్తారు. ఓ ఇన్నింగ్స్‌లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే, రెడ్ కార్డ్‌ను జారీ చేస్తారు. తొలిసారి నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్‌ను (ఐదో ఫీల్డర్), రెండో సారి అదే రిపీటైతే మరో ఫీల్డర్‌ను (ఆరో ఫీల్డర్) 20 యార్డ్స్ సర్కిల్‌లోకి తీసుకరావాల్సి ఉంటుంది. ఇక ఇదే మూడోసారి రిపీటైతే మాత్రం జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. నిన్నటి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 17, 18, 19వ ఓవర్లను కోటా సమయంలో పూర్తి చేయకపోవడంతో అంపైర్ ఆ జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్‌రైడర్స్ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్ కొనసాగించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. 179 పరుగుల లక్ష్యఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. -
కీరన్ పొలార్డ్ ఊచకోత.. కేవలం 16 బంతుల్లోనే! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో రుథర్ఫర్డ్(38 బంతుల్లో 62 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రావో రెండు వికెట్లు సాధించాడు. పూరన్, పొలార్డ్ విధ్వంసం.. ఇక 179 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ ఊదిపడేసింది. 17.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లలో పూరన్, పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో పూరన్ 61 పరుగులు చేయగా.. పొలార్డ్ 16 బంతుల్లో 5 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఇజారుల్హక్ నవీద్‌కు పొలార్డ్ చుక్కలు చూపించాడు. ఇజారుల్హక్ వేసిన 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Glenn Maxwell Ankle Injury: ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 -
'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్.. బేబీ ఏబీ అని పిలుచుకున్న డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినప్పటికి వరుసగా ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన బ్రెవిస్ 30 పరుగులు పిండుకున్నాడు. సీపీఎల్‌లో డెవాల్డ్ బ్రెవిస్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గురువారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అకిల్ హొసెన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని మిస్ చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత వరుస మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తయింది. 20వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన డారిన్ దుపావిల్లన్ బౌలింగ్‌లో చివరి రెండు బంతులు ఆడిన బ్రెవిస్ రెండు సిక్సర్లు బాదాడు. అలా తాను ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికి... ఓవర్లు అయిపోవడంతో తృటిలో ఆరు సిక్సర్ల రికార్డు మిస్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో సెంట్ కిట్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 7 పరుగులుతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెవాల్డ్ బ్రెవిస్ 30 నాటౌట్, బ్రావో 23 పరుగులు చేశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Dewald Brevis 5 sixes in a row 30*(6) 🔥🔥🔥 pic.twitter.com/faGyEvD84z — ° (@anubhav__tweets) September 22, 2022 చదవండి: ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం.. -
విధ్వంసం సృష్టించిన రస్సెల్.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు! వీడియో వైరల్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కరిబీయన్ దేశీవాళీ టోర్నీ 'సిక్స్టీ' టీ10 లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లోభాగంగా శనివారం సెయింట్ కిట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లు వార్నర్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రస్సెల్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. రస్సెల్ కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 72 పరుగులు సాధించాడు. కాగా ఇదే మ్యాచ్‌లో రస్సెల్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది సునామీ సృష్టించాడు. ఈ టోర్నీ రూల్స్ ప్రకారం.. ఏ బ్యాటర్ అయితే ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్‌లో ఉంటాడో తరువాతి ఓవర్ తొలి బంతిని ఆ బ్యాటరే ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన డొమానిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో అఖరి నాలుగు బంతులకు నాలుగు సిక్స్‌లు బాదిన రస్సెల్.. తర్వాతి ఓవర్ వేసిన జోన్-రస్ జగ్గేసర్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను రస్సెల్ సిక్సర్లగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రస్సెల్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. తద్వారా నైట్ రైడర్స్ చేతిలో సెయింట్ కిట్స్ మూడు పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్! Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament. 8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj — 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022 -
షెఫర్డ్ అద్భుత స్పెల్.. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ
సెంట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో బుధవారం గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. లీగ్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో గయానా వారియర్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉడాన 21, నరైన్ 21 పరుగులు చేశారు. రొమారియె షెఫర్డ్ , మహ్మద్ హఫీజ్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. హెట్‌మైర్ , నికోలస్ పూరన్‌లు 27 పరుగులు చేశారు. చదవండి: పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు మ్యాచ్‌లో ఫలితం రాకపోవడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. ఇక ట్రిన్‌బాగో సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే షెఫర్డ్ తన బౌలింగ్ మ్యాజిక్‌ను చూపించాడు. షెఫర్డ్ వేసిన తొలి బంతికే పొలార్డ్ ఔట్ కావడంతో విజయానికి ఐదు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉంది. రెండో బంతికి సింగిల్ రాగా.. మూడు బంతికి పరుగు రాలేదు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు రాగా.. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాకపోవడం.. ఆరో బంతికి సింగిల్ రావడంతో ట్రిన్‌బాగో నాలుగు పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ విజయంతో గయానా వారియర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. మ్యాచ్‌లో ఓడినప్పటికీ ట్రిన్‌బాగో మూడో స్థానంలోనే కొనసాగుతుంది. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి..
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతిని సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని(డబుల్ వైడ్) సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. అందలేదు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వారు కూడా దీన్ని వైడ్‌గా ప్రకటిస్తారు. అయితే, ఫీల్డ్ అంపైర్ నిగెల్ డుగుయిడ్ ఈ బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Polly : Are you blind? Umpire : Yes Pollard walks away 😂😂😂 #TKRvSLK #CPL2021 @KieronPollard55 pic.twitter.com/NGjSdMqmYu — Thakur (@hassam_sajjad) August 31, 2021 దీనిపై నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ పొలార్డ్ తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశాడు. నిర్ధేశిత ప్రాంతంలో కాకుండా వికెట్లకు దూరంగా వెళ్లి 30 యార్డ్ సర్కిల్ దగ్గర నిలబడి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో చూసిన అభిమానుల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంపైర్ తప్పిదాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని కొందరంటుంటే.. వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని మరికొందరు ట్వీటారు. మొత్తానికి అభిమానులు సదరు అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్), టిమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆండ్రీ ఫ్లెచర్ ( 55 బంతుల్లో 81; 6 ఫోర్లు, నాలుగ సిక్సర్లు) ఒంటరి పోరాటం వృధా అయ్యింది. రవి రాంపాల్ మూడు వికెట్లతో లూసియా కింగ్స్ పతనాన్ని శాసించాడు. చదవండి: ఏ దేశ క్రికెట్ జట్టైనా అఫ్గాన్‌లో పర్యటించవచ్చు: తాలిబన్ ప్రతినిధి -
నేటి నుంచి ధనాధన్ క్రికెట్ లీగ్ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం
సెయింట్ కిట్స్: ఐపీఎల్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ కలిగిన కరీబియన్ ప్రిమియర్ లీగ్-2021 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఐపీఎల్‌ను తలపించేలా భారీ షాట్లతో అలరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు సిద్ధంగా ఉన్నారు. విండీస్ విధ్వంసకర వీరులు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో సహా వివిధ దేశాలకు చెందిన చాలా మంది స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. దీంతో ఐపీఎల్‌కు ముందే ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. సెయింట్ కిట్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్(నికోలస్ పూరన్ జట్టు), ట్రింబాగో నైట్ రైడర్స్(పోలార్డ్ జట్టు) తలపడనున్నాయి. ఇదిలా ఉంటే, సీపీఎల్-2021లో భాగంగా జరిగే మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత సహా మరో 100 దేశాల్లో ఈ మ్యాచ్‌లు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్బుక్, యుట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని అంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే అనుమితిస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 15న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ లీగ్ ముగియనుండగా, సరిగ్గా నాలుగు రోజుల తర్వాత(సెప్టెంబర్19) యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్‌పై బంతితో దాడి -
అజేయ విజేత నైట్‌రైడర్స్
తరోబా (ట్రినిడాడ్): కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజయ యాత్ర టైటిల్ గెలుచుకోవడంతో ముగిసింది. టోర్నీలో పరాజయమనేదే లేకుండా సాగిన ఈ జట్టు వరుసగా 12వ మ్యాచ్ గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జూక్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జూక్స్ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా...కీరన్ పొలార్డ్ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. లెండిన్ సిమన్స్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 బంతుల్లో అభేద్యంగా 138 పరుగులు జోడించారు. ట్రినిడాడ్ జట్టు సీపీఎల్ టైటిల్ గెలవడం నాలుగో సారి కావడం విశేషం. -
ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్
టరూబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో): కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీ తాజా సీజన్లో లీగ్ దశను అజేయంగా దాటిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సెమీఫైనల్లోనూ అదే దూకుడును కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నైట్‌రైడర్స్ 9 వికెట్లతో జమైకా తలవాస్‌పై గెలుపొందింది. దాంతో సీపీఎల్ టైటిల్ పోరుకు మూడోసారి అర్హత సాధించింది. బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, జూహీ చావ్లాలకు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు గతంలో 2017, 2018 సీజన్లో ఫైనల్ చేరి చాంపియన్‌గా నిలిచింది. నైట్‌రైడర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలుత జమైకా 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. అకీల్ హుసీన్ (3/14), క్యారీ పియరీ (2/29) ప్రత్యర్థిని కుదురుకునే ప్రయత్నం చేయలేదు. బోనర్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు), రోవ్మాన్ పొవెల్ (35 బంతుల్లో 33; 1 ఫోరు, 1 సిక్స్) తలవాస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి 111 చేసి గెలుపొందింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ అజేయ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించాడు. అతడికి టియాన్ వెబ్‌స్టర్ (43 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. వీరు అభేద్యమైన రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్ తలపడుతుంది. -
వావ్.. పదికి పదికి గెలిచారు
టరూబా: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ (టీకేఆర్) జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత సెయింట్ కిట్స్ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ బౌలర్ ఫవాద్ అహ్మద్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.(చదవండి: త్వరలో ఆటకు బెల్ బైబై) అనంతరం నైట్‌రైడర్స్ జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్ (33 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్ జట్టు లీగ్ దశలో 20 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. టీకేఆర్ జట్టుతోపాటు గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూయిస్ జూక్స్, జమైకా తలవాస్ జట్లు కూడా సెమీఫైనల్ చేరాయి. సోమవారం విశ్రాంతి దినం. 8వ తేదీన సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్‌ను 10వ తేదీన నిర్వహిస్తారు.(చదవండి: మనకు పనిభారం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే..: కోహ్లి) -
రికార్డు ఫిఫ్టీతో చెలరేగిపోయాడు..!
బ్రిడ్జిటౌన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినీ చెలరేగి పోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా బార్బోడాస్ ట్రిడెంట్స్ తరఫున ఆడుతున్న డుమనీ.. గురువారం ట్రిన్‌బాగ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీని 15 బంతుల్లోనే సాధించడం ఇక్కడ విశేషం. సీపీఎల్‌లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా నమోదైంది. తొలి మూడు పరుగులు చేయడానికి ఐదు బంతులు ఆడిన డుమినీ.. ఆ తర్వాత మెరుపులు మెరిపించాడు. మిగతా 47 పరుగుల్ని మరో 10 బంతుల్లో సాధించి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి సీపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఎవిన్ లూయిస్ సాధించగా, దాన్ని డుమినీ బ్రేక్ చేశాడు. ఈనెల ఆరంభంలో లూయిస్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌లో డుమినీకి జతగా చార్లెస్(58), కార్టర్(51)లు రాణించడంతో బార్బోడాస్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఆ తర్వాత 193 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. దాంతో బార్బోడాస్ 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. హేడన్ వాల్ష్ ఐదు వికెట్లతో నైట్‌రైడర్స్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా డుమినీ రెండు వికెట్లు సాధించాడు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డారెన్ బ్రేవో(28)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
దినేష్ కార్తీక్‌కు ఊరట
న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌కు ఊరట లభించింది. బోర్డు ఒప్పంద నియమావళిని ఉల్లంఘించినందుకు తనను క్షమించాలని కోరుతూ బేషరతు క్షమాపణ తెలిపిన అతడిని బీసీసీఐ మన్నించింది. గత నెలలో బోర్డు అనుమతి లేకుండా కరీబియన్ లీగ్‌లో షారుఖ్ ఖాన్ ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మ్యాచ్‌ను ఆ జట్టు జెర్సీ వేసుకొని డ్రెస్సింగ్ రూం నుంచి కార్తీక్ వీక్షించాడు. దాంతో ఆగ్రహించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ సభ్యుడైన అతనికి షోకాజు నోటీసులు పంపింది. దీనికి సమాధానంగా కార్తీక్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆహా్వనం మేరకు మ్యాచ్ చూడటానికి వెళ్లానని, అతని కోరిక మేరకే జెర్సీ వేసుకున్నానని వివరణ ఇచ్చాడు. దీనిపై బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ఇది ముగిసిన అధ్యాయమని అన్నారు. -
బ్యాటింగ్ మెరుపులతో సరికొత్త రికార్డు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన ట్రిన్‌బాగో నైట్ రైడ్రైడర్స్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. శుక్రవారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ విజృంభించి ఆడింది. ఓపెనర్ సునీల్ నరైన్(20) తొందరగానే పెవిలియన్ చేరినప్పటికీ, మరొక ఓపెనర్ లెండి సిమ్మన్స్(86; 42 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. దాంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి మున్రో జత కలవడంతో ఇద్దరూ ఎడాపెడా బాదుతూ జమైకా బౌలర్లకు దడపుట్టించారు. మున్రో(96 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు సిమ్మన్స్‌తో కలిసి 124 పరుగుల్ని జత చేశాడు. అటు తర్వాత కెప్టెన్ కీరన్ పొలార్డ్(45 నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లుకు 267 పరుగులు చేసింది. ఇది కరీబియన్ లీగ్‌లో అత్యధిక స్కోరు కాగా, ఓవరాల్ టీ20ల్లో మూడో అత్యుత్తమంగా నమోదైంది. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ 278 పరుగులతో టాప్‌లో ఉంది. నైట్‌రైడర్స్ నిర్దేశించిన రికార్డు టార్గెట్‌ను ఛేదించే క్రమంలో జమైకా ధీటుగానే బదులిచ్చినా ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులకు పరిమితమై పరాజయం చెందింది. గేల్(39), గ్లెన్ ఫిలిప్స్(62), జావెల్లె గ్లెన్(34 నాటౌట్), రామల్ లూయిస్(37 నాటౌట్)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. గత రెండు సీపీఎల్ టైటిల్స్‌ను నైట్‌రైడర్స్ గెలిచిన సంగతి తెలిసిందే. -
నైట్‌రైడర్స్‌దే టైటిల్
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుపై గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నైట్‌రైడర్స్ ఓపెనర్లు దినేశ్ రామ్‌దిన్(24), బ్రెండన్ మెకల్లమ్(39)లు మంచి ఆరంభాన్నివ్వగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు కొలిన్ మున్రో(68; 39 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. -
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు
సెయింట్‌కిట్స్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ప్రధానంగా 19 ఓవర్లో బ్రేవో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోసెఫ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి పరుగులేమీ చేయని బ్రేవో.. ఆపై వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒక్కో సిక్సర్‌ను ఒక్కో తరహాలో పెవిలియన్‌లోకి కొట్టాడు. మొత్తంగా 11 బంతులు ఎదుర్కొన్న బ్రేవో.. 1 ఫోర్, 5 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
బ్యాట్స్‌మన్ సస్పెన్షన్
ట్రిబాంగో నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ విలియమ్ పెర్కిన్స్ వేటు పడింది. కాంట్రాక్టును ఉల్లఘించినందుకు అతడు సస్పెన్షన్ కు గురయ్యాడు. వెస్టిండీస్ లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) మిగతా మ్యాచుల్లో అతడు ఆడకుండా నిషేధం విధించారు. థర్డ్ పార్టీతో చేతులు కలిపినందుకు అతడిపై చర్య తీసుకున్నారు. ప్లేయర్ కాంట్రాక్టు నిబంధనల్లో 10.1.1, 10.1.2లను అతడు ఉల్లంఘించినట్టు నిర్థారించారు. సీపీఎల్ సెక్యురిటీ టీమ్, ఐసీసీ అవినీతి వ్యతిరేక బృందం మేనేజర్ రిచర్డ్ రెనాల్డ్స్ సూచనల మేరకు పెర్కిన్స్ పై వేటు పడింది. తనపై తీసుకున్న చర్యలను అతడు అంగీకరించాడు. సీపీఎల్ తర్వాతి మ్యాచులకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ట్రిబాంగో నైట్ రైడర్స్ నేడు జరిగే ప్లేఆఫ్ మ్యాచ్ లో సెయింట్ లూసియా జూక్స్ తో తలపడనుంది.