Twitter Pic
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కరిబీయన్ దేశీవాళీ టోర్నీ 'సిక్స్‌టీ' టీ10 లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లోభాగంగా శనివారం సెయింట్ కిట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్లు వార్నర్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రస్సెల్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
రస్సెల్ కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 72 పరుగులు సాధించాడు. కాగా ఇదే మ్యాచ్‌లో రస్సెల్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది సునామీ సృష్టించాడు. ఈ టోర్నీ రూల్స్ ప్రకారం.. ఏ బ్యాటర్ అయితే ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్‌లో ఉంటాడో తరువాతి ఓవర్ తొలి బంతిని ఆ బ్యాటరే ఎదుర్కొంటాడు.
ఈ క్రమంలో నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన డొమానిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో అఖరి నాలుగు బంతులకు నాలుగు సిక్స్‌లు బాదిన రస్సెల్.. తర్వాతి ఓవర్ వేసిన జోన్-రస్ జగ్గేసర్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను రస్సెల్ సిక్సర్లగా మలిచాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రస్సెల్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. తద్వారా నైట్ రైడర్స్ చేతిలో సెయింట్ కిట్స్ మూడు పరుగుల తేడాతో పరాజాయం పాలైంది.
చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్!
Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament.
— 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022
8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj
Comments
Please login to add a commentAdd a comment