బ్యాట్స్మన్ సస్పెన్షన్
ట్రిబాంగో నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ విలియమ్ పెర్కిన్స్ వేటు పడింది. కాంట్రాక్టును ఉల్లఘించినందుకు అతడు సస్పెన్షన్ కు గురయ్యాడు. వెస్టిండీస్ లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) మిగతా మ్యాచుల్లో అతడు ఆడకుండా నిషేధం విధించారు. థర్డ్ పార్టీతో చేతులు కలిపినందుకు అతడిపై చర్య తీసుకున్నారు. ప్లేయర్ కాంట్రాక్టు నిబంధనల్లో 10.1.1, 10.1.2లను అతడు ఉల్లంఘించినట్టు నిర్థారించారు. సీపీఎల్ సెక్యురిటీ టీమ్, ఐసీసీ అవినీతి వ్యతిరేక బృందం మేనేజర్ రిచర్డ్ రెనాల్డ్స్ సూచనల మేరకు పెర్కిన్స్ పై వేటు పడింది.
తనపై తీసుకున్న చర్యలను అతడు అంగీకరించాడు. సీపీఎల్ తర్వాతి మ్యాచులకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ట్రిబాంగో నైట్ రైడర్స్ నేడు జరిగే ప్లేఆఫ్ మ్యాచ్ లో సెయింట్ లూసియా జూక్స్ తో తలపడనుంది.