న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌కు ఊరట లభించింది. బోర్డు ఒప్పంద నియమావళిని ఉల్లంఘించినందుకు తనను క్షమించాలని కోరుతూ బేషరతు క్షమాపణ తెలిపిన అతడిని బీసీసీఐ మన్నించింది. గత నెలలో బోర్డు అనుమతి లేకుండా కరీబియన్ లీగ్‌లో షారుఖ్ ఖాన్ ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మ్యాచ్‌ను ఆ జట్టు జెర్సీ వేసుకొని డ్రెస్సింగ్ రూం నుంచి కార్తీక్ వీక్షించాడు. దాంతో ఆగ్రహించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ సభ్యుడైన అతనికి షోకాజు నోటీసులు పంపింది. దీనికి సమాధానంగా కార్తీక్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆహా్వనం మేరకు మ్యాచ్ చూడటానికి వెళ్లానని, అతని కోరిక మేరకే జెర్సీ వేసుకున్నానని వివరణ ఇచ్చాడు. దీనిపై బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ఇది ముగిసిన అధ్యాయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment