కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం(ఆగస్టు 31) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో టీకేఆర్ ఘన విజయం సాధించింది.
251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది. సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో మైఖల్ లూయిస్(56), స్టబ్స్(39), ఎవిన్ లూయిస్(39) మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిచిపించలేకపోయారు. ట్రినిడాడ్ బౌలర్లలో లిటిల్,నరైన్, వఖార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్, హిండ్స్ చెరో వికెట్ పడగొట్టారు.
పూరన్, కీసీ కార్తీ ఊచకోత..
తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టేకేఆర్ బ్యాటర్లలో నికోలస్ పూరన్, కీస్ కార్తీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు.
పూరన్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేయగా.. కార్తీ 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. సెయింట్స్ కిట్స్ బౌలర్లలో నోకియా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సీపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
Nicholas Pooran is the six hitting Machine and having the form of his life.
Scored another brilliant 97 and now holds the record of most sixes in a calendar year. Now He has 139 sixes and still 4 months is remaining 🥶https://t.co/tWApgR9iN1— Sujeet Suman (@sujeetsuman1991) September 1, 2024
Comments
Please login to add a commentAdd a comment