
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
పీఎన్‌జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్‌జీని వలా, బావు ఆదుకున్నారు.
వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్‌జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు.